Morning Tea : ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా… అయితే డేంజర్లో పడ్డట్టే?..

నిద్రలేవగానే టీ తో దిన చర్యను ప్రారంభించటం మంచిది కాదని పలు అధ్యయనాల్లో తేలింది. పళ్లు తోముకోకుండా టీ తాగటం వల్ల నోటిలో అప్పటికే ఉండే చెడు బ్యాక్టీరియా పేగుల్లోకి ప్రవేశించి జీవక్రియకు విఘాతం కలిగిస్తుంది.

Morning Tea : ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా… అయితే డేంజర్లో పడ్డట్టే?..

Bed Tea

Updated On : October 30, 2021 / 5:14 PM IST

Morning Tea : ఉదయాన్నే నిద్రలేవగానే టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. పరగడుపున ఇలా టీ తాగటం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ వంటి కెఫిన్ తో కూడిన పానీయాల వల్ల కొత్త ఆరోగ్యసమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పొద్దునే టీ తాగే వారిలో అసిడిటీ సమస్య వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో టీ తాగటం వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా చేయటం శరీర ఆరోగ్యంపై ప్రభావితం చేస్తుంది.

నిద్రలేవగానే టీ తో దిన చర్యను ప్రారంభించటం మంచిది కాదని పలు అధ్యయనాల్లో తేలింది. పళ్లు తోముకోకుండా టీ తాగటం వల్ల నోటిలో అప్పటికే ఉండే చెడు బ్యాక్టీరియా పేగుల్లోకి ప్రవేశించి జీవక్రియకు విఘాతం కలిగిస్తుంది. ఇలా చేయటం వల్ల కడుపులో నొప్పి, వికారం వంటి సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంటుంది.

టీలో ఉండే థియోఫిలిన్ అనే రసాయనం మలబద్ధకానికి కారమౌతుంది. ఉదయం అల్పాహారం తీసుకున్న గంట తరువాత టీ తాగటం మంచిది. సాయంత్రం పూట స్నాక్స్ తో పాటు మీరు టీ ని తీసుకున్నా మంచిదే. ఉదయాన్ని ఖాళీ కడుపుతో టీ తాగటం వల్ల అందులో ఉండే నికోటిన్ మిమ్మల్ని శాశ్వితంగా టీకి బానిసగా మార్చేస్తుంది. అంతేకాకుండా పొట్టలో యాసిడ్ లెవల్స్ పెరగటంతోపాటు, ఐరన్ లోపం వచ్చి ఎనీమియా సమస్యకు దారితీయవచ్చు. కాబట్టి పరగడుపున టీ తాగే అలవాటు ఉన్నవారు దానిని మానుకోవటమే శ్రేయస్కరం.