తిరిగి మళ్లీ అభివృద్ధి బాటలోకి వస్తాం.. మోడీ ఆశాభావం

కరోనా కట్టడికోసం మనం కఠినమైన నిర్ణయాలు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అలాగే ఆర్ధికవ్యవస్థ బాగుకోసం చర్యలు తప్పవని ప్రధాని అన్నారు. Confederation of Indian Industry’s (CII) వార్షికోత్సవంలో ఆయన ఆత్మవిశ్వాసంతోపాటు, ఆశాభావంతో మాట్లాడారు. గడ్డురోజులు పోయాయి. మళ్లీ పాత మెరుపులను చూస్తామన్నట్లుగా మాట్లాడారు. మనం కచ్చితంగా వృద్ధిబాటలోకొస్తాం. పాత అభివృద్ధిని మళ్లీ సాధిస్తామని CIIని ఉద్దేశించి వీడియోకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. “కరోనా మనల్నివెనక్కునెట్టింది.
లాక్‌డౌన్, ఆ తర్వాత అన్‌లాక్ ఫేస్ 1తో ఇండియాకూడా దాన్ని వెనక్కునెట్టింది. ఆర్దికవ్యవస్థలో ఎక్కువ భాగం జూన్8 తర్వాత ఓపెన్ అవుతుంది.” తనకెందుకంత విశ్వాసముందో కూడా మోడీ చెప్పారు. “ఈ సంక్షోభసమయంలో నేను ఇంతలా ఎందుకంత ఆత్మవిశ్వాసంతో ఉన్నానని కొంతమంది ప్రజలు అనుకోవచ్చు. సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఇండియాకున్న సమర్ధతమీద నాకు గొప్పనమ్మకముంది. ఇండియా నైపుణ్యం, టెక్నాలజీని నమ్ముతాను. ఇండియాకున్న తెలివి, ఇన్నోవేషన్ నమ్ముతాను. మన దేశ రైతులు, చిన్న పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామికరంగ నాయకులను నేను నమ్ముతాను”
ప్రపంచమంతా కరోనావైరస్ గుప్పిటచిక్కన సమయంలో భారదేశం రెడీ అయినందుకే, అన్‌లాక్ ఫేజ్ 1లోకి ప్రవేశించింది. 20కోట్ల ప్యాకేజీ, విధానపరమైన సంస్కరణలతో లాక్‌డౌన్ ఇబ్బందులను, కరోనా వైరస్‌ను తట్టుకోగలదని మోడీ అంటున్నారు. శనివారం కేంద్రం మూడుదశల అన్‌లాక్‌లో భాగంగా మొదటి దశలో చాలా మినహాయింపులనిచ్చింది. వ్యాపారానికి కొంత ఊపిరినిచ్చింది. ప్రార్ధనామందిరాలు, షాపింగ్ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లను ప్రారంభించుకోవడానికి జూన్8 నుంచి అనుమతిచ్చింది. దీనికి unlock Phase1అని పేరుపెట్టింది. మరో రెండు ఫేజ్ లు రానున్నాయి.
Read: రిటైర్మెంట్ రోజు ఆఫీసులోనే నేలపై నిద్రపోయిన ఐపీఎస్ అధికారి:దటీజ్ జాకబ్ థామస్