Hair Loss : ఈ ఆహారాలు జుట్టుకు హాని చేస్తాయ్? వాటికి దూరంగా ఉండటమే బెటర్!

అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు ఇన్సులిన్ స్పైక్‌కు కారణమవుతాయి. శుద్ధి చేసిన పిండి, రొట్టె మరియు చక్కెర వంటి ఆహారాలు అన్నీ అధిక GI ఆహారాలు. ఈ ఆహారాలు హార్మోన్ల అసమతుల్యతను సృష్టిస్తాయి.

Hair Loss : ఈ ఆహారాలు జుట్టుకు హాని చేస్తాయ్? వాటికి దూరంగా ఉండటమే బెటర్!

Do these foods harm hair? Better to stay away from them!

Hair Loss : ఆరోగ్యకరమైన, దృఢమైనమెరిసే జుట్టు పురుషులు, మహిళలు ఇద్దరికీ అవసరం. అందమైన జుట్టు అంటే ఖరీదైన జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం మాత్రమే కాదు. చర్మం లాగానే, ఆరోగ్యకరమైన జుట్టు మన శరీర ఆరోగ్యానికి ఒక సూచిక. తీసుకునే కొన్ని ఆహార ఎంపికలు జుట్టుకు హాని కలిగించవచ్చు. ఒత్తిడి మరియు కాలుష్యం జుట్టును డ్యామేజ్ చేస్తాయన్న విషయం అందరికి తెలిసిందే. అయితే, కొన్ని ఆహారాలు జుట్టు రాలడం, జుట్టు పల్చబడటం సమస్యకు కారణమౌతాయన్న విషయం చాలా మందికి తెలియదు. సాధారణంగా జుట్టు సమస్యలకు ఒత్తిడి మరియు జన్యుశాస్త్రం కారణమని చెబుతారు. అయితే మరొక ఆశ్చర్యకరమైన విషయం మనం తీసుకునే ఆహారం కూడా ఇందుకు కారణమౌతుంది. జుట్టు పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. జుట్టు రాలడాన్ని వేగవంతం చేస్తుంది. జుట్టు ఆరోగ్యం కోసం తప్పనిసరిగా నివారించాల్సిన ఆహారాలను చూద్దాం.

1. చక్కెర ; చక్కెర జుట్టుకు ఎంత చెడ్డదో మొత్తం ఆరోగ్యానికి కూడా అంతే చెడ్డది. చక్కెర అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోతాయి. తద్వారా జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. క్రమంగా జుట్టు రాలడానికి దారి తీస్తుంది. ఇలాంటి ఆహారం కారణంగా కుదుళ్లలో వాపు, పొడిబారిపోవడం, చుండ్రు రావడం వంటి సమస్యలూ వస్తాయి. ఇవన్నీ వెంట్రుకల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. మధుమేహం, స్థూలకాయానికి దారితీసే ఇన్సులిన్ నిరోధకత మీ జుట్టును కోల్పోయేలా చేస్తుంది. పురుషులు మరియు స్త్రీలలో బట్టతలకి కూడా దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

2. హై-గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ; అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు ఇన్సులిన్ స్పైక్‌కు కారణమవుతాయి. శుద్ధి చేసిన పిండి, రొట్టె మరియు చక్కెర వంటి ఆహారాలు అన్నీ అధిక GI ఆహారాలు. ఈ ఆహారాలు హార్మోన్ల అసమతుల్యతను సృష్టిస్తాయి. ఇన్సులిన్ మరియు ఆండ్రోజెన్‌లలో స్పైక్‌ను కలిగిస్తాయి, ఇవి హెయిర్ ఫోలికల్స్‌తో బంధించి జుట్టు రాలడానికి దారితీస్తాయి. మైదా, వైట్‌ బ్రెడ్‌, కేక్స్‌, కుకీస్‌.. వంటి గ్లైసెమిక్ ఇండెక్స్‌ అధికంగా ఉన్న పదార్థాలు జుట్టు ఆరోగ్యానికి ప్రతిబంధకాలుగా మారతాయి. వీటిని అమితంగా తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా రక్తంలో ఇన్సులిన్‌ పెరిగిపోవడం, ఆండ్రోజెన్‌ హార్మోన్ల స్థాయులు ఎక్కువవడంతో కుదుళ్లు బలహీనపడతాయి. ఇది క్రమంగా జుట్టు రాలడానికి దారి తీస్తుంది.

3. మద్యం ; జుట్టు ప్రధానంగా కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతుంది. కెరాటిన్ అనేది జుట్టుకు నిర్మాణాన్ని అందించే ప్రోటీన్. ఆల్కహాల్ ప్రోటీన్ సంశ్లేషణపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. జుట్టు బలహీనంగా మార్చి ఎటువంటి మెరుపు లేకుండా చేస్తుంది. అధిక ఆల్కహాల్ వినియోగం పోషక అసమతుల్యతను సృష్టిస్తుంది. ఫోలికల్ మరణానికి కారణమవుతుంది.

4. డైట్ సోడా ; డైట్ సోడాల్లో అస్పర్టమే అనే కృత్రిమ స్వీటెనర్ ఉంటుంది, దీనివల్ల హెయిర్ ఫోలికల్స్ దెబ్బతింటాయని పరిశోధకులు కనుగొన్నారు. జుట్టు రాలే సమస్య ఉంటే డైట్ సోడాలను పూర్తిగా నివారించడం మంచిది. శీతల పానీయాలను అధికంగా తీసుకుంటే ఊబకాయం, గుండె సమస్యలు, జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో పాటు శిరోజాల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌లో ఉండే ఆర్టిఫిషియల్‌ స్వీట్‌నర్‌ కురుల కుదుళ్లను బలహీనపరిచి జుట్టు రాలిపోయేలా చేస్తుందట. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు నిపుణులు.

5. ప్రాసెస్డ్‌ ఫుడ్ ; ప్రాసెస్డ్‌ ఫుడ్, జంక్‌ ఫుడ్‌లో క్యాలరీలు, శ్యాచురేటెడ్‌, మోనో శ్యాచురేటెడ్‌ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో టెస్టోస్టిరాన్‌తో పాటు డై హైడ్రో టెస్టోస్టిరాన్‌ (పురుష హార్మోన్లు).. వంటి హార్మోన్ల స్థాయులను పెంచుతాయి. ఫలితంగా అలొపేసియా అనగా జుట్టు ప్యాచుల్లా రాలిపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు.. ఇవి కుదుళ్లలోని చర్మ రంధ్రాలు మూసుకుపోయేలా చేసి కొత్త జుట్టు రాకుండా చేస్తాయి. అందుకే కొంతమంది ఆడవారిలోనూ బట్టతల రావడం గమనించచ్చంటున్నారు నిపుణులు.