Chapatis : వివిధ రకాల ధాన్యాలతో చేసిన చపాతీలు తింటే ఏమౌతుందో తెలుసా?
గుండె జబ్బులు, షుగర్ తగ్గి శరీర దారుఢ్యం పెరుగుతుంది. బరువు తగ్గాలన్న ఆలోచనతో ఉన్నవారు చపాతీలను ఎక్కువ నూనె కాకుండా,

Chapathi
Chapatis : ప్రస్తుత కాలంలో అందరిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. అధిక శరీర బరువు పెరగటం వల్ల చాలామంది శరీర బరువు తగ్గడానికి డైట్ లో భాగంగా ప్రతిరోజు చపాతీ తినడం అలవాటు చేసుకున్నారు. అన్నంకు బదులుగా గోధుమలు, జొన్నలతో తయారు చేసిన చపాతీలను ఎక్కువగా తింటున్నారు. గోధుమ పిండిలో తక్కువ క్యాలరీలు ఉండటమే కాకుండా ఎక్కువగా ఫైబర్లు ఉంటాయి. అలా ఉండటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ తో పాటు విటమిన్ బి, ఇలతో పాటు కాపర్, జింక్, మాంగనీస్, పొటాషియం, క్యాల్షియం, అయోడిన్ వంటి పుష్కలంగా లభిస్తాయి. ప్రతి రోజూ చపాతి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చపాతిలో ఉన్న పోషక విలువల కారణంగా ఊబకాయం, అనీమియా, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే గర్భధారణ సమస్యలు కూడా తగ్గిపోతాయి.
గోధుమ పిండిలో ఉండే పోషకాల వల్ల చర్మం డీహైడ్రేషన్ కాకుండా ఎల్లప్పుడు హైడ్రేట్ అవుతుంది. దీంతో చర్మ కాంతి మెరుగుపడుతుంది. అలాగే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండి ఫైబర్ అధికంగా ఉండడం వల్ల శరీర బరువును తగ్గించడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తూ మలబద్దకాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. అయితే అన్నంకు బదులుగా చపాతీలను తినడం సరైందే. కానీ వివిధ రకాల ఇతర ధాన్యాలన్నింటితోనూ చపాతీలను చేసుకుని తింటే ఇంకా మెరుగైన ఫలితాలు లభిస్తాయి. పలు భిన్నరకాల ధాన్యాలతో తయారు చేసిన చపాతీలను తినడం వల్ల వాటిల్లోని పోషకాలన్నింటినీ పొందవచ్చు. దీంతో ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. విభిన్న రకాల ధాన్యాలతో ఏవిధంగా చపాతీలు తయారు చేయవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
పొట్టు తీయని గోధుమ పిండి 2 కిలోలు, శనగ పప్పు 100 గ్రాములు, మొక్కజొన్న లేదా జొన్నలు 100 గ్రాములు, సజ్జలు 50 గ్రాములు, బార్లీ 50 గ్రాములు, రాగులు 50 గ్రాములు, సోయాబీన్ 50 గ్రాములు, ఓట్స్ 100 గ్రాములు తీసుకోవాలి. అన్ని ధాన్యాలను పొట్టు తీసుకోవాలి. గోధుమలు తప్ప అన్ని ధాన్యాలను కొద్దిగా వేయించాలి. తరువాత చల్లారాక అన్నింటినీ గోధుమలతో కలిపి పిండిగా పట్టించాలి. అలా పట్టించిన పిండిని కొద్దిగా ఆరనివ్వాలి. అనంతరం దాన్ని ఓ డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకుని నిల్వవుంచుకున్న పిండిని కావల్సినంత తీసుకుని అందులో కొత్తిమీర, పుదీనా ఆకులు, నీళ్లు వేసి కలుపుకోవాలి. తరువాత ముద్దలుగా చేసి చపాతీలను తయారు చేయాలి. వాటిని పెనంపై కాల్చి వేడిగా ఉండగానే తినేయాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నెయ్యి లేదా వెన్నను వాడవచ్చు. దీంతో చపాతీలు ఇంకా రుచిగా ఉంటాయి. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు అన్నం బదులు చపాతీ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా శరీర బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే క్యాన్సర్ ను నిరోధిస్తుంది. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. గుండె జబ్బులు, షుగర్ తగ్గి శరీర దారుఢ్యం పెరుగుతుంది. బరువు తగ్గాలన్న ఆలోచనతో ఉన్నవారు చపాతీలను ఎక్కువ నూనె కాకుండా, తక్కువ నూనెతో కాల్చుకోవాలి. అసలు నూనె వెయ్యకుండా కూడా చేసుకోవచ్చు. అన్నం కంటే చపాతీ ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. కాబట్టి రెండు లేదా మూడు చపాతీలు మాత్రమే తినాలి.