పండగానే పేదలకు పంపిణీ : అరటి కాయలతో గణేశుడు

వినాయక చవితి పండుగ వచ్చేందంటే చాలు.. వీధి వీధిన పందిళ్లు వేయాల్సిందే.. వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించాల్సిందే. భక్తులంతా కలిసి వినాయకుడి వేడుకులను ఘనంగా నిర్వహిస్తుంటారు. గణేశ్ చతుర్థి.. రోజు నుంచి ప్రతి చోట వీధుల్లో.. ఇళ్లలో బొజ్జ గణేశుడు కొలువుతీరుతాడు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణనాథుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. తొమ్మిది రోజులు పూర్తి అయ్యాక పదో రోజున వినాయకుడిని నిమజ్జనం చేస్తుంటారు. వినాయక విగ్రహాలను రసాయనాలతో తయారు చేయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని ప్రతిఒక్కరూ ఎకో ఫ్రెండ్లీ గణేశుడి విగ్రహాలను తయారు చేస్తున్నారు.
చాలామంది ఎకో ఫ్రెండ్లీ గణేశుడి విగ్రహాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గణనాథుడి విగ్రహాలను మట్టితోనూ పండ్లతోనూ తయారుచేస్తున్నారు. ప్రత్యేకించి ఒడిసాలో ఓ గ్రామంలో వినాయకుడి ప్రతిమ అందరిని ఆకట్టుకుంటోంది. గణనాథుడి విగ్రహాన్ని అరటికాయలు, వెదురు బొంగులతో తయారుచేశారు. తొమ్మిది రోజుల పాటు గణనాథుడికి పూజలు నిర్వహిస్తారు. పదో రోజున అరటి కాయలు పక్వానికి వచ్చి పండ్లుగా మారుతాయి. ఆ అరటి పండ్లను పేదలందరికి ప్రసాదంగా పంపిణీ చేస్తున్నారు.
పర్యావరణానికి హాని కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎకో ఫ్రెండ్లీ గణేశుడి ప్రతిమలను తయారు చేస్తున్నారు. అరటికాయలు, వెదురుతో గణేశ విగ్రహాలను తయారు చేయడం 2017లో ఒడిసాలోని సంబాల్ పూర్ గ్రామంలో ప్రారంభమైంది. ఒడిసా టౌన్ నుంచి నటరాజ్ క్లబ్ సభ్యులు ప్రతి ఏటా వినాయక చవితికి ఇలాంటి విగ్రహాలను తయారు చేస్తున్నారు.
అంతకుముందు ఈ క్లబ్ సభ్యులు జీవఅధోకరణ పదార్థాలైన కొబ్బరికాయలు, రుద్రాక్షలు, స్వీట్ బుంది లడ్డూలు, మౌలీ దారాలు, శంఖం గుండ్లతో 25 అడుగుల ఎత్తైన వినాయకుడి విగ్రహాలను తయారు చేస్తున్నారు. విగ్రహాల్లో ఏకైకతకు నిదర్శనంగా ఈ తరహా విగ్రహాలను నీటిలో వేసినప్పటికీ మునగవు. నీటిలో కలిసిపోవు.
కానీ, ఈ వస్తువులనే మరోసారి వాడుకునే అవకాశం ఉంటుంది. 2019 ఏడాదిలో బెంగళూరులోని పుట్టెంగాల్లి గణేశుడి దేవాలయంలో అద్భుతమైన గణేశుడి విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహాన్ని మొత్తం 9వేల కొబ్బరికాయలతో అలకరించి ప్రతిష్టించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 20రోజుల పాటు 70మంది భక్తులు కలిసి ఎకో ఫ్రెండ్లీ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు.
గణేశుడి దేవాలయాన్ని కొబ్బరికాయలు మాత్రమే కాకుండా 20 రకాల కూరగాయలతో అలకరించి ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. 2018 ఏడాదిలో గణేశుడి విగ్రహాన్ని చెరకు కర్రలతో తయారు చేశారు. ఎకో ఫ్రెండ్లీ గణేశుడి విగ్రహాలకు భారీ గిరాకీ ఉంటోంది. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మార్కెట్లో ఎక్కువ మంది ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను కొనేందుకు ఇష్టపడుతున్నారు.
Karnataka: An idol of Lord Ganesha made for #GaneshChaturthi, using over 9,000 coconuts, at a temple in Bengaluru. (01.09.2019) pic.twitter.com/IILC74wbXe
— ANI (@ANI) September 1, 2019