New Year 2024 : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముందుగా జరుపుకునే దేశం ఏంటో తెలుసా?

2024 కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి ప్రపంచ దేశాలు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. అయితే మొదటగా ఏ దేశం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటుందో తెలుసా?

New Year 2024 : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముందుగా జరుపుకునే దేశం ఏంటో తెలుసా?

New Year 2024

New Year 2024 : 2023 కి బైబై చెప్పే టైమ్ దగ్గర పడుతోంది. 2024 కి వెల్కం చెప్పడానికి ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ఆ అపురూప క్షణాలను సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. న్యూ ఇయర్ అందరికీ ఒకే రోజు మొదలవుతుంది. కానీ కొన్ని గంటల తేడాలో. అసలు ఏ దేశం మొదటగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుందో తెలుసా?

New Years resolutions : 2024 కోసం తీసుకోవాల్సిన బెస్ట్ తీర్మానాలు ఇవే..

2023 వ సంవత్సరం ముగియబోతోంది. ఈ సంవత్సరం అందరికీ మంచి జ్ఞాపకాలను, కొన్ని చేదు అనుభవాలను పంచి ఉండొచ్చు. మంచిని మాత్రమే గుర్తు పెట్టుకుని కొత్త సంవత్సరంలోకి కొత్త లక్ష్యాలతో అడుగు పెట్టాలి. న్యూ ఇయర్ వేడుకలను ప్రపంచ దేశాలు ఎంతో వైభవంగా జరుపుకుంటాయి. న్యూయార్క్ సిటీలో బాల్ డ్రాప్, స్పెయిన్‌లో ద్రాక్ష పండ్లు తినడం వంటి సంప్రదాయాలతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు తమ సంప్రదాయాలను పాటిస్తాయి. సరిగ్గా గడియారం 12 గంటలు కొట్టగానే సంవత్సరం, తేదీ మారగానే సెలబ్రేషన్స్ షురూ అయిపోతాయి.

Ways to Welcome the New Year 2024 : ఈ దేశాల్లో కొత్త సంవత్సరాన్ని ఎలా స్వాగతిస్తారో తెలుసా?

ప్రపంచ దేశాల్లో కాలమానాల ప్రకారం కాస్త అటు ఇటూగా అంటే ముందు వెనుక న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం అవుతాయి. అలా మొదటగా కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే దేశం ఏంటో మీకు తెలుసా? ఫసిపిక్ దీవులైన టోంగా, సమోవా మరియు కిరిబాటి దేశాలు ముందుగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాయి. ఈ దేశాల్లో భారత కాలమానం ప్రకారం తెల్లవారు ఝామున 3.30 గంటలకి ప్రారంభమవుతాయి. జనావాసాలు లేని హౌలాండ్ మరియు బేకర్ దీవులలో అయితే జనవరి 1 IST సాయంత్రం 5.30 నిముషాలకు ప్రారంభమవుతాయట. ఇక్కడే చివరిగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో టైమింగ్ తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రారంభం అవుతాయి.