రోడ్డుపై ఉమ్మి వేసిన యువకుడు..చేత్తో కడిగించిన పోలీస్

కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచమంతా పోరాడుతోంది. దీని కోసం ఎన్నో రూల్స్ పెట్టుకున్నాం. వాటిని ఆంక్షలు అనుకున్నా..ప్రజారోగ్యం కోసం పాటించటం అందరి బాధ్యత. కానీ బాధ్యత మరచి ఏమాత్రం బుద్ధి లేకుండా ప్రవర్తించిన వ్యక్తికి బుద్ది వచ్చేలా చేసాడు ఓ పోలీస్ అధికారి.
కరోనా వ్యాప్తి చెందకుండా..లాక్‌డౌన్ విధించాయి ప్రభుత్వాలు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. రోడ్లపైనే కాదు పబ్లిక్ ప్లేసుల్లో ఉమ్మి వేయకూడదు. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగకూడదు. ఈ రూల్స్ అతిక్రమిస్తే ఫైన్లు కూడా వేస్తున్నారు. ఇది ప్రజారోగ్యం కోసం.
ఈ క్రమంలో చండీఘర్‌లో టూవీలర్‌పై వెళుతున్న ఓ యువకుడు నడిరోడ్డుపై తుపుక్కున ఉమ్మి వేశాడు. తనను ఎవరూ గమనించడం లేదనుకున్నాడు. కానీ ఓ అధికారి చూడనే చూశాడు. వెంటనే అతన్ని ఆపాడు. ఫైన్ వేయలేదు. ఉమ్మి వేశావు కాబట్టి నీ చేత్తో నువ్వే కడుగు అంటూ ఓ వాటర్ బాటిల్ ఇచ్చాడు. ఇక చేసేదేముంది? ఉమ్మి వేసి..చచ్చినట్లు తన చేత్తోనే కడగాల్సి వచ్చింది. ఓ వాహనదారుడికి చండీఘర్ ట్రాఫిక్ పోలీసులు విధించిన పనిష్మెంట్ ఇది. అంతేకాదు..ఇంకెప్పుడు ఇలా చేయను క్షమించండి అని చెప్పించాడు ఆ పోలీస్. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Read Here>> యాక్టర్ కాదు..సబ్ ఇన్‌స్పెక్టర్ : లాక్‌డౌన్ వేళ కార్లపై స్టంట్