Carrot : కొలెస్ట్రాల్ స్ధాయిని తగ్గించే క్యారెట్ లోని బీటా కెరోటిన్!
రక్తపోటు మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. క్యారెట్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ B1,B2, B3, B6 మనలోని ఒత్తిడిని తగ్గిస్తాయి.

Carrot
Carrot : మొక్కల ఆధారిత ఆహారాలు వాస్తవానికి అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించ సహాయపడతాయని ఆరోగ్య నిపుణుల అధ్యయనాల్లో తేలింది. క్యారెట్‌లోని విటమిన్ ఎ మరియు బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్, దీర్ఘకాలిక గుండె జబ్బుల నుండి రక్షించడంలో తోడ్పడతాయి. క్యారెట్‌లో సహజంగా ఖనిజాలు, విటమిన్లు, కరిగే ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. యాంటీఆక్సిడెంట్ల ఉనికి కణాల పునరుత్పత్తిని ప్రోత్సహించి, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గించటంలో క్యారెట్ లోని బీటా కెరోటిన్ తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
రక్తపోటు మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. క్యారెట్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ B1,B2, B3, B6 మనలోని ఒత్తిడిని తగ్గిస్తాయి. బీపీ కంట్రోల్ లో ఉంటుంది. జ్యూస్ తాగితే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. మహిళల్లో నెలసరి క్రమం తప్పితే క్యారెట్ జ్యూస్ తాగితే దానిని సరిచేస్తుంది. మూత్రపిండాలకు సంభందించిన సమస్యలను కూడా క్యారెట్ తగ్గిస్తుంది. క్యారెట్ రసాన్ని రోజూ తాగడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది.
క్యారెట్ లో ఉండే విటమిన్స్ మరియు మినిరల్స్ మరియు ఇందులో ఉండే లోక్యాలరీలు ఉంటాయి కాబట్టి, బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. క్యారెట్స్ లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఎముకల ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. ఎముకలను బలోపేతం చేస్తుంది. గొంతు నొప్పి నివారించడంలో క్యారెట్ జ్యూస్ ఉపయోగపడుతుంది. సైనటీస్ తో బాధపడే వారికి ఎంతగానో మేలు చేస్తుంది.