Dry Fruits : వేసవిలో డ్రై ఫ్రూట్స్ తినటం మంచిదేనా!.

వేసవిలో వాల్ నట్స్ తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. వాల్‌నట్స్‌లో ఐరన్, కాల్షియం, కాపర్ ,ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే ఇవి శరీరానికి వేడికలిగిస్తాయి.

Dry Fruits : వేసవిలో డ్రై ఫ్రూట్స్ తినటం మంచిదేనా!.

Dry Fruits

Updated On : March 28, 2022 / 2:55 PM IST

Dry Fruits : వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, పానీయాల విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం ద్వారా శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ నట్స్ తీసుకోవడం ఎంతో అవసరం. మెదడుతోపాటు గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. అయితే ఎండాకాలంలో డ్రై ఫ్రూట్స్ శరీరంలో వేడి పెరుగుతుందని చాలా మంది బావిస్తుంటారు. అయితే ఎండాకాలంలో డ్రై ఫ్రూట్స్ తినే విధానంలో కొన్ని మార్పులు చేసుకోవటం మంచిది. ఎండాకాలంలో డ్రై ఫ్రూట్స్‌ను తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. అంతేకాకుండా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల మేలు కలుగుతుంది.

వేసవిలో తినాల్సిన డ్రై ఫ్రూట్స్ ;

బాదంపప్పును వేసవిలో తినటం వల్ల శరీరంలో వేడి ఉత్పన్నమౌతుంది. వేసవిలో బాదంపప్పును తినాలనుకుంటే వాటిని నానబెట్టి తీసుకోవటం మంచిది. బాదంపప్పును రాత్రంతా నీళ్లలో నానబెట్టి, తొక్క తీసి ఉదయాన్నే తినాలి. దీనివల్ల వేసవిలో శరీరానికి హాని కలగదు. వేసవిలో రోజుకు 3 నుండి 4 బాదం పప్పులు మాత్రమే తీసుకోవాలి.

ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎండుద్రాక్షలు శరీరానికి వేడిని కలిగిస్తాయి. అయితే ఎండాకాలంలో వీటిని నానబెట్టిన మాత్రమే తినాలి. ఇలా చేయడం వల్ల ఎండుద్రాక్ష ప్రభావం శరీరం తక్కువగా ఉంటుంది. అలాగే పిత్తదోషం ఉన్నవారు ఎండు ద్రాక్షను నానబెట్టి తినటం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఎండుద్రాక్షలో ఐరన్, ఫైబర్ ,పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఎండు ద్రాక్ష తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది.

వేసవిలో వాల్ నట్స్ తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. వాల్‌నట్స్‌లో ఐరన్, కాల్షియం, కాపర్ ,ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే ఇవి శరీరానికి వేడికలిగిస్తాయి. వేసవిలో వాల్ నట్స్ తినాలనిపిస్తే మాత్రం రాత్రంతా నానబెట్టి ఉదయం తినండి. అయితే అధిక మొత్తంలో తీసుకోవటం ఏమాత్రం మంచిది కాదని గుర్తుంచుకోండి.

ఎండిన అత్తి పండ్లను వేసవిలో తినవచ్చు. రోజుకు రెండు అత్తి పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం నిద్ర లేవగానే తినాలి. వాస్తవానికి అత్తి పండ్లు శరీరంలో వేడిని కలిగిస్తాయి. అయితే నానబెట్టి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.