Alzheimer’s : మతిమరుపు ఎందుకొస్తుందో తెలుసా? మతిమరుపుకు దారితీసే ముఖ్యమైన కారణాలు ఇవే?

రోజువారిగా వ్యాయామాలు చేయటం వల్ల శరీరం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటుంది. అంతకాదు డిమెన్షియా, మతిమరుపు సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. కాబట్టి రోజూ కొంత సమయాన్ని వ్యాయామం చేయడానికి కేటాయించండి. ఎలాంటి జబ్బులు లేకుండా ఉంటారు.

Alzheimer’s : మతిమరుపు ఎందుకొస్తుందో తెలుసా? మతిమరుపుకు దారితీసే ముఖ్యమైన కారణాలు ఇవే?

Do you know what causes forgetfulness? What are the main causes of forgetfulness?

Updated On : October 25, 2022 / 6:46 AM IST

Alzheimer’s : విషయాలను గ్రహించడం, మెదడులో నిక్షిప్తం చేసుకోవడం, దీర్ఘకాలంపాటు అట్టిపెట్టుకోవడం, కావాల్సినప్పుడు బయటికి తీయడాన్నే జ్ఞాపకశక్తి గా చెబుతాము. అయితే అనుకోని కారణాల వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతూ వస్తుంది. దీనినే మతిమరుపుగా పిలుస్తాం. ఒకప్పుడు వయసు మీద పడుతున్నవాళ్లలోనే ఈ మతిమరుపు ఎక్కువగా ఉండేది. దీని వల్ల ఇప్పుడే చెప్పిన విషయాలను కూడా మర్చిపోతుంటారు. ప్రస్తుతం ఈ సమస్య యువతలో కూడా కనిపిస్తుంది. మతిమరుపు రావటానికి అనేక కారణాలు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

1. జన్యువులు ; తల్లిదండ్రుల నుంచి వచ్చే జన్యువుల వల్ల కూడా మతిమరుపు రావొచ్చు. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే మీకొచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

2. నిద్రలేమి ; నిద్రలేమి ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది.. ముఖ్యంగా ఇది మెమోరీ పవర్ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే నిద్రలేమి సమస్యతో బాధపడేవారు.. కంటి నిండా నిద్రపోని వారిలో మతిమరుపు కారణంగా అన్నీ మర్చిపోయే తత్వం ఏర్పడుతుంది. ఎందుకంటే నిద్రలోనే విషయాలను గుర్తుంచుకునే బ్రెయిన్ కణాలు బలంగా మారుతాయి. అందుకే విషయాలు గుర్తుండాలంటే రాత్రిపూట 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. అలాగే పోషకాహారం తింటూ రోజూ వ్యాయమం చేయాలి. కాఫీలు, టీలు, ఆల్కహాల్, స్మోకింగ్ జోలికి వెళ్లకపోవడమే మంచిది.

3. పక్షవాతం ; బ్రెయిన్ కు రక్తం అందకపోతే పక్షవాతం వస్తుంది. దీంతో బ్రెయిన్ కణజాలం దెబ్బతిని విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యం తగ్గుతుంది. డిమెన్షియాకు గుండె జబ్బులు, హై బీపీ, స్మోకింగ్ వంటివి కారణాలు. పక్షపాతం బారిన పడితే మాట తీరు సరిగ్గా ఉండదు. దీనికి తగిన చికిత్స పొందటం మంచిది.

4. డయాబెటీస్ ; డయాబెటీస్ పేషెంట్లు కూడా మతిమరుపు సమస్యతో బాధపడే అవకాశం ఉంది. వీరి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ ఎప్పుడూ ఎక్కువగా ఉంటే మాత్రం బ్రెయిన్ లోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని మతిమరుపు సమస్య వస్తుంది. అందుకే బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుకోవాలి.

5. వయసు ; వయసు మీద పడుతున్న కొద్దీ మతిమరుపు స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మతిమరుపు అనేది అధిక రక్తపోటు, తీసుకునే ఆహారం, డయాబెటీస్, శారీరక శ్రమ, జన్యువులు, గుండె జబ్బులు వల్ల కూడా వచ్చే అవకాశం ఉందని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

6. వ్యాయామం చేయకపోవడం ; రోజువారిగా వ్యాయామాలు చేయటం వల్ల శరీరం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటుంది. అంతకాదు డిమెన్షియా, మతిమరుపు సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. కాబట్టి రోజూ కొంత సమయాన్ని వ్యాయామం చేయడానికి కేటాయించండి. ఎలాంటి జబ్బులు లేకుండా ఉంటారు.

7. అధిక బరువు ; ఊబకాయం అధిక రక్తపోటు, గుండె పోటు వంటి ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. అంతేకాదు దీనివల్ల మతిమరుపు సమస్య కూడా రావొచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఓవర్ వెయిట్ వల్ల మెదడు పనితీరు నెమ్మదిస్తుంది. అందుకే బరువును నియంత్రణలో ఉంచుకోవటం మంచిది.

8. పొగతాగటం ; స్మోకింగ్ వల్ల కూడా మతిమరుపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ స్మోక్ చేసే వారు విషయాలను గుర్తుంచుకోలేరట. ఎందుకంటే దీనివల్ల బ్రెయిన్ రక్తణాళాలు దెబ్బతింటాయి. దీనివల్ల ఒక్క మతిమరుపే కాదు.. పక్షపాతం బారిన పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అలవాటును వెంటనే మానుకోవటం మంచిది.