Mango Fruits : కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లను గుర్తించడం ఎలాగో తెలుసా?
కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లపై అక్కడక్కడా ఆకుపచ్చదనం ఉంటుంది. అదే సహజంగా పండిన పండ్లు అయితే కాయ మొత్తం ఒకే రంగులో ఉంటుంది. ముదురు ఎరుపు, పసుపు రంగులో ఈ పండ్లు ఉంటాయి.

Mango
mango fruits : వేసవి కాలంలో సహజంగానే మామిడి పండ్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ సీజన్‌లో అనేక రకాల జాతుల మామిడి పండ్లు నోరూరిస్తుంటాయి. అయితే మార్కెట్ లో లభించే ప్రతి మామిడి పండు సహజంగా పండిన పండ్లు కాకపోవచ్చు. ఒకప్పుడు ఏ పండైనా సహజంగా పండుగా మాగిన తర్వాతే అమ్మేవారు. కానీ ఇప్పుడు మార్కెట్లో చాలా వరకు కార్బైడ్ ఉపయోగించి పండించిన పండ్లను అమ్ముతున్నారు.
ప్రస్తుతం అనేక మంది వ్యాపారులు కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లను విక్రయిస్తున్నారు. అలాంటి పండ్లను తినడం వల్ల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. అయితే కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లను మనం సులభంగానే గుర్తించవచ్చు.
Green Mango : పచ్చిమామిడిలో పోషకాలు ఎన్నో తెలుసా?
కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లపై అక్కడక్కడా ఆకుపచ్చదనం ఉంటుంది. అదే సహజంగా పండిన పండ్లు అయితే కాయ మొత్తం ఒకే రంగులో ఉంటుంది. ముదురు ఎరుపు, పసుపు రంగులో ఈ పండ్లు ఉంటాయి. సహజంగా పండిన మామిడి పండ్లపై నొక్కితే మెత్తగా అనిపిస్తుంది. అలాగే ఆ పండ్ల తొడిమల దగ్గర మంచి వాసన రావడం గమనించవచ్చు.
కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లు లోపల అక్కడక్కడా పచ్చిగానే ఉంటాయి. దీంతో పులుపు తగులుతుంది. అదే సహజంగా పండిన పండ్లు అయితే రసం ఎక్కువగా వస్తుంది. అలాగే రుచి కూడా తియ్యగా ఉంటుంది. కార్బైడ్ ఉపయోగించి పండించిన పండ్లను నీటిలో వేస్తే పైకి తేలుతాయి. అదే సహజంగా పండించిన పండ్లు అయితే నీటిలో మునుగుతాయి.