RCB vs DC : పంత్ లేడు.. అక్షర్ పటేల్ కెప్టెనా.. అయితే బెంగళూరుదే విజయం..
ఆదివారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి.

Mike Hesson Explains How Much Rishabh Pant’s Absence Will Hurt Delhi Capitals
RCB vs DC – Mike Hesson : ఐపీఎల్ 17వ సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉండడంతో ఈ మ్యాచ్ ఫలితం పై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఆడడం లేదు. ఈ క్రమంలో పంత్ లేకుండా ఢిల్లీ తమపై గెలవడం అసాధ్యం అని బెంగళూరు కోచ్ మైక్ హెస్సన్ ధీమాను వ్యక్తం చేశాడు.
జియో సినిమాస్‌తో మైక్ మాట్లాడాడు. చివరి వరుస మ్యాచుల్లో ఇరు జట్లు వరుస విజయాలు సాధించడంతో గెలుపు పై ఇరు జట్లు నమ్మకంతో ఉన్నాయన్నాడు. బెంగళూరు ఆఖరి నాలుగు మ్యాచుల్లోనూ గెలవగా ఢిల్లీ జట్టు ఆఖరి నాలుగింటిలో మూడు మ్యాచుల్లో విజయాలను అందుకుంది. అయితే.. రిషబ్ పంత్ లేకుండా ఢిల్లీ జట్టు బెంగళూరు పై గెలడం సాధ్యం కాదన్నాడు.
KKR : ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా కోల్‌కతా.. షాకిచ్చిన బీసీసీఐ
పంత్ గైర్హాజరీలో అక్షర్ పటేల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని, అయినప్పటికి బెంగళూరు ఓడించడం కష్టమేనన్నాడు. ఎందుకంటే ఆర్‌సీబీ బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తోందని, అదే సమయంలో హోం గ్రౌండ్‌లో ఆడనుండం తమకు కలిసి వస్తుందని చెప్పాడు.