మానవత్వానికి మారు పేరు : కరోనా మృతదేహాలకు దహన సంస్కారాలు చేస్తున్న మహిళ

  • Published By: bheemraj ,Published On : August 19, 2020 / 07:09 PM IST
మానవత్వానికి మారు పేరు : కరోనా మృతదేహాలకు దహన సంస్కారాలు చేస్తున్న మహిళ

Updated On : August 20, 2020 / 7:05 AM IST

కరోనా సోకిందంటే దగ్గరికి రావడానికి కూడా జనాలు జంకుతున్నారు. సొంత కుటుంబ సభ్యులు సైతం దగ్గరకు రావడం లేదు. కరోనా మృతదేహాల దహన సంస్కారాలకు హాజరయ్యేందుకు ప్రజలు భయపడిపోతున్నారు. కొంతమంది సొంతింటి వాళ్లు చనిపోయినా దహనానికి ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాతో చనిపోయిన వారి దహన సంస్కారాలు చేస్తూ ఓ మహిళ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.



కరోనా వచ్చిన తర్వాత స్వంత కుటుంబ సభ్యులు, కొడుకు, భార్య, పిల్లలు అంతిమ యాత్రలో పాల్గొనే పరిస్థితి లేదు. స్మశాన వాటిక దగ్గర అంతిమ సంస్కారానికి రాని పరిస్థితి నెలకొంది. భద్రాచలం పుణ్యక్షేత్రంలో స్మశాన వాటిక లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా గోదావరి వరద ఉధృతి పెరిగిన ప్రతిసారి వైకుంఠధామం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది.

వైకుంఠధామం నీటిలో మునిగి పోయిన తర్వాత కాటి కాపరులు పూర్తిగా కరకట్టను నమ్ముకునే జీవిస్తున్నారు. చిన్నపిల్లలను సైతం కరకట్టపై పెట్టుకుని జీవినం కొనసాగిస్తున్నారు. కరోనాతో చనిపోయివారైనా, ఇతర అనారోగ్య సమస్యలతో మరణించిన వారందరినీ స్మశాన వాటిక లేకపోవడంతో భద్రాచలం కరకట్ట సమీపంలో ఉన్న వైకుంఠధామంలోనే అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. వర్షాకాలంలో సీజనల్ గా వరదలు వచ్చినప్పుడు దహన
సంస్కారాలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది.



భద్రాచలం పుణ్యక్షేత్రంలోని వైకుంఠదామంలో ఓ మహిళ.. దహన సంస్కారాలు చేస్తూ భర్త చనిపోయిన తర్వాత ఒంటరిగా తను ఇక్కడే ఉంటూ దహనం సంస్కారాలు చేస్తోంది. గోదావరి పెరుగుతుండటంతో చూసేందుకు వచ్చిన పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో సెల్ఫీలు దిగుతున్నారు.

మరోవైపు కరకట్టకు ఆనుకుని కొద్ది భాగంలోనే దహనం సంస్కారాలు చేస్తోంది. ఓ మహిళ..దహన సంస్కారాలు చేయడం ఆశ్యర్యానికి గురి చేస్తోంది. అటువంటి మహిళ దగ్గరుండి దహన సంస్కారాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.



మహిళ…
‘దాదాపు 18 సంవత్సరాల నుంచి స్మశాన వాటికలోనే నా భర్త, నేను పని చేస్తున్నాం. నా భర్త చనిపోయాక దహన సంస్కారాలు నేనే చేస్తున్నాను. ఫ్యామిలీ, పిల్లలను చూసుకుంటున్నాను. ఎలాంటి సమయంలోనైనా జనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా చనిపోయారన్న వివరాలను కనుగొని దహన సంస్కారాల కార్యక్రమాన్ని చేస్తున్నాను.
ఎన్నాళ్లని భయపడతాం..ఏ కార్యక్రమాన్నైనా ఆపొచ్చు.. కానీ దహన సంస్కారాలను ఆపరాదు. మృతదేహాలను ఇళ్ల ముందు పెట్టుకుని జనాలు బాధపడుతుంటారు. నాకు భయం అనేది లేదు.

కరోనా డెడ్ బాడీలు వస్తున్నాయి. సాధారణ డెడ్ బాడీలు వస్తున్నాయి. కరోనా వచ్చినప్పటి నుంచి రాత్రి పగలు డెడ్ బాడీలు వస్తున్నాయి. నిద్ర కూడా ఉండటం లేదు. అవి ఆపేది కాదని…కరోనా మృతదేహాలకు దహన సంస్కారాలు చేయాలని జనాలు అంటున్నారు.



డెడ్ బాడీతో ఒక్కరు, ఇద్దరి కంటే ఎక్కువ రావడం లేదు. డెడ్ బాడీ దగ్గరికి రావడానికి భయపడుతున్నారు. నేను వచ్చిన డెడ్ బాడీలను ఆపడం లేదని..అన్నింటికీ దహనం సంస్కారాలు నిర్వహిస్తున్నాను’ అని వివరించారు.