హోమ్ మినిస్టర్ అయిన మ‌హిళా కానిస్టేబుల్‌..

హోమ్ మినిస్టర్ అయిన మ‌హిళా కానిస్టేబుల్‌..

Updated On : March 8, 2021 / 5:26 PM IST

woman constable charge as home minister for day : అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం రోజున ఓ మ‌హిళా కానిస్టేబుల్‌కు అరుదైన గౌర‌వం ల‌భించింది. ఒకరోజు హోంమంత్రిగా పనిచేసే అవకాశం దక్కింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ మహిళా కానిస్టేబుల్ మీనాక్షి వ‌ర్మ ఒక రోజు హోంమంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ విష‌యాన్ని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా తెలిపారు.

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా త‌న చైర్‌ను ఓ రోజు పాటు కానిస్టేబుల్ మీనాక్షి వ‌ర్మ‌కు ఇచ్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ సందర్భంగా మీనాక్షీ వర్మ సమస్యలు తెలపటానికి వచ్చిన ప్రజల నుంచి పలు వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని తగిన విధంగా చర్యలు తీసుకోవాలని OSDని ఆదేశించారు.

ఈ సందర్భంగా కానిస్టేబుల్ మీనాక్షిని మంత్రి నరోత్తం మిశ్రా సత్కరించారు. మహిళా దినోత్సవం రోజున తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని మీనాక్షి అన్నారు. తాను హోంమంత్రిగా పనిచేసే అవకాశం తనకు దక్కుతుందని తాను కలలో కూడా ఊహించలేదని ఆనందం వ్యక్తంచేశారు.

కాగా ప్రజా సమస్యలను హోంమంత్రి దృష్టికి తీసుకొచ్చిన ప్రజలు అక్కడ మంత్రి కూర్చునే స్థానంలో ఓ మహిళా కానిస్టేబుల్ ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. మ‌రోవైపు మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌త‌మార్పుడుల‌ను వ్య‌తిరేకిస్తూ చేసిన చ‌ట్టానికి ఇవాళ అసెంబ్లీలో ఆమోదం ద‌క్కింది.