YouTube: యూట్యూబ్ భారీ ప్రోత్సాహకాలు.. 100 మిలియన్ డాలర్ల ఫండ్!
మన కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత యూట్యూబ్ షార్ట్ వీడియోలను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. సహజంగానే వీడియోలకు వ్యూస్ ఆధారంగా డబ్బు అందించే యూట్యూబ్ ఇప్పుడు ఈ షాట్ వీడియోల కోసం స్పెషల్ ఫండ్ కేటాయించి మరీ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధమైంది.

Youtube
YouTube: మన కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత యూట్యూబ్ షార్ట్ వీడియోలను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. సహజంగానే వీడియోలకు వ్యూస్ ఆధారంగా డబ్బు అందించే యూట్యూబ్ ఇప్పుడు ఈ షాట్ వీడియోల కోసం స్పెషల్ ఫండ్ కేటాయించి మరీ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈప్రోత్సాహకాలను అందించడం కోసం యూట్యూబ్ సుమారు 100 మిలియన్ డాలర్ల ఫండ్‌ను ఏర్పాటు చేసింది.
యూట్యూబ్ సుమారు 100 డాలర్ల నుంచి 10,000 డాలర్ల వరకు యూజర్లకు రివార్డ్ ఇవ్వనుండగా.. 2021 నుంచి 2022 మధ్య వైరలైన షార్ట్ వీడియోల క్రియేటర్లకు ఈ ఫండ్ అందించనుంది. అయితే, ప్రతిదానికి ఏదో ఒకటి మెలిక పెట్టే యూట్యూబ్ ఇప్పుడు ఈ ప్రోత్సాహకాల విషయంలో కూడా షార్ట్ వీడియోలకు వచ్చే వ్యూస్‌ను ఆధారం చేసుకొని రివార్డులను అందిస్తామని కండిషన్ పెట్టింది. ఇందుకోసం ముందుగా షార్ట్ వీడియోలు అప్ లోడ్ చేసే క్రియేటర్లు బోనస్ చెల్లింపుల కోసం క్లెయిమ్ చేసుకోవాలని యూట్యూబ్ ప్రత్యేకంగా నమోదు చేయాలని కోరింది.
ముందుగా క్రియేటర్లు ప్రతి నెల షార్ట్ వీడియోలకు వచ్చిన వ్యూస్‌ను ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉండగా.. అలా యూట్యూబ్ ప్రకారం వ్యూస్ విషయంలో క్వాలిఫై అవాల్సి ఉంటుంది. అలా అయినవారికి ఈ ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఇక ఈ ఫండ్ ను భారత్‌తోపాటుగా యుఎస్, యుకె, బ్రెజిల్, ఇండోనేషియా, జపాన్, మెక్సికో, నైజీరియా, రష్యా, దక్షిణాఫ్రికా దేశాల క్రియేటరులకు అందించనుండగా త్వరలోనే మిగతా దేశాలలో కూడా మొదలుపెట్టేందుకు కృషిచేయనున్నట్లు తెలిపింది.