Hyderabad Rain Alert : తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ!
హైదరాబాద్‌లోనూ మరికొన్ని గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీ వర్షం సూచన ఉందని తెలిపింది.

Orange And Yellow alert in Telangana till May 12
Hyderabad Rain Alert : తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వడగళ్ళ వర్షం కురుస్తోంది.
ప్రధానంగా, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం :
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోనూ మరికొన్ని గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీ వర్షం సూచన ఉందని తెలిపింది. హైదరాబాద్ నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షం కారణంగా ఏదైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే సమాచారం అందించాలని సూచిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇతర జిల్లాల్లోనూ భారీ వర్ష సూచన :
మహబూబాబాద్, వరంగల్, కొత్తగూడెం, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలకు సంబంధించి ఇప్పటికే ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి, భువనగిరి, హైదరాబాద్ ప్రాంతాల్లో ఈదుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నెల 14న ఆసిఫాబాద్, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Read Also : Heavy Rains : రాగల మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు