WhatsApp New Feature : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మిస్డ్ కాల్స్‌కు డోంట్ డిస్టర్బ్ మోడ్ వస్తోంది.. గ్రూపు అడ్మిన్లదే బాధ్యత..!
WhatsApp New Feature : మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ WhatsApp సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి. యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపర్చేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తోంది. ఇప్పుడు వాట్సాప్ మిస్డ్ కాల్స్ కోసం డోంట్ డిస్టర్బ్ మోడ్ (Do Not Disturb mode) సపోర్ట్‌ను లాంచ్ చేస్తున్నట్లు సమాచారం.

WhatsApp rolls out Do Not Disturb mode support for missed calls Report
WhatsApp New Feature : మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ WhatsApp సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి. యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపర్చేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తోంది. ఇప్పుడు వాట్సాప్ మిస్డ్ కాల్స్ కోసం డోంట్ డిస్టర్బ్ మోడ్ (Do Not Disturb mode) సపోర్ట్‌ను లాంచ్ చేస్తున్నట్లు సమాచారం. WaBetaInfo నివేదిక ప్రకారం.. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న WhatsApp బీటా ద్వారా ఈ ఫీచర్ కొంతమంది బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది. రిపోర్ట్ ఫీచర్ ఎలా ఉంటుందో స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేస్తుంది.
ఆ తర్వాత, యూజర్ల కాల్స్ లిస్టులో “Silenced by Do Not Disturb” అనే కొత్త లేబుల్‌ను చూడవచ్చు. ఈ సమాచారం రిసీవర్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుందని నివేదిక తెలిపింది. మీరు చేయాల్సిన పని కారణంగా మీరు కాల్‌ని మిస్ చేసుకున్నారని కాలర్‌కు తెలియదు. మీ ఫోన్‌లో డిస్టర్బ్ చేయవద్దు మోడ్ లాంచ్ అయింది.
వాట్సాప్ అనేక కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. పెద్ద గ్రూపు చాట్‌లను ఆటోమాటిక్‌గా మ్యూట్ చేయవచ్చు. మీ కాంటాక్టుల లిస్టులో మీ సొంత ఫోన్ నంబర్‌తో చాట్ చేయవచ్చు. స్టేటస్ ద్వారా షేర్ చేసిన లింక్‌ల కోసం రిచ్ లింక్ ప్రివ్యూలను పొందవచ్చు. మెసేజింగ్ యాప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు కమ్యూనిటీల ఫీచర్‌లను అందించింది.

WhatsApp rolls out Do Not Disturb mode support for missed calls Report
WhatsApp కమ్యూనిటీలు సమర్ధవంతంగా నిర్వహించవచ్చు. వివిధ గ్రూపులను ఒకచోట చేర్చుకోవచ్చు. కంపెనీ ప్రకారం.. కమ్యూనిటీస్ ఫీచర్ అనేది యూజర్లు గ్రూప్‌లలో వాట్సాప్‌లో కనెక్ట్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో గ్రూపు కన్వర్ జేషన్స్ చేసుకునేందుకు ఫ్యామిలీ గ్రూపులు, ఫ్రెండ్లీ గ్రూపులు, ఆఫీసులు వంటి కమ్యూనిటీలు.. ఇలా మల్టీ గ్రూపులన్నీ ఒకే చోట కనెక్ట్ చేసుకోవచ్చునని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ పేర్కొంది. వాట్సాప్‌లో కమ్యూనిటీలను క్రియేట్ చేసుకోవచ్చు.
గ్రూపులకు గ్రూప్ అడ్మిన్‌ల బాధ్యత వహించాల్సి ఉంటుందని వాట్సాప్ తెలిపింది. అంతేకాకుండా, కొత్త గ్రూప్‌లను ఏర్పాటు చేయడం ద్వారా లేదా ముందుగా ఉన్న గ్రూపులను లింక్ చేయడం ద్వారా అడ్మిన్‌లు తమ కమ్యూనిటీలో ఏ గ్రూపులు జాయిన్ కావాలో ఎంచుకోవచ్చు. మరోవైపు, యూజర్లు కమ్యూనిటీల్లో కంట్రోల్ చేయవచ్చు. WhatsApp ప్రకారం.. యూజర్లు దుర్వినియోగాన్ని సులభంగా గుర్తించగలదు. అకౌంట్లను బ్లాక్ చేయవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..