Benefits of Oiling Hair : తలకు నూనె రాయటం అవసరమా ? దీని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసా ?

జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ నూనెను తప్పక రాయాలి. రోజు రాసుకోవటం కుదరకపోతే కనీసం వారానికి రెండుసార్లు జుట్టుకు నూనె రాయాలి. రాత్రి నిద్రకు ముందు తలకు నూనె బాగా పట్టించి ఉదయం తలస్నానం చేయటం వల్ల జుట్టుకు మంచి ఫలితం ఉంటుంది.

Benefits of Oiling Hair : తలకు నూనె రాయటం అవసరమా ? దీని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసా ?

Benefits of oiling hair

Updated On : November 18, 2023 / 11:25 AM IST

Benefits of Oiling Hair : తలకు నిత్యం నూనె రాసుకోవాలని ఆయుర్వేదం చెబుతుంది. పూర్వం నుండి మన పెద్దలు తలకు నూనె రాసుకోమని సూచిస్తుంటారు. అయితే ఇప్పుడు తలకు నూనె లేకుండా తిరగటం ఫ్యాషన్ అయిపోంది. చాలా మంది తలకు నూనె పెట్టుకోవడం పూర్తిగా మానేశారు. దాని వల్ల జుట్టు రాలిపోవటం, చుండ్రు, కుదుళ్ళు బలహీనంగా మారటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే తలకు నూనె పెట్టుకోవడం అన్నది చాలా ముఖ్యం.తలకు నూనె పెట్టుకోవడం చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : Combat Acid Reflux : యాసిడ్ రిఫ్లక్స్‌ను ఎదుర్కోవడంలో వ్యాయామం సహాయపడుతుందా?

తలకు నూనె రాయటం వల్ల కలిగే ప్రయోజనాలు ;

ఆయుర్వేదం జుట్టుకు నూనె రాయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నట్లు స్పష్టం చేస్తుంది. జుట్టుకు ఆయిల్​ పూసి మసాజ్​ చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టుకు బలం చేకూరుతుంది. బాడీ మసాజ్ లేదా హాట్ ఆయిల్ మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడినట్లే తలలోని మూలాలను బలపరిచేందుకు తలకు నూనె రాయటం అవసరం. దీని వల్ల జుట్టు రాలడం, తెల్లగా మారటం, చుండ్రు వంటి అనేక రకాల సమస్యలను నయం చేయవచ్చు.

మన పెద్దలు పిల్లలను రోజు నూనె రాయమని బలవంతం చేస్తారు. చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తారు. వాస్తవానికి జుట్టుకు నూనె రాయడం అన్నది చాలా ముఖ్యం. నూనెతో జుట్టును సున్నితంగా మసాజ్ చేయడం వల్ల జుట్టు మదృువుగా మారుతుంది. అంతేకాకుండా తేమను పెంచుతుంది. జుట్టుకు మంచి మెరుపు సంతరించుకుంటుంది.

READ ALSO : Betel Leaf for Hair Growth : ఒత్తైన, పట్టులాంటి జుట్టు కోసం…తమలపాకులను పేస్ట్ గా చేసి !

నూనె రాయడం వల్ల జుట్టు పొడిబారకుండా ఉండి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పొడిగా ఉండి చిట్లి పోతుంటే వారానికి మూడుసార్లు జుట్టుకు నూనె రాయడం జుట్టుకు బలం చేకూరుతుంది. దీంతో జుట్టు చిట్లకుండా ఉంటుంది. నూనె రాయటం వల్ల జుట్టు మెరిసేలా, ఒత్తుగా కనిపించేలా చేస్తుంది.

కొబ్బరి, ఆలివ్, నువ్వులు, బాదం, అర్గాన్, బృంగరాజ్, ఉసిరి వంటి సాధారణంగా ఉపయోగించే కొన్ని నూనెలు జుట్టు రాలడం, చుండ్రు, చిట్లిపోవడం, నెరవడం వంటి మొదలైన సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి. పలు రకాల నూనెలు వివిధ విటమిన్లను కలిగి ఉంటాయి. ఈ నూనెలను నేరుగా పూయడంతో, జుట్టు కుదుళ్ళు బలపడతాయి.

READ ALSO : Neehar Sachdeva : జుట్టురాలిపోతోందని డిప్రెషన్‌లోకి వెళ్లేవారు ‘నీహార్ సచ్‌దేవా’ స్టోరీ చదవండి

జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ నూనెను తప్పక రాయాలి. రోజు రాసుకోవటం కుదరకపోతే కనీసం వారానికి రెండుసార్లు జుట్టుకు నూనె రాయాలి. రాత్రి నిద్రకు ముందు తలకు నూనె బాగా పట్టించి ఉదయం తలస్నానం చేయటం వల్ల జుట్టుకు మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయటం వల్ల తలలో చుండ్రు తగ్గుతుంది. జుట్టు కూడా పెరుగుతుంది.

నూనెల్లో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టులోని లిపిడ్లను భర్తీ చేయడంలో సహాయపడతాయి. జుట్టు ఆరోగ్యంగా కనిపించేలా చేయడంలో లిపిడ్‌లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. లిపిడ్లు వల్ల జుట్టు మెరవటంతోపాటు, అందంగా ఉంటుంది. అయితే కొన్ని రకాల నూనెలు అలెర్జీని కలిగిస్తాయి. వాటిని రాసే ముందు ముందుగా కొద్దిగా రాసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవని నిర్దారించుకోవాలి. ఆతరువాతనే వాటిని ఉపయోగించాలి.

READ ALSO : Hypothyroidism : థైరాయిడ్ తగ్గితే జుట్టు పెరుగుతుందా?

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యుల సూచనలు, సలహాలు పాటించటం మంచిది.