Hungry at Night : రాత్రి నిద్రలో ఆకలేస్తోందా.. ఇలాంటి సమయంలో తినొచ్చా ? తినకూడదా ?

సాధారణంగా సిటీల్లో ఉండేవాళ్లకు రాత్రి భోజనమే ఆలస్యం అవుతుంది. తొమ్మిది పది గంటల వరకూ తినడం కుదరని వాళ్లుంటారు. కొందరు అర్ధరాత్రి భోజనం చేసేవాళ్లు కూడా ఉంటారు.

Hungry at Night : రాత్రి నిద్రలో ఆకలేస్తోందా.. ఇలాంటి సమయంలో తినొచ్చా ? తినకూడదా ?

hungry at night

Updated On : July 26, 2023 / 7:12 AM IST

Hungry at Night : మనం నిద్రపోవడానికి రెండు గంటల ముందే రాత్రి భోజనం కంప్లీట్ చేయాలని చెప్తారు డాక్టర్లు. కానీ కొంతమందికి రాత్రి పడుకున్న తర్వాత మధ్యలో ఆకలి వేస్తుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఏం తినాలి? అసలు తినొచ్చా.. లేదా..? నిపుణులు ఏం చెప్తున్నారంటే…

READ ALSO : Hyperthyroidism : థైరాయిడ్ శరీర ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఓవర్యాక్టివ్ థైరాయిడ్ యొక్క సంకేతాలు !

ఒకప్పుడు సాయంత్రమే భోజనం కానిచ్చేసి ఏడెనిమిది గంటల కల్లా పడుకునేవాళ్లు. ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి పనులు చేసుకునేవాళ్లు. ఇప్పటికీ కూడా పల్లెటూళ్లలో రాత్రి త్వరగానే పడుకుంటారు. నగరాల్లోనే అర్ధరాత్రి వరకూ మెలకువతో ఉండటం, ఉదయం లేట్ గా లేవడం లాంటి అలవాట్లు ఉంటాయి. అందుకే రాత్రి పూట మళ్లీ ఆకలేయడం నగరవాసులలో సాధారణం.

సాధారణంగా సిటీల్లో ఉండేవాళ్లకు రాత్రి భోజనమే ఆలస్యం అవుతుంది. తొమ్మిది పది గంటల వరకూ తినడం కుదరని వాళ్లుంటారు. కొందరు అర్ధరాత్రి భోజనం చేసేవాళ్లు కూడా ఉంటారు. అయితే తొందరగా తినేసినప్పుడు అర్ధరాత్రి వరకూ మొబైల్ చూస్తూ నిద్ర పోకపోయినా లేక టీవీ చూస్తూ ఉన్నా మళ్లీ ఆకలేస్తుంది. ఓటీటీలు వచ్చిన తర్వాత అర్ధరాత్రి వరకూ టీవీ చూస్తూ మెలకువతో ఉండేవాళ్లు పెరిగిపోయారు. ఇలాంటప్పుడు టీవీ చూస్తూ ఇంట్లో ఉన్నో ఏ చిప్స్ లాంటివోతినేవాళ్లుంటారు. లేక ఏదో ఒక స్నాక్స్ తింటుంటారు. కానీ రాత్రి పూట ఇలా ఏవి పడితే అవి తినడం వల్ల బరువు పెరగడమే కాకుండా అనేక సమస్యలు వస్తాయి.

READ ALSO : Skin Diseases In Diabetics : మధుమేహ బాధితుల్లో చర్మ వ్యాధులను ప్రేరేపించే వర్షాకాలం.. చర్మ ఆరోగ్యం కోసం అనుసరించాల్సిన విధానాలు !

పెరుగు

రాత్రి ఆకలిగా అనిపించినప్పుడు పెరుగు తీసుకోవడం బెటర్. పెరుగులోప్రోబయాటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. పెరుగులో కార్బోహైడ్రేట్లు తక్కువ. ప్రొటీన్లు ఉంటాయి. కాబట్టి రక్తంలో చక్కెరలు స్టెబిలైజర్ అవుతాయి. పెరుగుతో పాటుగా చెర్రీస్ తీసుకోవచ్చు. అయితే మరీ చిక్కటి పెరుగు వద్దు.

వాల్ నట్స్

వాల్ నట్స్ లో మెలటోనిన్ అనే పదార్థం ఉంటుంది. నిద్ర పట్టడానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి రాత్రి పూట ఆకలైనప్పుడు వాల్ నట్స్ తీసుకోవడం వల్ల నిద్ర కూడా బాగా వస్తుంది. వాల్ నట్స్ లో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది నర్వస్ సిస్టమ్ పనితీరును మెరుగుపరుస్తుంది.

READ ALSO : Monsoon Diet : వర్షకాలంలో ఆహారంలో నెయ్యిని తప్పనిసరిగా చేర్చుకోవడానికి 5 కారణాలు !

పాప్ కార్న్

టీవీ చూసేటప్పుడో, సినిమా చూసేటప్పుడో పాప్ కార్న్ సరైన జోడీ. చాలామందికి పాప్ కార్న్ అంటే ఇష్టం కూడా. రాత్రిపూట పాప్ కార్న్ తినవచ్చు. అయితే పాప్ కార్న్ ను వేయించేటప్పుడు వెన్నగానీ, ఉప్పు గానీ వేయకూడదు. దీనిలో కొంతవరకు ఫైబర్ కూడా ఉంటుంది. అందువల్ల ఎక్కువ ఆకలి కాకుండా కూడా ఉంటుంది.

ఇవి అస్సలు తినొద్దు

రాత్రిపూట పిజ్జా తినడం చాలామందికి అలవాటు. ఇష్టపడుతారు కూడా. పిల్లలు, యంగ్ జనరేషన్ కి పిజ్జా అంటే మక్కువ ఎక్కువ. కానీ రాత్రిపూట పిజ్జా తినడం మంచిది కాదు. రాత్రిపూట ఇది సరిగా అరగదు. పైగా కడుపునొప్పి, స్టమక్ అప్ సెట్, కడుపుబ్బరం కలిగిస్తుంది. పిజ్జాలో ఛీజ్ లాంటి కొవ్వు పదార్థాలు ఎక్కువ. కాబట్టి మామూలుగానే పిజ్జాతో కేలరీలు ఎక్కువగా వస్తాయి. ఇక రాత్రిపూట తింటే త్వరగా బరువు పెరుగుతారు.

READ ALSO : Blood Circulation : శరీరానికి సరైన రక్త ప్రసరణ కోసం ఆహారంలో మార్పులు తప్పదా ?

టీవీ చూస్తూ చిప్స్ తింటుంటే ఎన్ని ప్యాకెట్లు అయిపోతున్నాయో కూడా ధ్యాస ఉండదు. ఇక ఆకలిగా ఉన్నప్పుడు చిప్స్ తింటే ఇక అంతే. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిలో ఉప్పు, కార్బోహైడ్రేట్లు ఎక్కవు. మూడు కప్పులు పాప్ కార్న్ ద్వారా వచ్చే కేలరీలు కేవలం 12 చిప్స్ లో ఉంటాయి. కొంతమంది ఏవైనాఫ్రై చేసిన పదార్థాలు తింటుంటారు. ఇవి కూడా మంచిది కాదు. జ్యూస్ లు కూడా రాత్రిపూట వద్దు. ఇక కూల్ డ్రింక్స్ అయితే ప్రమాదకరం.