Heat Wave : ఎండాకాలం వేసవి తాపాన్ని తట్టుకునేందుకు రోజుకు ఎన్నిసార్లు సాన్నం చేయాలో తెలుసా?
సాధారణంగా కనీసం రోజుకు ఒకసారి తలస్నానం చేయాలని నిపుణులు సిఫార్సు చేయబడింది. ముఖ్యంగా చురుకైన వ్యక్తులు, వేడి లేదంటే తేమతో కూడిన వాతావరణంలో నివసించేవారు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేనివారు తరచుగా స్నానం చేయటంలో ఎలాంటి అభ్యంతరాలు ఉండవు.

summer heat
Heat Wave : మండే ఎండలకు, వడగాల్పులు కూడా తోడైతే ఆపరిస్ధితిని అనుభవించటమే కష్టం. ఇంటి నుండి బయటకు రావాలంటేనే భయమేస్తుంది. ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల నేపధ్యంలో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇకపై మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) హీట్ వేవ్ హెచ్చరికను జారీ చేసింది.
READ ALSO : Watermelon : వేసవిలో శరీరాన్ని చల్లగా,ఆరోగ్యంగా ఉంచే పుచ్చకాయ !
ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో దానిని నుండి ఉపశమనం పొందాలని కోరుకోవడం సహజం. శరీరంలో వేడితాపాన్ని తగ్గించుకునేందుకు తరుచుగా స్నానం చేస్తుంటారు చాలా మంది. వేడినుండి తప్పించుకునేందుకు రోజులో నాలుగైదు సార్లు స్నానం చేసేవారు లేకపోలేదు. అయితే వేసవి వేడి నుండి తట్టుకునేందుకు స్నానం చేయటం మంచిదేనా?.. ఎన్ని సార్లు స్నానం చేయాలన్న దానిపై చాలా మందిలో అనుమానాలు ఉన్నాయి.
ఎన్నిసార్లు తలస్నానం చేయాలి?
స్నానం చేయడం అనేది వ్యక్తిగత పరిశుభ్రతలో ముఖ్యమైన భాగం. క్రమం తప్పకుండా చేయటం మంచిది. రోజులో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి అనేది జీవనశైలి, నివసించే వాతావరణం పరిస్ధితులు, ఆరోగ్య పరిస్ధితుల వంటి అనేక అంశాలపై అధారపడి ఉంటుంది.
READ ALSO : Foods to Avoid in Summer : వేసవిలో ఈ ఆహారాల విషయంలో జాగ్రత్తలు ఆరోగ్యానికి మంచిది !
సాధారణంగా కనీసం రోజుకు ఒకసారి తలస్నానం చేయాలని నిపుణులు సిఫార్సు చేయబడింది. ముఖ్యంగా చురుకైన వ్యక్తులు, వేడి లేదంటే తేమతో కూడిన వాతావరణంలో నివసించేవారు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేనివారు తరచుగా స్నానం చేయటంలో ఎలాంటి అభ్యంతరాలు ఉండవు.
అదే సమయంలో చర్మ రకం, అందుకు తగిన తగిన సబ్బు మరియు షాంపూలను ఎంచుకోవటం అన్నది ముఖ్యం. చర్మం మరియు జుట్టు మార్కెట్లో లభించే వివిధ ఉత్పత్తులను ఉపయోగించే సమయంలో మీ చర్మం, జుట్టు ఎలా స్పందిస్తుందో శ్రద్ధపెట్టాల్సి ఉంటుంది. జుట్టు పొడిగా , చర్మం చికాకుగా ఉంటే మాత్రం ఘాటైన రసాయనిక సబ్బులు కాకుండా తేలికపాటి సబ్బు, షాంపూలను ఉపయోగించటం మంచిది.
స్నానం చేసే సమయంలో జుట్టు, ముఖం శరీరంలోని ఇతర ప్రాంతాలతో సహా మీ మొత్తం శరీరాన్ని శుభ్రపరుచుకోవాలి. దీనికోసం తగిన సమయాన్ని కేటాయించండి. స్నానానికి ఉపయోగించే నీటి విషయంలో బాగా వేడి ఉండే నీటిని కాకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉండే నీటిని ఉపయోగించాలి. వేడి నీరు ఉపయోగించటం వల్ల చర్మం పొడిబారుతుంది. చికాకు కలిగిస్తుంది. స్నానానికి చివరగా చల్లని నీటితో శరీరాన్ని తడుపుకుని స్నానం ముగించాలి.
READ ALSO : Summer Sweat : వేసవిలో అధిక చెమట ఎందుకుపడుతుంది? అధిక చెమటలను ఆపాలంటే !
స్నానం చేసే సమయంలో సాధారణంగా బాడీ స్క్రబ్‌తో వారానికి ఒకటి లేదా రెండుసార్లు చర్మాన్ని రుద్దుకోవాలి. ఇలా చేయటం వల్ల చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. స్నానం చేసిన తర్వాత, చర్మాన్ని సున్నితమైన మాయిశ్చరైజర్ ను అప్లై చేసి తేమగా ఉండేలా చూసుకోవాలి.
వేసవి కాలం స్నానం చేసే విషయంలో నిపుణులు ఏంచెబుతున్నారు ?
చాలా మంది నిపుణులు రోజుకు ఒకసారి కంటే ఎక్కువ స్నానం చేయకూడదని సూచిస్తున్నారు. ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి స్నానం చేయాలని సిఫార్సు చేస్తారు. ఎందుకంటే తరచుగా పదే పదే తలస్నానం చేయడం వల్ల చర్మంలోని సహజ నూనెలు తొలగిపోతాయి. చర్మం పొడి బారి దురదకు దారితీస్తుంది.
READ ALSO : Summer Drinks : వేసవి ఎండల కారణంగా ఎదురయ్యే డీహైడ్రేషన్ కు చెక్ పెట్టాలంటే ?
అంతేకాకుండా తరచుగా స్నానాలు చేయటం వల్ల నీటి వినియోగం పెరుగుతుంది. ఆప్రభావం పర్యావరణంపై కూడా పడుతుంది. నీటిని వృధా చేయకుండా ఉండేందుకు, ఐదు నుండి పది నిమిషాల్లో షవర్ జల్లుల క్రింద స్నానం చేయటం ఉత్తమం.
మొత్తంమీద, రోజుకు రెండు సార్లు షవర్ స్నానం చేయటం సురక్షితం,ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు. గరిష్ఠంగా 10 నిమిషాల వరకు షవర్ జల్లుల క్రింద స్నానానికి సమయం కేటాయించాలి. వేడి భరించలేనంతగా ఉంటే, రోజుకు మూడుసార్లు స్నానం చేయవచ్చు. అంతకంటే ఎక్కువ సార్లు తలస్నానం చేయటం శ్రేయస్కరం కాదని గుర్తుంచుకోవాలి. రోజుకు రెండు కంటే ఎక్కువ సార్లు స్నానాలు చేయకూడదని సాధారణంగా నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఎక్కవసార్లు షవర్ జల్లుల స్నానాల వల్ల చర్మం చికాకు, మంట, అలాగే తామర వంటివి ఏర్పడవచ్చు. దీంతోపాటు చర్మంలోని సహజ నూనెలు తొలగిపోతాయి.