CSK vs RR: రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయ ఢంకా
ఫైనల్ మ్యాచుకు సమయం దగ్గర పడుతున్న వేళ ప్లేఆఫ్స్‌లో ఏయే జట్లు నిలుస్తాయన్న ఉత్కంఠ నెలకొంది.

Ruturaj Gaikwad, Daryl Mitchell (Photo Source: @IPL)
రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.
రాజస్థాన్ బ్యాటర్లలో రియాన్ పరాగ్ 47, యశస్వి జైస్వాల్ 24, జోస్ బట్లర్ 21, ధ్రువ్ జురెల్ 28, సంజు శాంసన్ 15 పరుగులు చేశారు. సిమరీత్ సింగ్ 3 వికెట్లు తీయగా, తుషార్ 2 వికెట్లు పడగొట్టాడు.
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర 27, రుతురాజ్ గైక్వాడ్ 42 (నాటౌట్), మిచెల్ 22, మోయిన్ అలీ 10, శివం దూబె 18, రవీంద్ర జడేజా 5, సమీర్ రిజ్వీ 15 (నాటౌట్) పరుగులు తీశారు. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీయగా, బర్గర్, ఛాహల్ చెరో వికెట్ తీశారు.
పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు మూడోస్థానానికి చేరుకోగా, హైదరాబాద్ జట్టు మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి దిగజారింది. ఫైనల్ మ్యాచుకు సమయం దగ్గర పడుతున్న వేళ ప్లేఆఫ్స్‌లో ఏయే జట్లు నిలుస్తాయన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించి, ఈ సీజన్ లో క్వాలిఫై అయిన తొలి జట్టుగా నిలిచింది.
RCB vs DC : పంత్ లేడు.. అక్షర్ పటేల్ కెప్టెనా.. అయితే బెంగళూరుదే విజయం..