Gastric problems : గ్యాస్ట్రిక్ సమస్యలు కారణాలు, చికిత్స !
అధిక బరువు వల్ల కూడా ఈ సమస్యలు రావచ్చు. బరువు తగ్గటం ద్వారా సమస్య నుండి బయటపడవచ్చు. మద్యపానం, పొగ త్రాగే వ్యక్తులు ఈ సమస్యను నివారించడానికి చెడు అలవాట్లను వదిలేయాలి.

Abdominal discomfort
Gastric problems : జీవనశైలిలో మార్పుల కారణంగా ఇటీవలి కాలంలో అనేక మంది ఆరోగ్య సమస్యలను కొని తెచ్చకుంటున్నారు. అలాంటి సమస్యల్లో నిత్యం ఎదుర్కొనేవి గ్యాస్, అజీర్ణం , పుల్లని త్రేనుపులు రావటం వంటి సమస్యలు. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి ఆహారపు అలవాట్లు, మద్యం , సిగరెట్‌ల వినియోగం ,అతిగా తినడం వల్ల కూడా వస్తుంది. ఈ సమస్య కారణంగా ఛాతీలో మంట , నోటిలో పుల్లని త్రేనుపులు రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఈ సమస్య తీవ్రంగా మారితే తిన్న ఆహారం మళ్లీ కడుపులో నుండి నోటిలోకి రావడం జరుగుతుంది.
READ ALSO : Health Tips : ఉబ్బరం, త్రేనుపు,గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమన కోసం !
మన కడుపులో ఆహార తీసుకునే పేగుకు మధ్య ఒక వాల్వ్ ఉంది. ఈ వాల్వ్ తిన్న ఆహారం, యాసిడ్ తిరిగి ఆహార పైపులోకి రాకుండా చేస్తుంది. అయితే అది బలహీనంగా మారినప్పుడు, ఈ వాల్వ్ దాని సామర్థ్యాన్ని కోల్పోయి అజీర్ణం, గ్యాస్ , పుల్లని త్రేనుపు వంటి సమస్యలు తలెత్తుతాయి. అధిక బరువు వల్ల కూడా ఈ సమస్య మొదలవుతుంది. మద్యం సేవించే వారిలో ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. గర్భధారణ సమయంలో ,స్పైసీ ఫుడ్ తినేవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఒకే చోట కదలకుండా కూర్చొని ఉద్యోగం చేసేవారిలో సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
READ ALSO : Mishri Benefits : మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం కలిగించే పటిక బెల్లం!
యాసిడ్ రిఫ్లక్స్ నివారించడానికి మార్గాలు ;
గ్యాస్ అజీర్ణం,పుల్లని త్రేనుపు సమస్యతో బాదపడుతున్నవారు సమస్య ఎక్కువ కాలం కొనసాగితే వైద్యుల వద్దకు వెళ్లి మందులు తీసుకోవడం మంచిది. ఈ సమస్యను ఎదుర్కోవాలంటే జీవనశైలిని మార్చుకోవడం ద్వారా దాన్ని పరిష్కరించవచ్చు. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఎక్కువ కారంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మానేయాలి.
అధిక బరువు వల్ల కూడా ఈ సమస్యలు రావచ్చు. బరువు తగ్గటం ద్వారా సమస్య నుండి బయటపడవచ్చు. మద్యపానం, పొగ త్రాగే వ్యక్తులు ఈ సమస్యను నివారించడానికి చెడు అలవాట్లను వదిలేయాలి.
READ ALSO : Walking in Winter : శీతాకాలంలో ఆరుబయట వాకింగ్ చేసే వారు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి !
గ్యాస్ మరియు అజీర్ణం సమస్య నుండి ఉపశమనం పొందేందుకు ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తినటానికి బదులుగా కొద్ది మొత్తంలో తీసుకోవటం మంచిది. రాత్రిపూట ఆహారం, నిద్రకు మధ్య 2 గంటల గ్యాప్ తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
నిద్రపోయే ముందు నీరు లేదా పాలు తాగకూడదు. భోజనం తర్వాత 30 లేదా 60 నిమిషాల వరకు ఏ రకమైన పానీయం తీసుకోరాదు. రాత్రి భోజనంలో తక్కువ తీసుకోవాలి. గ్యాస్ మరియు పుల్లని త్రేనుపు సమస్య నుండి బయటపడటానికి, నిద్రపోయేటప్పుడు మెడను కొద్దిగా పైకి ఉంచి దిండులాంటిది పెట్టుకుని నిద్రించండి.