బీసీసీఐ ఆస్తి ఎన్ని వేల కోట్లో తెలుసా?

బీసీసీఐ ఆస్తి ఎన్ని వేల కోట్లో తెలుసా?

Updated On : January 6, 2021 / 9:03 AM IST

BCCI Worth: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా రికార్డులకు ఎక్కిన బిసిసిఐ బోర్డు.. 2018-19 ఆర్థిక సంవత్సరం చివరినాటికి 14,489.80 కోట్ల రూపాయలతో అతిపెద్ద ఆస్తి ఉన్న క్రికెట్ బోర్డుగా మారింది. 2018–19 ఫైనాన్షియల్‌‌ ఇయర్‌‌ ఎండింగ్‌‌కు బోర్డు ఆదాయాన్ని రూ. 14,489.80 కోట్లుగా లెక్కగట్టారు. లేటెస్ట్‌‌ బ్యాలెన్స్‌‌ షీట్‌‌ ప్రకారం ఆ ఏడాది బీసీసీఐ మొత్తంగా రూ. 4,017 కోట్లు సంపాదించగా.. అందులో సగం కంటే ఎక్కువ (రూ. 2407 కోట్లు) కేవలం 2018 ఐపీఎల్‌‌ నుంచే వచ్చాయి.

ఇక ఇదే సమయంలో ఇండియా టీమ్‌‌ మీడియా రైట్స్‌‌ అమ్మకం ద్వారా రూ. 825 కోట్లు సమకూరాయి. ఆ ఏడాది బోర్డు రూ. 1592 కోట్లు ఖర్చు చేయగా.. ఈ బ్యాలెన్స్‌‌ షీట్‌‌ను బోర్డు పబ్లిక్‌‌ డొమైన్‌‌లో పెట్టలేదు. 2019–20కి సంబంధించిన అకౌంట్స్‌‌ మాత్రం ఇంకా సిద్ధం కాలేదని తెలుస్తుంది. నాలుగేళ్లలో బోర్డు ఆదాయం భారీగా పెరగగా.. 2014–15 ఫైనాన్షియల్‌‌ ఇయర్‌‌లో బోర్డు నెట్‌‌ వర్త్‌‌ రూ. 5,438 కోట్లుగా ఉంది. తర్వాతి ఏడాది ఏకంగా 2,408 కోట్లు సంపాదించగా.. 2015–16లో ఆదాయం రూ.7847 కోట్లకు చేరుకుంది.

2016–17లో రూ.8వేల కోట్లు దాటగా.. ఇంకో ఏడాదిలో ఏకంగా రూ. 3,460 కోట్లు రాబట్టింది. బోర్డు ఖజానా 2017-18 సీజన్‌‌లో రూ.11,892 కోట్లకు పెరిగింది. తాజా బ్యాలెన్స్‌‌ షీట్‌‌ ప్రకారం 2019 మార్చి 31 నాటికి బోర్డు నెట్‌‌ వర్త్‌‌ రూ. 14,489 కోట్లకు చేరుకుంది. భారతదేశంలో ఆడే ప్రతి అంతర్జాతీయ మ్యాచ్‌కు BCCI అధికారిక బ్రాడ్‌కాస్టర్.. స్టార్ ఇండియా 43.20 కోట్లు చెల్లిస్తుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో BCCI 22 అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వగా.. అందులో ఏడు టెస్టులు, 10 వన్డేలు, ఐదు T20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఇది రూ. 950.40 కోట్లకు చేరుకుంది.