వచ్చే వారమే కరోనావైరస్ 3వ దశ వ్యాక్సిన్ ట్రయల్… సక్సెస్ ఐతే టీకా వచ్చినట్లే. అసలు టీకా ఎలా పనిచేస్తుంది?

ప్రపంచాన్ని వణకిస్తోన్న కరోనా మహమ్మారి 15 మిలియన్ల మందికి పైగా సోకింది.. ప్రపంచవ్యాప్తంగా 630,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక వ్యాక్సన్‌పై ప్రపంచ దేశాల్లోని ప్రజలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంతర్జాతీయంగా క్లినికల్ ట్రయల్స్‌లో 25 పొటెన్షియల్ కరోనావైరస్ వ్యాక్సిన్లు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.
ఆ వ్యాక్సిన్లలో ఒకదాన్ని టీక్ రీసెర్చ్ సెంటర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్, బయోటెక్నాలజీ సంస్థ మోడెర్నా భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తోంది. ఈ టీకా వచ్చే వారం 3వ దశ ప్రారంభం కానుంది. ఈ దశలో 30,000 మంది వాలంటీర్లు పాల్గొంటారు. ఇంతకీ కరోనావైరస్ నుంచి ఈ వ్యాక్సిన్ ఎంతవరకు ప్రజలను రక్షిస్తుందో లేదో తేలిపోనుంది.. టీకా మెసెంజర్ RNA (mRNA) ను ఉపయోగించి ప్రోటీన్లను నిర్మించే కణాలను ఉత్పత్తి చేస్తారు.
కరోనావైరస్ స్పైక్ ప్రోటీన్‌ను నిర్మించడానికి అవసరమైన ప్రోటీన్లను మానవ కణాలకు సోకడానికి ఉపయోగిస్తుంది. రోగనిరోధక వ్యవస్థకు వైరస్ దాడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని వ్యాక్సిన్ ద్వారా అందిస్తుంది. ఇప్పటికే తొలి దశలో మూడు వేర్వేరు మోతాదులలో టీకా ఇచ్చారు. వారిలో రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుందని అధ్యయనంలో తేలింది.
సగానికి పైగా ఇంజెక్షన్ చేసిన చోట.. అలసట, చలి, తలనొప్పి, కండరాల నొప్పి వంటి దుష్ప్రభావాలను అనుభవించారు. దశ 3 ట్రయల్ లోనూ మోతాదు – 100 మైక్రోగ్రాములు (µg) మోతాదు ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ పనితీరుపై వ్యాక్సిన్ రీసెర్చ్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బర్నీ గ్రాహం, మోడరనా వ్యాక్సిన్ డాక్టర్ సంజయ్ గుప్తా పూర్తి వివరణ ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్న వారి శరీరం లోపల ఏమి జరుగుతుంది ఎలాంటి ప్రభావం చూపుతుందో అనేక విషయాలపై సమగ్ర వివరణ ఇచ్చారు.
సంజయ్ గుప్తా: ఈ టీకా ఎలా పనిచేస్తుంది. మెసెంజర్ RNA [mRNA] లో కొంత భాగాన్ని ఎవరో ఒకరికి ఇస్తున్నారు. MRNA అంటే ఏమిటి? శరీరం ఎలా స్పందిస్తుంది.. యాంటీ బాడీలను ఎలా సృష్టిస్తుంది?
బర్నీ గ్రాహం:
మానవ జన్యువు DNAతో తయారైంది. డబుల్ స్ట్రాండెడ్ అణువుగా పిలుస్తారు. డీఎన్‌ఏ గురించి వినే ఉంటారు. మన శరీరం ప్రోటీన్లను తయారుచేసే విధానం ఏమిటంటే.. న్యూక్లియోటైడ్లతో తయారు చేసిన DNA టెంప్లేట్. దీన్ని transcription అని పిలుస్తారు. RNA టెంప్లెట్‌ను తయారు చేయడానికి DNA టెంప్లెట్‌ను ఉపయోగిస్తుంది. RNA అనేది కణాల పనితీరుకు అవసరమైన ప్రోటీన్లను తయారు చేయడానికి మన శరీరంలో సాధారణంగా ఉపయోగించే టెంప్లేట్ లాంటిది. RNAను నేరుగా కండరాల కణంలోకి ప్రవేశ పెట్టినప్పుడు.. వ్యాక్సిన్‌గా ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది.
ఆ RNA కణంలోని సైటోప్లాజంలోకి వెళుతుంది. ప్రోటీన్ తయారు చేయడానికి రైబోజోమ్‌లకు మారుతుంది. దీనికి mRNA వ్యాక్సిన్ ఇస్తాం.. అప్పుడు ఒక ప్రోటీన్‌ను సృష్టిస్తుంది.. ఉత్పత్తి చేస్తుంది. ఆ ప్రోటీన్ కండరాల కణంపై కూర్చుంటుంది. వైరస్ మీద కూర్చొని ఉండే ప్రోటీన్‌లాగా కనిపిస్తుంది. అక్కడే రోగనిరోధక వ్యవస్థ దీనిని గుర్తిస్తుంది. ఈ ప్రోటీన్ పై వేర్వేరు ఉపరితలాలకు యాంటీబాడీలను తయారు చేయడం ప్రారంభిస్తుంది. ఏదైనా కరోనావైరస్‌లకు సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రీ-ఫ్యూజన్ స్పైక్ ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకోవలసి ఉంటుంది.
గుప్తా: సాధారణంగా.. స్పైక్ ప్రోటీన్ మాదిరి ఫ్యూజన్ రూపాన్ని సూచించే ప్రోటీన్‌తో వ్యాక్సిన్ తయారుచేస్తారు.. ప్రాథమికంగా శరీరంలో వైరస్ సోకినట్లుగా గుర్తిస్తారు.. మరి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ప్రజలు అనారోగ్యానికి గురవుతారా, ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుందా?
గ్రాహం:
అలాంటిదేమి లేదు. వైరస్.. దాని జన్యువు 30,000 న్యూక్లియోటైడ్లతో నిండి ఉంటుంది. ఈ ప్రోటీన్ తయారు చేయడానికి మేము 4,000 న్యూక్లియోటైడ్లను మాత్రమే ఇస్తున్నాము. లేదా 3,700 న్యూక్లియోటైడ్లకు దగ్గరగా ఉండవచ్చు. జన్యువులో 10వ భాగాన్ని మాత్రమే ఇస్తున్నాము. ఆ న్యూక్లియోటైడ్లు కూడా మార్చేస్తాం.. కోడాన్ ఆప్టిమైజేషన్ అని పిలుస్తారు.. న్యూక్లియోటైడ్ల క్రమాన్ని మార్చేస్తారు. అందుకే వ్యాక్సిన్ నిజంగా వైరస్ లాంటిది కాదు.. కానీ వైరల్ ప్రోటీన్ అందిస్తుంది.
గుప్తా: ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లపై ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ల ప్రయోగాల దేశంలో మూడవ వంతు తెలిసే ఉంటుంది.. ఈ కొత్త టీకా గురించి ఇంకా కొంత తడబాటు కనిపిస్తోంది. ఇంతకీ టీకా పనితీరును ఎలా వివరిస్తారు?
డాక్టర్ గ్రాహం:
వ్యాక్సిన్ల జీవ ప్రాతిపదికత.. ఎలా పని చేస్తాయో ప్రజలు నిజంగా అర్థం చేసుకోవాల్సి ఉంది. అదేదో మాయాజాలం లేదా మర్మమైనది కాదు.. వాస్తవానికి చాలా నిర్దిష్టమైన అవగాహన ఉండాలి. రోగనిరోధక ప్రతిస్పందన ప్రేరేపించడానికి వ్యాక్సిన్లు దోహదపడతాయి. టీకాల జీవశాస్త్రాన్ని ప్రజలు అర్థం చేసుకుంటే సందేహాలకు ఆస్కారమే ఉండదని భావిస్తున్నా.. రోగనిరోధక శక్తిని అందరిలో పెంపొందించాల్సి ఉంది.. దీన్నే హెర్డ్ ఇమ్యూనిటీ అని పిలుస్తారు.
ఈ టీకా 70 లేదా 80శాతం ప్రభావవంతంగా ఉంటుందని ఆశిస్తున్నా.. తప్పక సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను. కోట్లాది జనాభాలో హెర్డ్ ఇమ్యూనిటీని తీసుకురావాలంటే 60 లేదా 70% రోగనిరోధక శక్తి అవసరం. అంటే జనాభాలో రోగనిరోధక శక్తిని పెంచడానికి దాదాపు 100% మందికి టీకాలు వేయాల్సి ఉంటుంది. మూడవ వంతు ప్రజలు వ్యాక్సిన్ తీసుకోకపోతే.. జనాభాలో 40 లేదా 50% రోగనిరోధక శక్తిని మాత్రమే కలిగి ఉంటారు. ఈ టీకాలు ఎలా పని చేస్తాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు. అప్పుడు ఎవరిలోనూ ఎలాంటి సందేహాలు ఉండవని భావిస్తున్నట్టు గ్రాహం తెలిపారు.