Bad Breath : నోటి నుండి దుర్వాసన వస్తుందా…ఎందుకో తెలుసా?…
మసాల పదార్ధాలు అధికంగా తీసుకునే వారిలో ఈ తరహా దుర్వాసనలు వస్తుంటాయి. అంతే కాకుండా నోటిలో తడి ఆరిపోతున్న వ్యక్తుల్లో , లాలాజలం సరిగా ఊరని వారిలో సైతం నోటి దుర్వాసనలు వస్తాయి.

Mouth
Bad Breath : నోటి దుర్వాసనతో చాలా మంది సతమతమౌతుంటారు. ఇతరులతో మాట్లాడలన్నా నోరు తెరచి మాట్లాడలేక పోతుంటారు. ఎలాగైనా దీనిని పోగొట్టుకోవాలని ప్రయత్నించినా ఫలితం ఉండదు. ముఖ్యంగా మనం తీసుకోనే ఆహారం జీర్ణమై తర్వాత రక్తప్రసరలో వ్యవస్ధలో కలిసిపోతాయి. అయినప్పటికీ కొన్ని ఆహారపదార్ధాల వాసనలు శ్వాస విడిచిపెట్టేటప్పుడు బయటకు వస్తాయి.
పూర్తిగా జీర్ణం కాని ఆహారం కారణంగానే ఈ తరహా దుర్వాసన కలగటానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. జీర్ణం కాని ఆహారం కుళ్ళిపోయి దుర్వాసన కలిగిన వాయువులను వెదజల్లుతాయి. అంతే కాకుండా గొంతు , నోటిలో ఇన్ఫెక్షన్లు దీనికి కారణమౌతాయి. పళ్ళ సందుల్లో వాపు, చీము కారటం వంటి వాటి వల్ల కూడా చెడు వాసన నోటి నుండి వస్తుంది.
ముఖ్యంగా మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారిలో నోటి నుండి దుర్వాసనలు వస్తుంటాయి. నోటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ ఈ సమస్య వారిని వెన్నాడుతూనే ఉంటుంది. సాధారణ వ్యక్తుల్లో చాలా మంది నోటి శుభ్రతపై పెద్దగా దృష్టిపెట్టరు. ఏదైనా ఆహారం తిన్న తరువాత నీటితో పుక్కిలించాలి. అలా చేయకపోవటం వల్ల నోటిలోనే పళ్ళమధ్య కొంత ఆహారం మిగిలిపోయి ఉంటుంది. చిరకు అది నోటి ఇన్ఫెక్షన్లకు దారితీసి దుర్వాసనకు కారణభూతమౌతుంది.
మసాల పదార్ధాలు అధికంగా తీసుకునే వారిలో ఈ తరహా దుర్వాసనలు వస్తుంటాయి. అంతే కాకుండా నోటిలో తడి ఆరిపోతున్న వ్యక్తుల్లో , లాలాజలం సరిగా ఊరని వారిలో సైతం నోటి దుర్వాసనలు వస్తాయి. దీర్ఘకాలికంగా శాశ్వససంభంధమైన సమస్యలు ఉన్నవారిలో , దూమపానం చేసేవారిలో నోటి దుర్వాసనలు అధికంగా చెప్పవచ్చు.
నోటి దుర్వాసన రాకుండా తీసుకోవాల్సిన జాగ్రతల విషయానికి వస్తే రోజుకు రెండు పర్యాయాలు పళ్ళను తోముకోవాలి. ఆహారం తిన్నాక నీళ్ళతో నోటిని పుక్కిలించి శుభ్ర పరుచుకోవాలి. నాలుకను నాలిక బద్దె ఉపయోగించి దానిపై ఉండే పాచిని ప్రతిరోజు తొలగించుకోవాలి. నోరు, నాలుక ఎప్పుడు తడిగా ఉండేలా చూసుకోవాలి. చిగుళ్ళ సమస్యలతో బాధపడుతున్నట్లైతే వైద్యుని సలహా పాటిస్తూ చికిత్స పొందాలి. ఆహారపు అలవాట్లలో కొద్దిపాటి మార్పులు చేసుకోవాలి.