Cold water therapy for face: ముఖానికి కోల్డ్ వాటర్ థెరపీ..దీని వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?
ముఖాన్ని చల్లని నీటితో కడగటం.. అదే కోల్డ్ వాటర్ థెరపీ.. దీని వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?

Cold water therapy for face
వర్షాకాలం, శీతాకాలంలో చలి ప్రభావంతో ఖచ్చితంగా వేడి నీటి స్నానం ప్రిఫర్ చేస్తారు. అయితే ముఖాన్ని చల్లని నీటితో కడిగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అదే కోల్డ్ వాటర్ థెరపీ.. అంటే ఏంటి? ఎలాంటి ప్రయోజనాలున్నాయి? చదవండి.
పరగడుపున నీళ్లు తాగితే శరీరంలో ఎటువంటి మార్పులొస్తాయో తెలుసా..
కొందరి ముఖం ఉబ్బరంగా అనిపిస్తుంది. కంటి కింద బ్యాగ్‌లు, నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి కోల్డ్ వాటర్ థెరపీ హెల్ప్ అవుతుందట. ముఖ్యంగా ముఖంలో చర్మం త్వరగా ముడతలు పడకుండా ఇది కాపాడుతుందట. ముఖంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగాలంటే కోల్డ్ వాటర్ మంచిదట. ఇది చర్మ ఆరోగ్యాన్ని, రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చల్లని నీరు చర్మాన్ని టైట్‌గా ఉంచడంతో పాటు టోన్ మార్చడంలో సాయపడుతుంది. ఫలితంగా యంగ్ లుక్‌తో బ్రైట్ గా కనిపిస్తారు. చర్మ రంధ్రాల రూపాన్ని తగ్గించడంతో పాటు చర్మ కాంతిని మెరుగుపరచడంలో చల్లని నీరు సహాయపడుతుంది.
Ginger Tea : అల్లం టీ ఎక్కువగా తీసుకుంటే సమస్యలు తప్పవా?…
ముఖాన్ని చల్లని నీటితో కడిగితే ఒత్తిడి తగ్గుతుందట. మానసిక స్థితిని మెరుగుపరుస్తుందట. ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందట. ఈ కోల్డ్ వాటర్ థెరపీని ప్రాక్టీస్ చేయాలంటే ముఖంపై 10 నుండి 12 సెకన్ల పాటు చల్లని నీటిని చల్లుకోవాలి. ఐస్ క్యూబ్స్‌తో కూడా ప్రయత్నించవచ్చు. అయితే చల్లని నీటి థెరపీ సున్నితమైన చర్మం లేదా ఏదైనా అనారోగ్యంతో ఉన్న వారి విషయంలో తగినది కాదని గమనించాలి. ఇలాంటివి ప్రయత్నించే ముందు వారు ఖచ్చితంగా వైద్యుల సలహా పాటించడం ఉత్తమం.