Folic Acid : శరీరంలో ఫోలిక్ యాసిడ్ పాత్ర ఎంతో తెలుసా?..

పురుషులతో పోలిస్తే మ‌హిళ‌ల‌కు ఫోలిక్ యాసిడ్ ఎక్కువ‌గా అవ‌స‌రం ఉంటుంది. అందుక‌ని 11 ఏళ్లు దాటిన‌ప్ప‌టి నుంచి అమ్మాయిలు ఫోలిక్ యాసిడ్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి.

Folic Acid : శరీరంలో ఫోలిక్ యాసిడ్ పాత్ర ఎంతో తెలుసా?..

Folic Acid (1)

Updated On : December 25, 2021 / 3:04 PM IST

Folic Acid : శరీరంలో కొత్త కణాలను తయారు చేయడంలో, వాటికి పోషణ అందించటంలో ఫోలిక్ యాసిడ్ దోహదపడుతుంది. ఫోలిక్ యాసిడ్ లోపిస్తే శరీరంలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ఫోలిక్ యాసిడ్ లోపం కారణంగా రక్త హీనత సమస్య తలెత్తుతుంది. ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. శరీరంలో ఫోలిక్ యాసిడ్ తగ్గినప్పుడు నీరసం ఎక్కవగా ఉంటుంది. చిన్న పోసినా అలసటకు గురవుతారు. కొన్ని సందర్భాల్లో శ్వాసతీసుకోవటం కష్టంగా ఉంటుంది.

ఫోలిక్ యాసిడ్ లోపం కారణంగా తరచూ తలనొప్పి వస్తుంది. ఏకాగ్రత క్షీణిస్తుంది. గర్భంతో ఉన్న మహిళలు శిశువు ఆరోగ్యంగా జన్మించాలంటే ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండాలి. లేదంటే పిల్లల్లో లోపాలు తలెత్తాయి. పుట్టబోయే పిల్లలో మెదడు, వెన్నెముక సమస్యలు వస్తాయి.

ఫోలిక్ యాసిడ్ లోపిస్తే ఉన్నట్టుండి బరువు తగ్గటం, ఆకలి లేకపోవటం, మగతగా ఉండటం, కంటి నరాల్లో క్షీణత వంటి సమస్యలు వస్తాయి. ఈ సందర్భంలో ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాలను డైట్ లో ఉండేలా చేసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ కోసం పాలకూర, తోటకూర, పుదీనా, పప్పు ధాన్యాలు, నట్స్, మాంసం, గుడ్లు, పాలు, బీన్స్, చిక్కుడు గింజలు, నిమ్మజాతి పండ్లు వంటి వాటిని తీసుకోవటం వల్ల ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తుంది.

వ‌య‌స్సు మీద ప‌డుతున్న వారికి స‌హ‌జంగానే మ‌తిమ‌రుపు వ‌స్తుంటుంది. కంటి చూపు త‌గ్గుతుంది. కానీ ఫోలేట్ ఉన్న ఆహారాల‌ను తీసుకుంటే ఈ స‌మ‌స్య‌ల నుంచి బయ‌ట ప‌డ‌వ‌చ్చు. వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌ర‌గా రావు. మ‌హిళ్ల‌లో గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాల‌ను ఫోలేట్ త‌గ్గిస్తుంది. ఆస్టియో పోరోసిస్, నిద్ర‌లేమి, గుండె జ‌బ్బులు రాకుండా అడ్డుకోవ‌చ్చు.

పురుషులతో పోలిస్తే మ‌హిళ‌ల‌కు ఫోలిక్ యాసిడ్ ఎక్కువ‌గా అవ‌స‌రం ఉంటుంది. అందుక‌ని 11 ఏళ్లు దాటిన‌ప్ప‌టి నుంచి అమ్మాయిలు ఫోలిక్ యాసిడ్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌ల‌కు రోజుకు 400 మైక్రో గ్రాముల వ‌ర‌కు ఫోలిక్ యాసిడ్ అవ‌స‌రం అవుతుంది.

గ‌ర్భం దాల్చిన తొలి 12 వారాల వ‌ర‌కు మ‌హిళ‌లు రోజుకు 500 మైక్రో గ్రాముల వ‌ర‌కు ఫోలిక్ యాసిడ్‌ను తీసుకోవాలి. పాలిచ్చే త‌ల్లుల‌కు రోజుకు 300 మైక్రో గ్రాముల వ‌రకు ఫోలిక్ యాసిడ్ స‌రిపోతుంది. అయితే గ‌ర్భంతో ఉన్న‌వారు కాక మిగిలిన వారు ఫోలిక్ యాసిడ్‌ను మాత్ర‌ల రూపంలో కాక‌, అది ల‌భించే ఆహారాల‌ను తీసుకోవ‌డం మంచిది.