Clapping Therapy : చప్పట్లు కొట్టడం ఆరోగ్యానికి మంచిదని మీకు తెలుసా?
ఎవరినైనా అభినందించే సమయంలో చప్పట్లు కొడతాం.. కానీ చప్పట్లు కొట్టడం వెనుక ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు చాలామందికి తెలియకపోవచ్చు. 'క్లాపింగ్ థెరపీ' వల్ల ఎన్ని ప్రయోజనాలు ఒకసారి చదవండి.
Clapping Therapy : సాధారణంగా ఎవరినైనా అభినందిస్తున్నప్పుడు చప్పట్లు కొడతాం. అది ప్రశంసలో ఒక భాగం. కానీ చప్పట్లు కొట్టడం వెనుక చాలామందికి తెలియని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ‘లాఫింగ్ థెరపీ’ మాదిరిగానే ‘క్లాపింగ్ థెరపీ’ కూడా ఇప్పుడు ఫేమస్ అయ్యింది. క్లాపింగ్ థెరపీ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే..
మనిషి శరీరంలో ప్రతి అవయవం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. అరచేతులు రక్తనాళాలను మరియు నరాల చివరలను కలిగి ఉంటాయి. మీరు వాటిని ఉత్తేజపరిస్తే మీ ఆరోగ్య సమస్యలు నయం అవుతాయి. ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. అయితే చప్పట్లు కొట్టడం వల్లే ఆరోగ్యం విషయంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
చప్పట్లు కొట్టడం ఆందోళనను నియంత్రించడానికి సులభమైన మార్గం. చప్పట్లు కొట్టడం వల్ల ఒత్తిడి తగ్గుతుందట. చప్పట్లు కొట్టడం ప్రారంభించగానే మెదడుకి సానుకూల సంకేతాలు వెళ్తాయి. ఇది నిరాశను పోగొడుతుంది. సంతోషకరమైన హార్మోన్లను పెంచడానికి రోజువారి వ్యాయామంలో చప్పట్లు కొట్టడం ఎంతో మంచిది.
చప్పట్లు కొట్టడం వల్ల రక్తపోటు స్ధాయిలు నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యం బాగుంటుంది. చప్పట్లు కొట్టినపుడు శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అనేక గుండె సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు చప్పట్లు కొట్టడంతో శ్వాస సమస్యలు కూడా తగ్గుతాయట.
చప్పట్లు కొట్టడం వల్ల తెల్ల కణాల ఉత్పత్తి పెరిగి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిరూపించబడిందట. దీంతో కాలానుగుణంగా వచ్చే అనేక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. పిల్లలు క్రమం తప్పకుండా చప్పట్లు కొట్టడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుందట. అలాగే ఏకాగ్రత మెరుగవడంతో పాటు వారు చేతి రాతలో తప్పులు దొర్లకుండా ఉంటాయట.
Healthy kidney : మూత్ర పిండాల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే ?
చప్పట్లు కొట్టడం వల్ల జుట్టు రాలడం కంట్రోల్ అవుతుందట. ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చును. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి జుట్టు కణాల పెరుగుదలకు చప్పట్లు ఎంతగానో తోడ్పడతాయట. అయితే చప్పట్లు కొట్టే ముందు అరచేతులపై కొద్దిగా ఆవాల నూనె లేదా కొబ్బరి నూనె రెండింటి మిశ్రమాన్ని వేసుకోవాలి. అరచేతుల్ని నిటారుగా ఉంచి.. చేతివేళ్లు ఒకదానికొకటి తాకేలా ఉంచి చప్పట్లు కొట్టాలి. మంచి ఫలితాల కోసం ఉదయం పూట చప్పట్లు కొట్టడం మంచిదట. లేదంటే ఎవరి వీలును బట్టి వారు ఈ క్లాపింగ్ థెరపీ ఫాలో అవ్వచ్చు.