Pumpkin Seeds : గుమ్మడి గింజలు తింటే కలిగే ప్రయోజనాలు.. సమస్యలు

గుమ్మడికాయ విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. అది బరువు పెరుగుదలను కంట్రోల్ చేస్తుంది. కొన్ని గింజలు తిన్నా చాలు పొట్ట నిండినట్లు అనిపిస్తుంది.

Pumpkin Seeds : గుమ్మడి గింజలు తింటే కలిగే ప్రయోజనాలు.. సమస్యలు

Pumpkin Seeds

Updated On : December 11, 2021 / 1:22 PM IST

Pumpkin Seeds : ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మంచి ఆహారం తినాలి. బాడీకి అన్ని రకాల పోషకాలూ అందించాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. అలాంటి ఉద్దేశంతో ఉన్నవారు గుమ్మడికాయ గింజల్ని తినడం మేలు. వాటిలో మెగ్నీషియం, కాపర్, ప్రోటీన్స్, జింక్ వంటి పోషకాలుంటాయి.

గుమ్మడి కాయ విత్తనాల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి రుచికరంగా ఉంటాయి. అలాగే శక్తిని ఇస్తాయి. గుమ్మడికాయ విత్తనాల్లో విటమిన్లు ఎ, సి, ఇలతోపాటు ఐరన్‌, కాల్షియం, జింక్‌, ఫోలేట్‌ వంటి పోషకాలు శరీర ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయి. అందువల్ల గుమ్మడికాయ విత్తనాలను తింటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు మాత్రం వీటిని తినరాదు.

గుమ్మడికాయ విత్తనాలను గర్భిణీలు, పాలిచ్చే తల్లులు డాక్టర్ల సూచన మేర తీసుకోవాలి. కొందరికి ఇవి సమస్యలను కలగజేస్తాయి. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం ఉంది కదా… అది మన ఎముకల తయారీకి చాలా అవసరం. ఎంత ఎక్కువ మెగ్నీషియం తీసుకుంటే, అంతలా ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. అప్పుడు అస్థియోపోరోసిస్ వంటి వ్యాధులు దరిచేరవు.కనుక వారు ఈ విత్తనాలను తినే ముందు డాక్టర్‌ సలహా తీసుకోవడం మంచిది.

డయాబెటిస్‌ ఉన్నవారిలో అయితే ఈ విత్తనాలు షుగర్‌ లెవల్స్‌ ను తగ్గించేందుకు సహాయ పడతాయి. ఈ గింజలు తింటే మాత్రం మంచి ఫలితం ఉంటుంది. ఎలుకలపై ఇలాంటి ప్రయోగం చేసినప్పుడు వాటి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాయి. అందువల్ల మనుషులపైనా ఇవి చక్కగా పనిచేస్తాయంటున్నారు డాక్టర్లు. అయితే తక్కువ షుగర్‌ లెవల్స్‌ అంటే.. లో షుగర్‌ ఉన్నవారు ఈ విత్తనాలను తింటే మరింత షుగర్‌ లెవల్స్‌ పడిపోతాయి. దీంతో అపాయం కలుగుతుంది. కనుక షుగర్‌ తక్కువగా ఉండేవారు వీటిని తినరాదు.

గుమ్మడికాయ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి హైబీపీని తగ్గిస్తాయి. ఈ గింజల్లో యాంటీఆక్సిడెంట్స్, మెగ్నీషియం, జింక్, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయిగా… అవన్నీ గుండెకు మేలు చేస్తాయి. ఈ గింజల్లో… నీటిలో కరిగిపోయే ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అలాగే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. అయితే లో బీపీ సమస్య ఉన్నవారు ఈ విత్తనాలను తింటే బీపీ ఇంకా తగ్గుతుంది, సమస్యలు వస్తాయి. కనుక లో బీపీ ఉన్నవారు కూడా ఈ విత్తనాలను తినరాదు.

కొంతమందికి రాత్రిళ్లు నిద్ర పట్టదు. కళ్లు ముయ్యగానే ఏవేవో ఆలోచనలు మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి. ఏం చెయ్యాలో తెలియక నిద్ర మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లు గుమ్మడికాయ గింజలు తింటే సరి. వీటిలో ట్రైప్టోఫాన్ ఉంటుంది. అది నిద్ర వచ్చేలా చేస్తుంది.

గుమ్మడికాయ విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. అది బరువు పెరుగుదలను కంట్రోల్ చేస్తుంది. కొన్ని గింజలు తిన్నా చాలు పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. అందువల్ల ఇతరత్రా తినబుద్ధి కాదు. ఫలితంగా బరువు కంట్రోల్‌లో ఉంటుంది. అంతేకాదు… ఈ గింజలు జీర్ణక్రియను కూడా మంచిగా చేస్తాయి. అయితే ఈ విత్తనాలను మరీ ఎక్కువగా తినరాదు. తింటే ఫైబర్‌ జీర్ణ సమస్యలను కలగజేస్తుంది. కనుక వీటిని తక్కువగా తినాలి.

చాలా మంది పనుల తో తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. అలాంటప్పుడు ప్రతి రోజు గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గించుకో వచ్చు. యాంటీ స్ట్రెస్ న్యూరోకీమా లక్షణాలు గుమ్మడి గింజల్లో అధికంగా ఉన్నాయి. కనుక గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల ఎంతో సులువుగా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.