Tiredness Food : అలసిపోతున్నారా… అయితే ఇవి మీకోసమే

పోషకాలు తక్కువ కావడమే కాకుండా త్వరగా అలసిపోవడానికి ఇతరత్రా కారణాలు కూడా ఉండొచ్చు. థైరాయిడ్, డయాబెటిస్ లాంటి జబ్బులు కూడా ఉండొచ్చు. తీవ్రమైన వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్న తరువాత కూడా కొన్ని నెలల వరకు కొందరు అలసట ఫీలవుతారు.

Tiredness Food : అలసిపోతున్నారా… అయితే ఇవి మీకోసమే

Tiredness Food

Updated On : July 27, 2023 / 4:29 PM IST

Tiredness Food : పొద్దున్నే లేవగానే ఫ్రెష్ గా ఉండాలి. కానీ ఎంత ఆలస్యంగా లేచినా, ఎంత తొందరగా లేచినా కూడా ఫ్రెష్ గా అనిపించదు. చిన్న పని చేయగానే అలసిపోతుంటారు. ఇలాంటప్పుడు అలసట చాలా సందర్భాల్లో సరైన పోషకాలు తీసుకోకపోవడమే కారణంగా ఉంటుంది. వాటిని బ్యాలెన్స్ చేసుకుంటే చాలావరకు సమస్య సాల్వ్ అయిపోతుంది.

READ ALSO : Tech Tips in Telugu : పబ్లిక్ ఛార్జింగ్ పోర్టులను వాడుతున్నారా? స్కామర్లతో జాగ్రత్త.. మీ బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేసేస్తారు.. సేఫ్‌గా ఉండాలంటే?

అలసటకు ఎందుకంటే..

పోషకాలు తక్కువ కావడమే కాకుండా త్వరగా అలసిపోవడానికి ఇతరత్రా కారణాలు కూడా ఉండొచ్చు. థైరాయిడ్, డయాబెటిస్ లాంటి జబ్బులు కూడా ఉండొచ్చు. తీవ్రమైన వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్న తరువాత కూడా కొన్ని నెలల వరకు కొందరు అలసట ఫీలవుతారు. ఇప్పుడు ఎక్కువ మందిలో కనిపించే సమస్యలైన నిద్రలేమి, అధిక ఒత్తిడి కూడా త్వరగా అలసట, నీరసం రావడానికి కారణమవుతాయి. నిద్రలేమి వల్ల పొద్దున లేచిన తర్వాత కూడా ఇంకా మగతగానే ఉంటుంది. అలసటగా ఉంటోందంటే కొన్నిసార్లు డీహైడ్రేషన్ కూడా అయివుండొచ్చు. శరీరంలో నీళ్లు తక్కువ కావడం వల్ల ఎలక్రొలైట్స్ బ్యాలెన్స్ తప్పినీరసంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు తలనొప్పి, కండరాల నొప్పులు కూడా ఉండొచ్చు. అందుకే త్వరగా అలసిపోతున్నారంటే ఇలాంటి ఇబ్బందులేవైనా ఉన్నాయో లేదో చూసుకోవాలి.

కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల శరీరానికి తగిన పోషణ అంది, అలసట, నీరసం తగ్గుతాయి. విటమిన్లు, ఖనిజలవణాల వంటి సూక్ష్మ పోషకాలు తగ్గడం వల్లనే సాధారణంగా ఎక్కువ మంది ఇలా ఏ కారణం కనిపించకుండా అలసటకు లోనవుతుంటారు. వీటిని రెగులర్ గా తింటే క్రమంగా అలసట తగ్గుతుంది.

READ ALSO : Samantha : బాలిలో సమంత ఫ్యాన్ ఫాలోయింగ్.. సమంతతో సెల్ఫీ తీసుకున్న కోతి.. పిక్ చూశారా..?

అరటి పండు

అరటి పండు తినడం ద్వారా ఇమీడియట్ గా శక్తి వస్తుంది. దీనిలో బి6 విటమిన్ పుష్కలం. ఈ విటమిన్ జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. శరీరంలో శక్తి తయారుకావడానికి కూడా బి6 తోడ్పడుతుంది. అరటిపండు అనగానేగుర్తొచ్చే మరో ముఖ్యమైన పోషకం మెగ్నీషియం. ఇది ఒక ఖనిజలవణం. శక్తి ఉత్పత్తికి ఇది కూడా అవసరమే.

క్వినోవా

ఇటీవలి కాలంలో క్వినోవా గురించి చాలామంది మాట్లాడుతున్నారు. రైస్ మానేసి క్వినోవా తింటే అధిక బరువు తగ్గుతారని చెబుతారు. నిజానికి ఇందుకు ప్రధాన కారణం క్వినోవాలో ఉండే సంక్లిష్టమైన పీచు పదార్థాలు. క్వినోవాలోఉండే కార్బోహైడ్రేట్లు కూడా సంక్లిష్టమైనవి. కాబట్టి ఇవి విచ్ఛిన్నం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాని శరీరానికి సరిపడా శక్తి మాత్రం అందుతుంది. అంటే క్వినోవా తినడం వల్ల అటు శక్తి వస్తుంది. ఇటు బరువు కంట్రోల్ లో ఉంటుంది.

READ ALSO : Stay Healthy During Monsoon : వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

యోగర్ట్

దీనిలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. అంటే శరీరానికి మేలు చేసే బాక్టీరియా ఉంటాయి. ఇవి జీర్ణ ప్రక్రియకు సహాయపడుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. పోషకాలను శరీరం ఎక్కువగా గ్రహించుకునేలా చేస్తుంది. అందువల్ల శరీరంలో శక్తి తగ్గకుండా, అలసట, నీరసం రాకుండా కాపాడుతాయి. అయితే షుగర్స్ లేని యోగర్ట్ ను తీసుకోవడం మంచిది.

చియా

రకరకాల గింజలు మనకు తగిన పోషకాలు అందించడమే కాకుండా, బరువు పెరగకుండా చేస్తాయి. అలాంటి వాటిలో చియా గింజలు కూడా ఒకటి. వీటిలో కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల తగినంత శక్తి వస్తుంది. చియా గింజల్లో కొవ్వులు కూడా ఉంటాయి గానీ ఇవి ఆరోగ్యకరమైనవి. ఇకపోతే ఈ గింజల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం చేత ఇవి తిన్న తరువాత కడుపు నిండిన భావన ఉంటుంది. ఎక్కువ సేపు ఆకలి వేయకుండా యాక్టివ్ గా ఉంటారు.

READ ALSO : Vitamin C Deficiency : విటమిన్ సి లోపానికి కారణాలు, లక్షణాలు ఇవే !

ఓట్స్

డయాబెటిస్ ఉన్నవాళ్లు ఎక్కువగా ఎంచుకునే ఆహారం ఓట్స్. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లు సంక్లిష్టమైనవి. కాబట్టి అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతేగాక ఓట్స్ లో పీచు ఉండటం వల్ల కూడా ఇది డయాబెటిస్ కే కాకుండా బరువు పెరగకుండా, జీర్ణ ప్రక్రియ సజావుగాజరిగేటట్టుగా చేస్తుంది.