Muscle Pain : కండరాల నొప్పికి కారణాలు తెలుసా? నొప్పుల నుండి ఉపశమనం పొందాలంటే?
నొప్పితో బాధపడేవాళ్లు ఆయా చోట్ల ఐస్ క్యూబ్‌తో మర్ధన చేయటం వల్ల తాత్కాలికంగా నొప్పి నుంచి రిలీఫ్ పొందొచ్చు. ముఖ్యంగా భుజాలు, చేతి కండరాల నొప్పులకు ఐస్ మసాజ్ బాగా ఉపకరిస్తుంది. ఆవనూనెతో కండరాలకు మసాజ్ చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా అరికాళ్లు, కాళ్ల నొప్పులకు ఆయిల్ మసాజ్ ఉపయోగపడుతుంది.
Muscle Pain : కండరాలు పట్టడం, కాలి మడాల నొప్పి రావడం ఈమధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సర్వసాధారణ సమస్య. వ్యాయామం చేసేటప్పుడు, కండరాలపై ఒత్తిడి పడినప్పుడు, తప్పు భంగిమలో నిద్రపోయినప్పుడు, ఎక్కువ టైం ఒకే భంగిమలో కూర్చున్నప్పుడు కండరాలు జారడం లేదా బెణకడం వల్ల నొప్పులు మొదలవుతాయి. రాత్రిపూట నిద్రపోతున్న సమయంలో, మెళకువలో కూడా ఉన్నట్టుండి తొడలు, కాలిపిక్కలు పట్టేయడం జరుగుతుంది.
వీటికి తోడు విటమిన్ డి, థైరాయిడ్, శరీరంలో లవణాలు లేకపోవడం,స్టెరాయిడ్స్ తీసుకోవడం లాంటివి కూడా కండరాల నొప్పికి దారితీస్తాయి. కండరాలు పట్టేయడానికి కారణం రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం, థైరాయిడ్ సమస్య వంటివి కారణమౌతాయి. సరిగా నిద్ర లేకపోయినా, మూత్రపిండాల ఇన్ఫెక్షన్, కండరాల మీద ఒత్తిడి పెరగి ఇలా జరుగుతుంది. శరీరంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం తగ్గటం వల్ల కూడా ఇలా జరుగుతుంది.
నొప్పుల నుండి ఉపశమనం పొందటానికి ;
నొప్పితో బాధపడేవాళ్లు ఆయా చోట్ల ఐస్ క్యూబ్‌తో మర్ధన చేయటం వల్ల తాత్కాలికంగా నొప్పి నుంచి రిలీఫ్ పొందొచ్చు. ముఖ్యంగా భుజాలు, చేతి కండరాల నొప్పులకు ఐస్ మసాజ్ బాగా ఉపకరిస్తుంది. ఆవనూనెతో కండరాలకు మసాజ్ చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా అరికాళ్లు, కాళ్ల నొప్పులకు ఆయిల్ మసాజ్ ఉపయోగపడుతుంది. మెడ, భుజాల నొప్పులు ఉన్నవాళ్లు పడుకునే విధానాన్ని మార్చుకోవటం వల్ల ఫలితం ఉంటుంది. తల్లకింద మెత్తటి దిండును వాడుకోవాలి. అలాగే ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోకుండా అటుఇటు కదలికలు ఉండేలా చూసుకోవాలి. రోజువారిగా తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
కండరాలు పట్టకుండా వుండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ప్రతిరోజు రెండు పూటలా పాలు సేవించాలి. ఎప్సెమ్ సాల్ట్ కలిపిన నీళ్లతో స్నానం చేస్తే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. వీలైనంత ఎక్కువ నీరు తీసుకోవాలి. గుడ్లు, ఆకుకూరలు వంటివాటిని ఆహారంలో చేర్చుకోవాలి. పొగతాగడం, మద్యం అలవాట్లను పూర్తిగా మానేయాలి. ఒత్తిడి వల్ల కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున కారణాలను కనుగొని ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి.