Potassium : నీరసం, అలసట, గుండెల్లో దడ.. పొటాషియం లోపమే కారణమా?

శరీరంలో పొటాషియం లోపిస్తే చేతులు, అరచేతులు, కాళ్లు, పాదాల్లో సూదుల్తో గుచ్చినట్టు ఉండి ఒక్కసారి స్పర్శ కూడా తెలియదు. కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవటం లో సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

Potassium : నీరసం, అలసట, గుండెల్లో దడ.. పొటాషియం లోపమే కారణమా?

Potassium

Updated On : March 8, 2022 / 2:14 PM IST

Potassium : పొటాషియం అనేది మన శరీరంలో కండరాల కదలికలకు, నరాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, ద్రవాలు నియంత్రణలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. సరైన పోషకాహారం తీసుకోకపోవటం కారణంగా చాలా మందిలో పొటాషియం లోపం కనిపిస్తుంది. మనం ప్రతి రోజు తీసుకొనే ఆహారంలో ఎన్నో విటమిన్స్,మినరల్స్ ఉంటాయి. వాటిల్లో పొటాషియం కూడా ఒకటి.

పొటాషియం లోపిస్తే శరీరంలో బలహీనత, అలసట, తిమ్మిర్లు నిసత్తువు సాధారణంగా కనిపించే లక్షణాలు. ఏపనిపై మనస్సు నిలపలేరు. కండరాలు బలహీనపడి విపరీతమైన నొప్పులు వస్తాయి.జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించి తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రక్తంలో పొటాషియం లోపం వల్ల ఆ ప్రభావం గుండె మీద చూపిస్తుంది. గుండె దడదడగా ఉండటం, కొట్టుకొనే వేగంలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. క్రమేపి గుండె సమస్యలకు దారి తీస్తుంది.

శరీరంలో పొటాషియం లోపిస్తే చేతులు, అరచేతులు, కాళ్లు, పాదాల్లో సూదుల్తో గుచ్చినట్టు ఉండి ఒక్కసారి స్పర్శ కూడా తెలియదు. కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవటం లో సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కొన్ని రకాల జబ్బులకు వినియోగించే మందులు సైతం పొటాషియం లోపించటానికి కారణమౌతాయి. పొటాషియం సమృద్ధిగా లభించే బంగాళాదుంప , బీన్స్, అవకాడో, అరటిపండ్లు, పాలు, చిరు ధాన్యాలు, బ్రెడ్, వాల్ నట్స్, పాస్తా, యాపిల్, కివీ, ఆకుపచ్చని కూరగాయలు వంటి ఆహారాలను తీసుకుంటే పొటాషియం లోపాన్ని అధికమించవచ్చు.

నీరసం, అలసట, గుండెల్లో దడ వంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించటం మంచిది. ఎందుకంటే వైద్యుల సూచించే పరీక్షల ద్వారానే అసలు సమస్యను గుర్తించ వచ్చు. అందుకు తగ్గట్టుగా చికిత్స తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సొంత ప్రయోగాలు చేసి ఆరోగ్యం విషయంలో సమస్యలు కొని తెచ్చుకోవద్దు.