shockingl video : కొమ్మకు వేలాడుతూ..ప్రసవించిన అనకొండ..!!
ఆకుపచ్చగా ఉండే అనకొండ కొమ్మకు వేలాడుతు ప్రసవించిన వీడియో వెన్నులో వణుకుపుట్టిస్తోంది.

Shockingl Video
when boa gives live delivery on tree : ఓ అనకొండకు కొండచిలువకు సంబంధించిన ఒక వీడియో నెటిజన్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. షాక్ కు గురిచేస్తోంది. ఓ కొమ్మకు చుట్టుకుని ఉన్న ఓ అనకొండ వేలాడుతునే పిల్లను ప్రసవించింది. ఆ తల్లి పొట్టలోంచి బయటకొచ్చిన ఆ అనకొండ పిల్ల పుట్టీ పుట్టగానే జరజరా పాక్కుంటూ తల్లిమీదకు ఎగబాకింది. ఒళ్లు జలదించే ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అత్యంత వేగంగా వైరల్గా మారిందీ వీడియో. ఈ వీడియోలో ఒక ఆడ కొండచిలువ… ఒక పిల్ల కొండచిలువకు జన్మనిచ్చింది. పాము గుడ్లు పెడుతుందని విన్నాంగానీ ఇలా పిల్లలను పెడుతుందని ఎప్పుడూ వినలేదని అంటున్నారు. కానీ పాముల్లో వేలకొద్దీ రకాలున్నాయి. వాటిలో విషపూరితమైనవి కొన్ని..విషయం లేనివి మరికొన్ని.
Read more : Shocking video: పక్షిపిల్లని వెంటాడి వేటాడి చంపిన భారీ తాబేలు
అలాగే గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేసే పాములు కొన్ని రకాలు. అలాగే పిల్లల్నికనే పాములు కొన్ని ఉంటాయి. అటువంటిదే ఈ అనకొండ. ఓ కొమ్మకు వేలాడుతునే పిల్లకు జన్మనిచ్చింది. అలా తల్లి కడుపులోంచి బయటకొచ్చిన పిల్ల అనకొండ తలా తోకా రెండూ ఒకేసారి బయటకు రాగా..మిగిలిన శరీరం అంతా తల్లికడుపులోంచి జర్రుమంటూ పాక్కుంటూ బయటకు వచ్చిన తోక మళ్లీ కడుపులోకి వెళ్లి జర్రుమంటూ బయటకొచ్చింది. అలా బయటపడ్డ పిల్ల అనకొండ తల్లిమీదకు జరజరా ఎగబాకింది.
ఈవీడియో ట్విట్టర్లో @sara_s_2020 పేరుతో షేర్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భయపడుతునే చూస్తున్నారు. చూస్తునే షేర్ చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ ఈ వీడియో నెటిజన్లను అమితంగా అలరిస్తునే వణికిస్తోంది. కాగా తల్లి అనకొండ ఆకుపచ్చరంగులో ఉంటే పుట్టిన పిల్ల అనకొండ ఎర్రటి రంగులో ఉంది. అది పెరిగి పెద్ద అయ్యాక తల్లి రంగులోకి మారుతుందట.
Boa constrictor giving live birth.#Tiredearth pic.twitter.com/gRSco1sUDC
— Sara Sanchez (@sara_s_2020) September 28, 2021