Increase Appetite : బరువు పెరగాలనుకునేవారికి…ఆకలిని పెంచే చిట్కాలు..

దీర్ఘకాలికమైన డయాబెటిస్, థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత మొదలైన వ్యాధులతో బాధపడేవారు ఆకలిని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. వీటి కారణంగా తినాలన్న కోరిక తక్కువగా ఉంటుంది.

Increase Appetite : బరువు పెరగాలనుకునేవారికి…ఆకలిని పెంచే చిట్కాలు..

Appetite

Updated On : February 23, 2022 / 4:21 PM IST

Increase Appetite : చాలా మందిలో ఆకలి సరిగా లేకపోవటం వల్ల శరీర బరువు అంతంత మాత్రంగానే ఉంటారు. వయస్సుకు తగినంత బరువు లేకపోవటం వల్ల ఆరోగ్యపరంగా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. ఆకలి తక్కువగా ఉన్నవారు కొన్ని రకాల మానసిక ఆరోగ్యసమస్యలతో సైతం ఇబ్బంది పడాల్సి వస్తుంది.

తగినంత ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో అనేక లోపాలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారుతుంది. అందువల్ల ఎవరైనా ఆకలి లేకపోవటం వల్ల ఇబ్బందులు పడుతూ బరువు పెరగలేకుండా ఉంటే ఆకలిని పెంచడానికి కొన్ని చిట్కాలు మీకోసం అందిస్తున్నాము… అయితే ముందుగా, మీకు తినాలని ఎందుకు అనిపించడం లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

1. ఒత్తిడి: ఒత్తిడి అనేది శరీరానికి నిజమైన సవాలులాంటిది. ఒత్తిడి కారణంగా శరీరంలో ఎపినెఫ్రైన్ అనే హార్మోన్‌ను విడుదలవుతుంది. దీనిని ఆడ్రినలిన్ అని కూడా పిలుస్తారు. ఇది ఆకలిని తాత్కాలికంగా తగ్గిస్తుంది. ఆకలి లేకపోవటం అన్నది ఆరోగ్యానికి మంచిది కాదు.

2. మందులు: శరీరంలో వచ్చే వివిధ రకాల సమస్యలకు మందులు వాడుతున్నట్లైతే వాటి దుష్ప్రభావాలు కారణంగా ఆకలి లేకపోవటం జరగవచ్చు. ఆకలి లేకపోవటానికి ఇది కూడా ఒక కారణమని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

3. డిప్రెషన్: డిప్రెషన్‌తో బాధపడేవారిలో ఆహారం తినాలన్న ఆసక్తిని తగ్గుతుంది. దీనివల్ల ఆహారాన్ని తీసుకోలేని పరిస్ధితి ఏర్పడుతుంది.

4. వైరల్ , బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సైతం ఆకలి లేకుండా చేసేందుకు కారణం కావచ్చు. జలుబు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సందర్భాల్లో ఇలా జరుగుతుంది. వైరల్ , బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు శరీరం వ్యాధితో పోరాడటానికి అవసరమైన మొత్తంలో శక్తిని పొందే ప్రయత్నం చేస్తుంది. ఆసందర్భంలో సైటోకిన్‌లనే ప్రత్యేక హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది.

5. దీర్ఘకాలిక వ్యాధులు: దీర్ఘకాలికమైన డయాబెటిస్, థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత మొదలైన వ్యాధులతో బాధపడేవారు ఆకలిని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. వీటి కారణంగా తినాలన్న కోరిక తక్కువగా ఉంటుంది.

6. తినే రుగ్మతలు: అనోరెక్సియా నెర్వోసా ఉన్నవారిలో ఆహారాన్ని సమయానికి తీసుకోలేరు. తినాలన్న కోరికను ఇది తగ్గిస్తుంది. శరీరం ఆహారం కావాలని కోరుకున్నప్పటికీ తినలేరు.

ఆకలి తక్కువగా ఉన్నవారు ఆకలి పెంచుకునేందుకు ; ఆకలి తక్కువగా ఉంటే తినే ఆహారాన్ని ఒకేసారి కాకుండా కొద్దికొద్ది మొత్తాల్లో తరచూ తీసుకోవటం మంచిది. భోజన సమయాలను ఎప్పుడెప్పుడు తీసుకోవాలో మీరే ప్లాన్ చేసుకోండి. తాజా పండ్లు, నానబెట్టిన గింజలు, ఆరోగ్యకరమైన స్నాక్స్ ను తినేవాటిలో చేర్చుకోండి. ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉండే గింజలు , నెయ్యి, కొబ్బరి, మాంసం లాంటివి తీసుకుని ప్రాసెస్ చేసిన అయిల్ ఫుడ్ లను తినటం మానుకోండి. భోజనం తోపాటు ఇతర ద్రవపదార్ధాలను తీసుకోవద్దు. తిన్న అరగంట తరువాత మాత్రమే నీటిని తాగాలన్న నియమం పెట్టుకోండి.

ఆకలిని పెంచే ఆహారాలు ;

దాల్చిన చెక్క: దాల్చినచెక్కలో హైడ్రాక్సీచాల్కోన్ ఉంటుంది, ఇది ఆకలిని పెంచడానికి సహాయపడుతుంది.

నెయ్యి లేదా కొబ్బరి నూనె ; వంటకాలలో నెయ్యి, కొబ్బరినూనెలను వాడటం మేలు . ఇలాంటి వాటిని వినియోగించటం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. వీటి ద్వారా ఆకలిని ప్రోత్సహించే హార్మోన్ గ్రెలిన్ విడుదలవుతుంది. ఇది ఆకలిని పెంచుతుంది.

ఏలకులు: ఏలకులు, దాని సువాసన ఆకలిని పెంచడంలో సహాయపడుతుంది. భోజనానికి 30 నిమిషాల ముందు నీరు త్రాగడం, తినేటప్పుడు పెద్ద ప్లేట్ తీసుకోవడం వంటివి చేస్తే ఎక్కువ ఆహారం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఆకలిని తగ్గించే ఆహారలకు దూరంగా ఉండండి ;

కాఫీ: కాఫీ తాగే అలవాటుంటే ఇది శరీరంలో పెప్టైడ్ ప్లాస్మా స్థాయిలను పెంచుతుంది,  దీనివల్ల ఆకలి తగ్గిపోతుంది.

బాదం: బాదంపప్పులోని ప్రోటీన్, అసంతృప్త కొవ్వు , ఫైబర్ ఆకలి లేకుండా చేయటంలో ఎక్కువ పాత్ర పోషిస్తాయి.

టోఫు: టోఫులో జెనిస్టీన్ అనే ఐసోఫ్లేవోన్ అధికంగా ఉంటుంది, ఇది ఆకలిని అణిచివేస్తుంది. దీని వల్ల ఆహారం తీసుకోవడం తగ్గిపోతుంది.

చిలగడదుంప: తియ్యగా ఉండే బంగాళదుంపలు జీర్ణ ఎంజైమ్‌లను నిరోధించే ప్రత్యేకమైన పిండి పదార్ధాలను కలిగి ఉంటాయి, ఇవి కడుపులో ఎక్కువసేపు జీర్ణంకాకుండా ఉండటం వల్ల కడుపు నిండుగా ఉండి ఆకలిని తగ్గిస్తుంది.