తెలంగాణలో బాలభీముడు, ఎన్ని కిలోల బరువుతో పుట్టాడో తెలుసా

2 నుంచి 3.5 కేజీల బరువుతో శిశువులు జన్మించడం సర్వ సాధారణం. ఇందులో పెద్ద వింత లేదు. పైగా ఆ

తెలంగాణలో బాలభీముడు, ఎన్ని కిలోల బరువుతో పుట్టాడో తెలుసా

Updated On : June 21, 2021 / 1:37 PM IST

2 నుంచి 3.5 కేజీల బరువుతో శిశువులు జన్మించడం సర్వ సాధారణం. ఇందులో పెద్ద వింత లేదు. పైగా ఆ

2 నుంచి 3.5 కేజీల బరువుతో శిశువులు జన్మించడం సర్వ సాధారణం. ఇందులో పెద్ద వింత లేదు. పైగా ఆ మాత్రం బరువు కచ్చితంగా ఉండాలి. అలా ఉంటే హెల్తీ అని కూడా చెబుతారు. కానీ దీనికి భిన్నంగా ఓ తల్లికి బాల భీముడే పుట్టాడు. ఆ బాబు బరువు చూసి తల్లే కాదు డాక్టర్లు కూడా నోరెళ్ల బెట్టారు. ఆ మహిళ 5.5 కిలోల బరువు కలిగిన మగ శిశువుకి జన్మనిచ్చింది.

నోరెళ్లబెట్టిన డాక్టర్లు, తల్లీబిడ్డ క్షేమం:
తెలంగాణ రాష్ట్రం నిర్మల్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రం ప్రసూతి ఆసుపత్రిలో మంగళవారం(జూన్ 23,2020) ఓ మహిళ మగబిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డ బరువు 5.5 కిలోలు. సోన్‌ మండలం లెఫ్ట్‌పోచంపాడ్‌కు చెందిన నేహా ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చింది. సాధారణ కాన్పునకు వీలుకాకపోవడంతో డాక్టర్లు రాజేందర్‌, సరోజ, మమత శస్త్రచికిత్స చేశారు. 5.5 కిలోల బరువుతో పండంటి మగబిడ్డ పుట్టాడు. పసికందు ఇంత బరువుతో జన్మించటం చూసి డాక్టర్లు విస్తుపోయారు. ఇలా జరగడం చాలా అరుదని చెప్పారు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. పుట్టగానే ఆ బిడ్డ న్యూస్ లోకి ఎక్కేయడంతో తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.

Read: తెలంగాణలో కొత్తగా  879 కరోనా కేసులు