Finger length tells the personality : ఉంగరం వేలు కంటే చూపుడు వేలు పొడవుగా ఉందా? అయితే మీరు దమ్మున్న లీడర్ అన్నమాట

చేతి వేలి పొడవు కూడా మనిషి వ్యక్తిత్వాన్ని చెబుతుందట. వ్యక్తిలో ఉండే నాయకత్వ లక్షణాలతో పాటు చురుకైన, దయతో కూడిన మనస్తత్వాన్ని జస్ట్ చేతివేళ్ల పొడవుతో చెప్పేయచ్చట.

Finger length tells the personality : ఉంగరం వేలు కంటే చూపుడు వేలు పొడవుగా ఉందా? అయితే మీరు దమ్మున్న లీడర్ అన్నమాట

Finger length tells the personality

Updated On : June 18, 2023 / 2:31 PM IST

Finger length tells the personality : అందరి చేతి వేళ్లు ఒకే రకంగా ఉండవు. పొడవుగా పొట్టిగా ఉండే వేళ్లు మనిషి వ్యక్తిత్వాన్ని చెబుతాయట. ఆశ్చర్యంగా ఉందా? .. నిజమేనట. వేలి పొడవుని బట్టి వారి స్వభావాన్ని, గుణాన్ని చెప్పవచ్చునట. ప్రధానంగా చూపుడు వేలు, ఉంగరపు వేలు ఎలాంటి వ్యక్తిత్వాన్ని చెబుతాయి? అంటే..

కూర్చొనే భంగిమను బట్టి వ్యక్తిత్వం

చేతికున్న ఐదు వేళ్లని బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు అని పిలుస్తాం. అయితే వీటి పొడవును బట్టి మనిషి వ్యక్తిత్వం చెప్పవచ్చునని కొన్ని మానసిక అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా ఉంగరం వేలుకంటే చూపుడు వేలు పొడవు తక్కువగా ఉంటుంది. అలా కాకుండా చూపుడు వేలు పొడవుగా ఉంటే అలాంటివారు ఎటువంటి పరిస్థితిని అయినా ధైర్యంగా ఎదుర్కుంటారట. ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తారట. అంతేకాదు ఇతరులకు విలువైన సలహాలు ఇవ్వడం ద్వారా కూడా మంచి పేరు ప్రతిష్ఠలు పొందుతారట. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉంటారట. వీరిని చాలామంది అనుసరిస్తూ ఉండటం వల్ల ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారట.

 

సర్వసాధారణంగా చూపుడు వేలు, లేదా ఉంగరం వేలులో ఏదో ఒకటి పొడవుగా ఉంటుంది.. ఒకటి పొట్టిగా ఉంటుంది. అలా కాకుండా రెండు సమానంగా ఉండేవారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే లైఫ్‌ని చాలా బ్యాలెన్స్డ్‌గా గడుపుతారట. చాలా సున్నితమైన మనస్తత్వంతో ఉంటూ చేసే పని పట్ల శ్రద్ధతో వ్యవహరిస్తారట. ఇతరులు చెప్పేది వీరు వింటూ శాంతంగా ఉంటారట. ఇక వీరికున్న శాంత స్వభావం కారణంగా అనేకమంది వీరిపట్ల ఆకర్షితులవడంతో పాటు వారి రహస్యాలను కూడా పంచుకుంటారట.

ఏ రాశుల వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా

ఉంగరపు వేలు చూపుడు వేలు కంటే పొడవుగా ఉంటే వీరిలో ఆత్మవిశ్వాసం ఎక్కువ పాళ్లలో ఉంటుందట. ప్రతి విషయంలో నిజాయితీగా, న్యాయబద్ధంగా ముందుకు వెళ్తారట. ఏ పని చేసినా దానికి ముందు ఎంతో ఆలోచిస్తే కానీ మొదలుపెట్టరట. ఏదైనా సమస్య ఎదురైనపుడు దానిని చక్కగా పరిష్కరించుకునే నైపుణ్యం వీరి సొంతం. ఇక అందమైన మనసుతో పాటు అందమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారట. ఎదుటివారి పట్ల దయతో ఉంటారట.

 

ఇక అనేక పరిశోధనల్లో చూపుడు వేళ్ల కంటే ఉంగరపు వేళ్లు పొడవుగా ఉన్న ఆడ, మగవారిలో పజిల్స్, బ్రెయిన్ టీజర్స్, మ్యాథ్స్, రూబిక్ క్యూబ్ వంటి వాటిని చురుకుగా సాల్వ్ చేసే నైపుణ్యం ఉంటుందట. అంతేకాదు వీరిలో ఎక్కువమంది సైంటిస్ట్ లు, ఇంజనీర్లు, సోల్జర్స్‌గా అవుతారట.

డామినెంట్ పర్సనాలిటీతో కలిసి పనిచేయాలంటే..