Winter Session of Parliament: కొవిడ్ నిబంధనలు లేకుండా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొవిడ్ నిబంధనలు లేకుండా జరగనున్నాయి. గత రెండేళ్లలో ఆ నిబంధనలను లేకుండా జరుగుతుండడం ఇదే తొలిసారి. డిసెంబరు 7 నుంచి 29 వరకు ఈ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. మొత్తం 17 రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు ఉంటాయని వివరించారు.

Parliament
Winter Session of Parliament: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొవిడ్ నిబంధనలు లేకుండా జరగనున్నాయి. గత రెండేళ్లలో ఆ నిబంధనలు లేకుండా జరుగుతుండడం ఇదే తొలిసారి. డిసెంబరు 7 నుంచి 29 వరకు ఈ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. మొత్తం 17 రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు ఉంటాయని వివరించారు.
పార్లమెంటు ముందుకు పలు బిల్లులు రానున్నాయి. ఉప రాష్ట్రపతిగా జగదీప్ దన్‌ఖడ్ ఎన్నికయిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు ఇవి. దేశంలో కరోనా విజృంభణ ప్రారంభమైనప్పటి నుంచి పార్లమెంట్ సమావేశాల్లో ప్రతి సారి కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గింది. రోజువారీ కేసులు 1000 కన్నా తక్కువగానే నమోదవుతున్నాయి.
దీంతో కరోనా నిబంధనలను సడలించారు. కాగా, ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. డిసెంబరు 1న గుజరాత్ అసెంబ్లీకి తొలిదశ ఎన్నికలు, 5న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తదుపరి రోజే (డిసెంబరు 8న) గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..