Yoga Mudras : రోజువారిగా యోగముద్రల సాధనతో ఆరోగ్యపరమైన రుగ్మతలనుండి బయటపడొచ్చు!

బొటనవేలు, ఉంగరం వేలు రెండు మడవాలి. మిగిలిన మూడు వేళ్లు నిటారుగా ఉంచాలి. ఈ ముద్ర రోజువారిగా వేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. మధుమేహం ఉన్న వారు ఈ ముద్ర వేయటం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

Yoga Mudras : రోజువారిగా యోగముద్రల సాధనతో ఆరోగ్యపరమైన రుగ్మతలనుండి బయటపడొచ్చు!

Daily practice of yoga mudras can get rid of health disorders!

Updated On : January 1, 2023 / 1:09 PM IST

Yoga Mudras : ఆరోగ్యంతోపాటు మానసిక ప్రశాంతతను కలిగించటంలో యోగాసనాలు విశిష్టమైన స్ధానాన్ని ఆక్రమించాయి. యోగాలో ప్రధానంగా యోగ ముద్రలతో స్వల్ప రుగ్మతలను తొలగించుకోవచ్చు. అలసట, బడలికలతో శరీరం చతికిలపడినప్పుడు, చేతి వేళ్లతో ఈ ముద్రను వేయడం వల్ల అంతర్గత శక్తి, తేజస్సు ఉత్తేజితమవుతాయు. యోగ ముద్రలను వేసేందుకు నిర్ధిష్టమైన సమయం ఏదీలేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా సాధన చేయవచ్చు. ఫలితంగా వ్యాధులతో పోరాడే శక్తి శరీరానికి సమకూరుతుంది.

మన చేతి వేళ్లు అయిదు పంచభూతాల్లో ఒక్కో తత్వానికి ప్రతీకగా నిలుస్తాయి. చతికొసల మద్యలో కణుపుల వద్ద , మూలాలలో బొటనవేలితో కలపడం వల్ల ఎన్నో ముద్రలు తయారరవుతాయి. ఈ ముద్రలను రోజువారిగా సాధన చేయటం వల్ల ఒక్కో ఫలితం లభిస్తుంది. రుగ్మతలను బట్టి ఒక్కో ముద్రను సాధన చేయవచ్చు.

1. వాయుముద్ర ; బొటన వేలును కొద్దిగా వాల్చి చూపుడు వేలును సున్నా ఆకారంలో మడవాలి. ఈ ముద్ర వల్ల శరీరంలోని గ్యాస్ వంటి వ్యాయువులు బయటకు వెళ్లిపోతాయి. గ్యాస్ ఛాతినొప్పి నివారిస్తుంది. పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు రాకుండా చేస్తుంది.

2. జ్ఞానముద్ర ; బొటన వేలు చూపుడు వేలు కలిపి గట్టిగా ఒత్తి ఉంచాలి. మిగిలిన మూడు వేళ్లను నిటారుగా పెట్టుకోవాలి. ఈ ముద్ర మనోశక్తిని, జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. విజ్ఞానాన్ని పెంచుతుంది. నిద్రలేమి సమస్యలను తగ్గిస్తుంది. కోపాన్ని నియంత్రించుకోవచ్చు. రక్తపోటు సమస్య తగ్గుతుంది. తలనొప్పి వంటివి దరి చేరువు. మానసిక ఆందోళనలు తొలగిపోతాయి.

3. శూన్యముద్ర ; మధ్యవేలుతో బొటన వేలును గట్టిగా బంధించాలి. మిగిలిన మూడు వేళ్లు నిటారుగా ఉంచాలి. ఈ ముద్రతో చెవిపోటు తగ్గుతుంది. ఉన్నట్టుంది తలతిరగటం వంటివి తగ్గుతాయి. థైరాయిడ్ సమస్యల నుండి బయటపడవచ్చు . చెవికి సంబంధించిన రుగ్మతలు తొలగిపోతాయి. బద్దకం నుండి బయటపడవచ్చు.

4. లింగ ముద్ర ; అన్ని వేళ్లనూ ఒకదానితో ఒకటి పెనవేసి కుడిచేతి బొటన వేలిని మాత్రం పైకి ఉంచాలి. కుడిచేతి బొటన వేలిని మాత్రం పైకి ఉంచాలి. ఈ ముద్ర జలుబు, రొంప తదితర అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఊపిరితిత్తులను బలపరుస్తుంది. శరీరంలో వేడిని పెంచుతుంది.

5. ఆది ముద్ర ; బొటనవేలు మడిచి, మిగిలిన నాలుగు వేళ్లను బొటన వేలుపై ఉంచాలి. ఇలా చేయటం వల్ల జ్ఞానేంద్రీయాలకు ప్రాణశక్తి ప్రసాదితమవుతుంది. మనస్సకు ఉత్సాహం, అహ్లాదం కలుగుతుంది. రక్తపోటు తక్కువగా ఉంటే ఈ ముద్ర వేయకపోవటమే మంచిది.

6. బ్రహ్మ ముద్ర ; రెండు చేతుల బొటన వేళ్లను మడిచి మిగతా నాలుగు వేళ్లను దాని మీదుగా మడవాలి. ఆతరువాత రెండు చేతులను దగ్గరికి నాభి ప్రదేశంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే రక్తపోటు సమస్యలను నియంత్రించుకోవచ్చు.

7. వరుణముద్ర ; బొనవేలు, చివరి వేలు కలిపితే వరుణ ముద్్ర. మిగిలిన మూడు వేళ్లను ఒకటి తాకకుండా దూరంగా ఉండాలి. ఈ ముద్ర వల్ల కిడ్రీల సామర్ధ్యం పెరుగుతుంది. ప్రొస్టెట్ సమస్యలు తొలగిపోతాయి. రాత్రిళ్లు పక్క తడిపే అలవాటు కూడా తగ్గుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. కండరాలు బలోపేతం అవుతాయి.

8. శక్తి ముద్ర ; చివరి రెండు వేళ్లను బొటను వేలితో కలపాలి. మిగిలిన రెండు వేళ్లను ఒకదానితో ఒకటి తాకాలి. శక్తి అన్నింటికంటే బాగా శక్తి వంతంమైనది. ఈ ముద్ర జీవన సామర్ధ్యాన్ని పెంచుతుంది. కంటి చూపు లోపాలను సరిచేస్తుంది. దీంతో చూపు మెరుగుపడుతుంది.

9. సూర్య ముద్ర ; బొటనవేలు, ఉంగరం వేలు రెండు మడవాలి. మిగిలిన మూడు వేళ్లు నిటారుగా ఉంచాలి. ఈ ముద్ర రోజువారిగా వేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. మధుమేహం ఉన్న వారు ఈ ముద్ర వేయటం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

10. పృధ్వీముద్ర ; ఉంగరం వేలు బొటనవేలు అంచులు కలిపి ఒత్తిడి కలిగించాలి. మిగిలిన మూడు వేళ్లు ఆకాశం వైపు చూస్తుండాలి. ఈ ముద్ర మానసిక ఆందోళనలు తగ్గిస్తుంది. అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. బలహీనతలు తగ్గుతాయి. చర్మం కాంతివంతం అవుతుంది.

11. అపాన ముద్ర ; మధ్యవేలు, ఉంగరం వేలు రెండు బొటన వేలు అంచుని తాకేలా ఉంచాలి. చిటికెన వేలు చూపుడు వేలు లాగి ఉంచాలి. కలిసిన మూడు వేళ్ల మధ్య ఒత్తిడి కలిగించాలి. ప్రొస్టేట్ , మోనోపాజ్ సమస్యలను ఈ ముద్ర తగ్గిస్తుంది. శరీరంలోని విషతుల్యాలను బయటకు పంతుంది. మూత్ర సమ్యలు తొలగిపోతాయి. మధుమేహం నియంత్రణలో ఉంటుంది.