Remedies For a Stuffy Nose : జలుబు, ముక్కు దిబ్బడతో ముక్కు మూసుకుపోయిందా… ఇలా చేయండి

అల్లం టీ అంటే చాలామంది ఇష్టపడుతారు. జలుబు చేసినప్పుడు అల్లం టీ తాగితే చాలా రిలాక్స్ గా కూడా ఉంటుంది. అల్లంతో పాటు పుదీనా కూడా కలిపి తీసుకుంటే ఆ టీ రుచి మరింత బాగుండటమే కాకుండా మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

Remedies For a Stuffy Nose : జలుబు, ముక్కు దిబ్బడతో ముక్కు మూసుకుపోయిందా… ఇలా చేయండి

Remedies For a Stuffy Nose

Updated On : July 25, 2023 / 10:00 AM IST

Remedies For a Stuffy Nose : సీజన్ మారితే చాలు.. జలుబు, ముక్కు దిబ్బడ లాంటి సమస్యలు వచ్చిపడతాయ్. ఇక ఈ వర్షాకాలంలో చల్లదనానికి సైనస్ లాంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. ఇలాంటప్పుడు ముక్కులు మూసుకుపోయి, ఊపిరాడక ఇబ్బంది పడుతుంటారు. దీని నుంచి బయటపడటానికి ఆయుర్వేద నిపుణులు కొన్ని పరిష్కారాలు చెబుతున్నారు.

READ ALSO : Prevent Cough and Cold : వర్షాకాలంలో దగ్గు, జలుబును ఎలా నివారించాలి ?

వర్షాల వల్ల మారిన వాతావరణ పరిస్థితులు ఇలాంటి ఇన్ ఫెక్షన్లను పెంచుతాయి. అలర్జీ వల్ల గానీ, వైరల్ ఇన్ ఫెక్షన్ వల్ల గానీ దగ్గు, జలుబు, ముక్కులు మూసుకుపోవడం సర్వసాధారణం అవుతాయి. ముక్కు దిబ్బడ వల్ల ఊపిరాడక రాత్రి పడుకోవడానికి కష్టపడేవాళ్లూ ఉన్నారు. మన ముక్కుకు ఇరుపక్కల, నుదురు భాగంలో, తల వెనుక భాగంలో ఉండే సైనస్ గ్రంథులు ఎక్కువ మోతాదులో మ్యూకస్ ని ఉత్పత్తి చేసినప్పుడు సైనస్లలో ఇన్ ఫెక్షన్లు వస్తాయి. దీన్నే సైనసైటిస్అని అంటుంటాం.

మన ఇండియాలో 130 మిలియన్ల మందికి పైగా క్రానిక్ సైనసైటిస్ తో బాధపడుతున్నారని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ ఫెక్షియస్డిసీజెస్ అంచనా. అయితే వ్యాధి ముదరకముందు, తొలి దశలో ఉన్నప్పుడే మన ఇంట్లోనే దీన్ని అదుపు చేసే, నివారించే మార్గాలున్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. వర్షాకాలంలో సైనస్ వల్ల గానీ, ఇతర కారణాల వల్ల గానీ జలుబు, ముక్కు మూసుకుపోవడం లాంటి వాటికి కొన్ని పదార్థాలు ఎలా ఉపయోగపడుతాయో, వాటిని ఎలా వాడితే వీటి నుంచి ఉపశమనం కలుగుతుందో చెబుతున్నారు.

READ ALSO : అద్భుతమైన 5 సుగంధ ద్రవ్యాలతో శీతాకాలంలో వచ్చే జలుబు, ఫ్లూతో పోరాడండి; మీ ఆహారంలో వాటిని ఎలా జోడించాలంటే?

వాము

దగ్గుతూ బాధపడుతున్నప్పుడు వాము తినడం మనలో చాలామంది అనుసరించేదే. వాము విత్తనాల్లో థైమోల్ లాంటి నూనె పదార్థాలుంటాయి. ఇవి యాంటీ మైక్రోబియల్ (సూక్ష్మజీవనాశిని), యాంటీ ఇన్ ఫ్లమేటరీ (ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించేవి) లక్షణాలను కలిగి ఉంటాయి. ముక్కు మార్గాల్లో చేరిన సూక్ష్మ క్రిములను చంపడానికి, సైనస్లపై ఒత్తిడి తగ్గించడానికి ఇవి ఉపయోగపడుతాయి. దగ్గును నివారించి, శ్వాసను మెరుగుపరుస్తాయి. సైనస్ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.

ఇందుకోసం ముందుగా వాము విత్తనాలను కొద్దిగా ముదురు రంగులోకి మారేవరకు వేయించి, మంచి వాసన వచ్చేవరకు ఉంచాలి. తరువాత ఇలా రోస్ట్ చేసిన వామును ఒక శుభ్రమైన క్లాత్ లో కట్టాలి. ఇలా వాముతో కూడిన క్లాత్ ను ముక్కుకు దగ్గరగా పెట్టుకుని దాని నుంచి వచ్చే సువాసనను గట్టిగా పీల్చుకోవాలి. వాము వాసనతో పాటుగా, లోతైన శ్వాస తీసుకోవాలి. ఇది మూసుకుపోయిన ముక్కులను క్లియర్ చేసి, శ్వాస ఆడేలా చేస్తుంది. ముక్కు దిబ్బడఉన్నప్పుడల్లా దీన్ని పీల్చుకోవచ్చు.

READ ALSO : Ajwain : జలుబు,దగ్గు, ఊపిరితిత్తుల సమస్యలకు వాముతో!

యూకలిప్టస్

జలుబు చేసినప్పుడు యూకలిప్టస్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. సాధారణంగా జలుబు, ముక్కు దిబ్బడ ఉన్నప్పుడు ముక్కు ఆవిరి పట్టమని సూచిస్తారు డాక్టర్లు. ముక్కు రంధ్రాలను క్లియర్ చేయడానికి ఇది సులభమైనదే కాకుండా, చాలా ఎఫెక్టివ్ గా పనిచేసే చిట్కా. అయితే కేవలం వేడి నీటి ఆవిరి మాత్రమే పీల్చుకోకుండా, ఆ ఆవిరికి కొన్ని చుక్కల యూకలిప్టస్నూనెను కలిపితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

ఇందుకోసం ఒక కుండలో నీటిని మరిగించి, దానిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేయాలి. ఆ వేడి తగ్గకముందే తలపై ఒక టవల్ కప్పుకుని ముఖాన్ని ఆవిరి నీటి పైన ఉంచాలి. కళ్లు మూసుకుని, ముక్కు ద్వారా లోతుగా ఆవిరిని పీల్చుకోవాలి. నోటి ద్వారా కూడా పీల్చుకుంటే గొంతు మార్గాలు కూడా క్లియర్ అవుతాయి. ఇలా ఓ అయిదు పది నిమిషాల పాటు చేయాలి. కుండ అందుబాటులో లేకపోతే స్టీల్ గిన్నెలో అయినా మరిగించవచ్చు. మనకు రెడీమేడ్ గా దొరికే ప్లాస్టిక్ ఆవిరి పరికరాల కన్నా ఇలా మరిగించిన నీటి నుంచి వచ్చే ఆవిరిని పీల్చుకోవడమే మంచిది.

READ ALSO : Cold : జలుబు నివారణ ఇంటి చిట్కాలతో..ఎలాగంటే?

అల్లం… పుదీనా

అల్లం టీ అంటే చాలామంది ఇష్టపడుతారు. జలుబు చేసినప్పుడు అల్లం టీ తాగితే చాలా రిలాక్స్ గా కూడా ఉంటుంది. అల్లంతో పాటు పుదీనా కూడా కలిపి తీసుకుంటే ఆ టీ రుచి మరింత బాగుండటమే కాకుండా మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే పాలు వాడకుండా కేవలం అల్లం, పుదీనాలతో చేసిన టీ ఈ సీజన్ లో తరచుగా తీసుకుంటే శ్వాసమార్గాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందుకోసం కప్పు నీళ్లను వేడి చేసిన తర్వాత తురిమిన అల్లం వేసి అది నీటిలో బాగా కరిగేలా ఒక అయిదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత ఈ అల్లం నీటిని వడగట్టి, దాంట్లో కొన్ని తాజా పుదీనా ఆకులను కలపాలి. ఈ టీ ని వేడిగా అయినా తాగొచ్చు. గోరువెచ్చగా కూడా తాగొచ్చు.