Reducing Cholesterol Levels : రక్తంలో కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గించటంతోపాటు, శరీరం నుండి హానికరమైన టాక్సిన్స్ ను తొలగించే అలసందలు!

అలసందల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులను నివారించటంలో వ్యాధులు వ్యాప్తి చెందకుండా చేయటంలో తోడ్పడతాయి.

Reducing Cholesterol Levels : రక్తంలో కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గించటంతోపాటు, శరీరం నుండి హానికరమైన టాక్సిన్స్ ను తొలగించే అలసందలు!

Reducing Cholesterol Levels :

Updated On : December 13, 2022 / 3:26 PM IST

Reducing Cholesterol Levels : అలసందలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందించే పోషకాలను కలిగి ఉంటాయి. వీటిలో పీచుపదార్ధం అధికంగా ఉంటుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తులకు మంచి ఆహారంగా పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. రక్తపోటును అదుపులో ఉంచటంలో సహాయపడతాయి.

అలసందల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులను నివారించటంలో వ్యాధులు వ్యాప్తి చెందకుండా చేయటంలో తోడ్పడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గించటంతోపాటు వీటిలో ఉండే ఫ్లెవనాయిడ్స్, మినరల్స్ పొటాషియం గుండె ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి.

శరీరంలో అదనపు కొవ్వులు కరగాలనుకునే వారు రోజుకు ఒక కప్పు ఉడకబెట్టిన అలసందలు తింటే ఫలితం కనిపిస్తుంది. శరీరంలో హానికరమైన వ్యర్ధాలను బయటకు పంపటంలో తోడ్పడతాయి. దీనిలో విటమిన్ కె పుష్కలంగా ఉండటం వల్ల నరాలకు బలం చేకూరుతుంది.

అలసందల్లో లభించే ఐరన్ , మెగ్నీషియం శక్తిని పెంచుతాయి. షుగర్ వ్యాధి గ్రస్తులు వీటిని తీసుకోవటం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. కడుపు నిండుగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తీసుకోవటం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.