Health Myths And Facts : రోజులో ఏసమయంలోనైనా పండ్లు తినొచ్చా? నిపుణులు ఏంచెబుతున్నారంటే ?

పండ్లు పోషకాలకుమూలం. విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటివి ఉంటాయి. వాటిలో క్యాలరీలు,కొవ్వు తక్కువగా ఉంటాయి. పండ్లలోని ఫైబర్ కడుపు నిండుగా ఉంచేందుకు సహాయపడుతుంది.

Health Myths And Facts : రోజులో ఏసమయంలోనైనా పండ్లు తినొచ్చా? నిపుణులు ఏంచెబుతున్నారంటే ?

fruits for eating

Updated On : November 10, 2023 / 5:06 PM IST

Health Myths And Facts : పండ్లలో పోషకాలు , ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వాటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కొన్ని పండ్లను తినటం వల్ల అలెర్జీ సమస్యలు ఎదుర్కొనేవారు, కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పండ్లను తినలేని సందర్భాలు ఉంటాయి. సాధారణంగా పండ్లు మన ఆహారంలో అవసరమైన అన్ని పోషకాలకు ఆరోగ్యకరమైన మూలంగా ఉపకరిస్తాయి. పండ్లు ఆరోగ్యానికి మేలు కలిగించే చిరుతిండిగా కూడా ఎంపిక చేసుకోవచ్చు. వాటిని పచ్చిగా తిన్నా లేదా స్మూతీస్గా , పెరుగుతో కలిపి తిన్నా శరీరానికి మంచి పోషకాలే లభిస్తాయి.

READ ALSO : Eating Fruits : బరువు ఎక్కువ ఉన్నవాళ్లు పండ్లు తినొచ్చా…?

పండ్లు తినడానికి సంబంధించి చాలా మందిలో అనేక అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా ఏ సమయంలో పండ్లు తినాలన్న విషయంలో చాలా మందిలో సందేహాలు కలుగుతాయి. అయితే కొందరు నిపుణులు పగలు, రాత్రి సమయంలో ఎప్పుడైనా పండ్లు తినవచ్చు అని చెబుతున్నారు. దీని గురించి మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పండ్లు తినడానికి అనువైన సమయం ఏది?

నిపుణులు చెబుతున్న ప్రకారం పండ్లను తినడానికి అనువైన సమయం ఎక్కువగా వ్యక్తిగత ప్రాధాన్యత, ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. పగటిపూట లేదంటే రాత్రిపూట పండ్లను తినడం మంచిది. అయితే పండ్లు తినేందుకు సరైన సమయాన్ని ఎంచుకునే ముందు కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

READ ALSO : Fruits vs Fruit Juices : పండ్లు vs పండ్ల రసాలు.. వీటిలో ఏవి ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయో తెలుసా ?

చాలా మంది పగటిపూట పండ్లు తీసుకోవాలని సిఫార్సు చేస్తారు. ఎందుకంటే పండ్లలో ఉండే సహజ చక్కెరల వల్ల శరీరానికి సహజమైన శక్తిని అందుతుంది. అంతేకాకుండా పగటి సమయంలో చురుకుగా ఉంచడంలో సహాయపడతాయి. పండ్లలోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థతోపాటు మొత్తం ఆరోగ్యానికి సహాయపడతాయి.

అదే సమయంలో రాత్రిపూట పండ్లు తినడం కొంతమందికి ప్రయోజనకరమని చెప్పవచ్చు. చెర్రీస్ , కివి వంటి కొన్ని పండ్లు మెలటోనిన్ కంటెంట్ కారణంగా మంచి నిద్రకు సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. పండ్లను నిద్రవేళ చిరుతిండిగా తీసుకోవడం వల్ల అర్థరాత్రి అనారోగ్యకరమైన స్నాక్స్ తినాలన్న కోరికలను తగ్గించుకోవచ్చు. శక్తిని పెంచుకోవాలనుకుంటే పగటిపూట పండ్లు తీసుకోవటం మంచిది, అయితే రాత్రి నిద్ర బాగా పట్టాలంటే రాత్రి సమయంలో చిరుతిండ్లకు బదులు పండ్లు తీసుకోవటం మేలు. సాయంత్రం సమయంలో పండ్లను తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి సమతుల్య ఆహారం , పండ్లను అధికంగా తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : Arthritis Pain : కీళ్ల నొప్పులు తగ్గించే అద్భుతమైన 5 పండ్లు!

ఏ సమయంలో పండ్లు తినటం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది ;

పండ్లు తినటం అన్నది శరీరాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. ఉదయం పండ్లు తింటే శరీరానికి సహజమైన చక్కెరలు, విటమిన్లు, ఖనిజాలను అందుతాయి. ఇది మెటబాలిజానికి తక్షణం శక్తికి దోహదం చేస్తాయి. పండ్లలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలను స్ధిరంగా ఉంచటంలో దోహదం చేస్తాయి.

పండ్లను పగటిపూట స్నాక్స్‌గా తీసుకోవడం వల్ల అనారోగ్యకరమైన చిరుతిండ్లు తినాలన్న కోరికలను కట్టడి చేయవచ్చు. పండ్లలోని ఫైబర్ కంటెంట్ కారణంగా కడుపు నిండిని అనుభూతి కలుగుతుంది. ఇది బరువు పెరగకుండా, క్యాలరీలను నియంత్రించడంలో సహాయపడతాయి. సాయంత్రం పండ్లు తినడం వలన విభిన్న ప్రభావాలు కలుగుతాయి. ఏది ఏమైనప్పటికీ, పండ్లలో సహజ చక్కెరలు కొంత మంది వ్యక్తులలో నిద్రపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున పరిమిత మోతాదులో తీసుకోవటం మేలు.

READ ALSO : Stomach Health : పొట్ట ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు ఇవే!

పండ్లను తీసుకునే సమయాల విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన వ్యక్తులు ;

పండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటంవల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు సాయంత్రం పండ్లను తీసుకోవటం అంతమంచిది కాదు. పండ్లను భోజనంతిన్న వెంటనే తినడం వల్ల జీర్ణవ్యవస్థకు అంతరాయం కలుగుతుంది. కడుపులో అసౌకర్యం, గ్యాస్‌ను ఉత్పత్తికి దారితీస్తుంది. జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఖాళీ కడుపుతో పండ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి.

భోజనంతో పాటు లేదంటే భోజనానికి ముందు పండ్లను తినడం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. పండ్లు అధిక కేలరీల ఆహారాన్ని తక్కువగా తీసుకునేలా చేస్తుంది. ఒక రోజులో పండ్లు తినే విషయంలో నిర్దిష్ట సమయం ఎంచుకోవాలి. డయాబెటిక్ రోగులకు, గర్భధారణ మధుమేహ రోగులకు పండ్లు తీసుకునే సమయంలో మార్పులు ఉంటాయి. వాళ్ళయొక్క ఆరోగ్య సమస్యలపై అది ఆదారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

READ ALSO : Avoid Eating Raw Vegetables : ఈ నాలుగు రకాల కూరగాయలు, పండ్లు పచ్చిగా తినకూడదు తెలుసా ?

అర్ధరాత్రి స్నాక్స్ గా పండ్లు తీనటం మంచిదా ?

అర్ధరాత్రి అల్పాహారంగా జంక్ ఫుడ్ తినటం కంటే ఆరోగ్యకరమైన పండ్లను తినటం ఉత్తమం. ఎందుకంటే పండ్లు పోషకాలకుమూలం. విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటివి ఉంటాయి. వాటిలో క్యాలరీలు,కొవ్వు తక్కువగా ఉంటాయి. పండ్లలోని ఫైబర్ కడుపు నిండుగా ఉంచేందుకు సహాయపడుతుంది. పండ్లు రాత్రి సమయంలో అతిగాతినటాన్ని నివారించడంలో సహాయపడుతుంది. పండ్లు సహజ చక్కెరలకు మంచి మూలం. అర్ధరాత్రి స్నాక్‌గా పండ్లను తీసుకునే వారు వాటిని మితంగా తినాలని గుర్తుంచుకోవాలి. పండ్లను అర్ధరాత్రి ఆకలిగా ఉండే పండ్లు తినాలనుకునే వారు ప్రాసెస్ చేసిన వాటి కంటే తాజా పండ్లను ఎంచుకోవాలి. పండ్ల రసాలు వంటి చక్కెర అధికంగా ఉండే పండ్లను నివారించాలి. గింజలు, నూనెగింజలు ,చీజ్ వంటి ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలతో పండ్లను కలిపి తీసుకోవాలి.