Beet Root : చలికాలంలో గుండె ఆరోగ్యానికి మేలు చేసే బీట్ రూట్ !

బీట్ రూట్ జ్యూస్ అత్యంత ప్రభావవంతమైన డిటాక్స్ పానీయాలలో ఒకటి. కాలేయ కణాలను ఉత్తేజపరుస్తుంది. శరీరం నుండి విష పదార్ధాలను బయటకు పంపుతుంది.

Beet Root : చలికాలంలో గుండె ఆరోగ్యానికి మేలు చేసే బీట్ రూట్ !

Beet Root

Updated On : November 13, 2022 / 4:44 PM IST

Beet Root : చలికాలంలో బీట్‌రూట్ ను ఆహారంగా తీసుకోవడం మంచిది. ఇందులో ఫైటో న్యూట్రియంట్స్ ఉన్నాయి. వీటిని బీటాలైన్స్ అని కూడా పిలుస్తారు. అంతేకాదు బీట్ రూట్ లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, డిటాక్సిఫికేషన్ లక్షణాలు ఉంటాయి. బీట్ రూట్ లో విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తం సరిగా సరఫరా అయ్యేలా చేస్తుంది. ఈ సూపర్‌ఫుడ్‌లో ఎక్కువ ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి.

ఇది చలికాలంలో ఆరోగ్యంగా , వేడిగా ఉండేలా చేస్తుంది. దీనిని సలాడ్ రూపంలో, ఉడికించి, కాల్చి, పచ్చిగా తినవచ్చు. బీట్ రూట్ జ్యూస్ అత్యంత ప్రభావవంతమైన డిటాక్స్ పానీయాలలో ఒకటి. కాలేయ కణాలను ఉత్తేజపరుస్తుంది. శరీరం నుండి విష పదార్ధాలను బయటకు పంపుతుంది. జ్యూస్‌లోని గ్లైసిన్, బీటైన్లు శరీరంలో కొవ్వు ఆమ్లాలు పేరుకుపోకుండా నిరోధిస్తాయి. బీట్ రూట్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ దుంప రసం మచ్చలు, పిగ్మెంటేషన్లను తగ్గిస్తుంది. చర్మపు రంగును నిగారించేలా చేస్తుంది.

చలికాలంలో శక్తిని , రోగనిరోధక శక్తిని పెంచేందుకు బీట్‌రూట్ ఉపకరిస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యకరమైన రక్తనాళాలు, మెదడు పనితీరుతో సంబంధం ఉన్న నోటి బ్యాక్టీరియా మిశ్రమాన్ని ప్రోత్సహిస్తుందని ఒక కొత్త అధ్యయనంలో తెలింది. చలికాలంలో జుట్టు రాలుతుందని ఇబ్బంది పడేవారు రోజువారీ ఆహారంలో బీట్‌రూట్‌ను చేర్చుకోవాలి. దీని రసం జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది. జుట్టు పెరుగుదలకు మంచి సహాయకారిగా పనిచేస్తుంది.

బీట్‌రూట్ రసం తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది.అంతేకాదు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు ఉన్నవారికి కూడా మంచి మెడిసిన్ బీట్ రూట్ జ్యూస్. బీట్‌రూట్ రసంలో నైట్రేట్ ఉంటుంది. ఇది నాళాల్లో చేరుకొని రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.