Women Safety : ఆడవారికి జాగ్రత్త .. ట్రయల్ రూమ్‌లో ఉండే అద్దం గురించి ఖచ్చితంగా తెలుసుకోండి .. మీ తోటివారికి షేర్ చేయండి

ఆడవారు షాపింగ్ మాల్స్‌కి వెళ్లినపుడు డ్రెస్సులు షాపింగ్ చేసినపుడు ట్రయల్ రూమ్ ఆశ్రయిస్తారు. అక్కడ ఉండే అద్దాల గురించి ఓ ముఖ్యమైన విషయం మీకు తెలుసా? తెలియకపోతే ఖచ్చితంగా ఇది చదవండి. మీ స్నేహితులకు షేర్ చేయండి.

Women Safety : ఆడవారికి జాగ్రత్త .. ట్రయల్ రూమ్‌లో ఉండే అద్దం గురించి ఖచ్చితంగా తెలుసుకోండి .. మీ తోటివారికి షేర్ చేయండి

Women Safety

Updated On : July 29, 2023 / 3:56 PM IST

Women Safety : షాపింగ్ మాల్స్‌కి వెళ్లిప్పుడో.. టాయిలెట్, బాత్ రూమ్, హోటల్ రూంలకి వెళ్లినపుడు అక్కడ అద్దాలు కనిపిస్తాయి. అయితే అవి నిజమైన అద్దమా? రెండువైపుల కనిపించే అద్దమా? ఎంతమందికి ఖచ్చితంగా తెలుసు. ముఖ్యంగా ఆడవారు రియల్ మిర్రర్ కి,  2 వే గ్లాస్‌కి మధ్య తేడాను తెలుసుకోవాలి.

Public Chargers in Malls : షాపింగ్ మాల్స్, మార్కెట్లలో పబ్లిక్ ఛార్జర్లను అసలే వాడొద్దు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!

మనం బయటకు వెళ్లినపుడు పలు చోట్ల అద్దాలు గమనిస్తుంటాం. ముఖ్యంగా కొన్ని ప్రదేశాల్లో అద్దాలు గమనించినపుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాటిలో మనం మాత్రమే కనిపిస్తున్నామా? లేదంటే ఇతరులకు కూడా మనం కనిపిస్తున్నామా? ఒకటి రియల్ మిర్రర్.. ఇందులో మన ప్రతిబింబం మాత్రమే కనిపిస్తుంది. రెండవది 2 వే గ్లాస్.. అంటే రెండు వైపుల కనిపిస్తుంది.. అవతలి వారికి కూడా మనం కనిపిస్తాం. ఆ విషయం మనకి తెలియదు. సో వీటిని కనిపెట్టడం చాలా ఈజీ.

Traditional Indian Bed: US ఆన్ లైన్ షాపింగ్ సైట్‌లో రూ.లక్ష ధర పలుకుతున్న ఇండియన్ బెడ్.. దాని ప్రత్యేకత ఏంటంటే?

నిజమైన అద్దమో కాదో తెలుసుకోవాలంటే మీ వేలు చివరి కొనను అద్దంపై ఉంచండి. మీ వేలి కొనకు.. కనిపించే ప్రతిబింబానికి మధ్య గ్యాప్ ఉంటే అది నిజమైన అద్దంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇక 2 వే గ్లాస్.. మీ వేలి చివర కొన అద్దంలో కనిపించిన ప్రతిబింబాన్ని తాకినట్లుగా కనిపిస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది 2 వే గ్లాస్. మిమ్మల్ని అవతలివైపు ఉన్నవారు కూడా చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆడవారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్లినా అక్కడ ఉన్న అద్దాన్ని మీ వేళ్లతో పరీక్ష చేయండి. మన భద్రత మనకు ఎంతో అవసరం. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి.