B12 Vitamin : శరీరానికి బి 12 అందించే 7 రకాల ఆహారాలు ఏంటంటే!..

శాఖాహారాన్ని మాత్రమే తీసుకుని, కోడిగ్రుడ్లు, పాల ఉత్పత్తులు, చేపలు వంటి వాటిని తీసుకునేందుకు అయిష్టత చూపే వారిలో విటమిన్ బి 12 లోపిస్తుంది. అలాంటి సమయంలో పాల రహిత ఉత్పత్తులైన బలవర్

B12 Vitamin : శరీరానికి బి 12 అందించే 7 రకాల ఆహారాలు ఏంటంటే!..

B12

Updated On : August 28, 2021 / 11:34 AM IST

B12 Vitamin : మనిషి శరీరంలో జీవక్రియను పెంచటానికి, రోగనిరోధక శక్తిని బలో పేతం చేయటానికి సహాయపడే ముఖ్యమైన పోషకం విటమిన్ బి 12, దీనిని కొబాలమిన్ అని కూడా పిలుస్తారు. మనిషి శరీరం చురుకుదనంగా లేకపోవటం, బద్దకంగా ఉన్నట్లు అనిపిస్తే దాని కారణం బి12 లోపమనే చెప్పాలి. మనిషిలో చురుకుదనం పెంచేందుకు విటమిన్ బి 12 పోషకాన్ని శరీరానికి అందించాలి. ఇది సహజంగా మొక్కలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, చేపలు వంటి ఆహారపదార్ధాల్లో లభిస్తుంది.

శాఖాహారాన్ని మాత్రమే తీసుకుని, కోడిగ్రుడ్లు, పాల ఉత్పత్తులు, చేపలు వంటి వాటిని తీసుకునేందుకు అయిష్టత చూపే వారిలో విటమిన్ బి 12 లోపిస్తుంది. అలాంటి సమయంలో పాల రహిత ఉత్పత్తులైన బలవర్ధకమైన ఆహార పదార్ధాలను తినాలి. తృణ ధాన్యాలు వంటి వాటిని ఆహారంలో బాగం చేసుకోవటం వల్ల శరీరానికి అవసరమైన బి 12 లభిస్తుంది. శరీరానికి అవసరమైన బి 12 పుష్కలంగా లభించే ఆహారాలు వాటి వివరాలేంటో తెలుసుకుందాం…

1. చేపలు ; చేపల్లో విటమిన్ బి12 అధికంగా లభిస్తుంది. ట్యూనా, సాల్మన్, సార్డినెస్ , ట్రౌట్ వంటి వివిధ రకాల చేపలను ఆహారంగా తీసుకోవటం ద్వారా శరీరానికి అవసరమైన బి 12 విటమిన్ అందుతుంది. యూస్ అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ అందించిన సమాచారం ప్రకారం 150 గ్రాముల సార్డినెస్ లో 554శాతం విటమిన్ బి 12 లభిస్తుంది. సాల్మన్ రకం చేపలో కూడా అధిక మొత్తంలో ప్రొటీన్ లు లభిస్తాయి.

2. పాలు ; పాల ద్వారా విటమిన్ బి 12 లభిస్తుంది. అందుకే వైద్య నిపుణులు బి 12 లోపాన్ని నివారించటానికి ప్రతిరోజు పాలు తాగమని సూచిస్తుంటారు. పాలు తాగటం వల్ల అదనంగా కాల్సియంతోపాటు, విటమిన్ డి కూడా లభిస్తాయి. శాకాహారులు సోయా పాలతో బి 12 లోపాన్ని భర్తీ చేయవచ్చు. యుఎస్ డిఎ అంచనా ప్రకారం కప్పు సోయా పాలు 45శాతం బి 12 అందిస్తుంది.

3. పెరుగు ; డైరీ పదార్ధాల్లో పెరుగు చాలా ముఖ్యమైనది. ఇందులో సైతం విటమిన్ బి 12 అధికంగా ఉంటుంది. కాల్షియంతోపాటు, విటమిన్ డి, ఇతర ప్రోబయోటిక్స్ పెరుగులో సమృద్ధిగా దొరుకుతాయి.

4. గుడ్లు ; ప్రొటీన్లు, విటమిన్ లు పుష్కలంగా లభించే ఆహారం ఏమైనా ఉందంటే అది గుడ్లనే చెప్పాలి. ప్రతిరోజు ఉడికించిన రెండు గుడ్లు తినటం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ బి 12 ను అందిస్తాయి. ఉడికించిన రెండు గుడ్ల నుండి 1.6 మైక్రోగ్రాముల విటమిన్ బి 12 అందుతుంది.

5. చిరుధాన్యాలు,తృణధాన్యాలు ; అత్యంత బలవర్ధకమైన ఆహారంగా చిరు,తృణ ధాన్యాల ఆహారాలను చెప్పవచ్చు, శరీరానికి కావల్సిన అన్ని విటమిన్లు, ప్రొటీన్లు ఇందులో లభిస్తాయి. విటమిన్ 12 ఎక్కవగా వీటిని ఆహారంగా తీసుకోవటం ద్వారా లభిస్తుంది.

6. చికెన్ ; మాంసాహారంలో చికెన్ ఒకటి . ఇందులో ఎక్కవ ప్రొటీన్ కంటెంట్ ఉంటుంది. ఆరోగ్య నిపుణుల అంచనాల ప్రకారం 75గ్రాముల కాల్చిన టర్కీ కోడి చికెన్ లో 0.3 మైక్రోగ్రాముల విటమిన్ బి 12లభిస్తుంది. బి 12 శరీరానికి సమకూరాలంటే అప్పుడప్పుడు చికెన్ ను తీసుకోవటం మంచిది.

7. న్యూట్రిషియన్ ఈస్ట్ ఫ్లేక్స్ ; శాకాహారులకు న్యూట్రిషియన్ ఈస్ట్ ప్లేక్స్ మంచి ఆహారంగా చెప్పవచ్చు. మార్కెట్లోకి వివిధ కంపెనీలు దీనిని అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఒక ప్రసిద్ధమైన ఆహారంగా చెప్పవచ్చు. శాకాహార వంటల్లో దీనిని ఉపయోగిస్తుంటారు. ఇది ఆహారంలో కలపటం వల్ల మంచి రుచివస్తుంది. యూఎస్ డిఎ అంచనా ప్రకారం రెండు టేబుల్ స్పూన్ల న్యూట్రిషియన్ ఈస్ట్ లో 733శాతం వరకు విటమిన్ బి 12 లభిస్తుందట.

సరైన ఆహారపు ఆలవాట్ల ద్వారానే మనిషి ఆరోగ్యంగా జీవిచగలడన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. శరీరానికి అవసరమైన పోషకాలను ఎప్పటికప్పుడు అందించటం చాలా ముఖ్యమైనదని గమనించాలి. దీని వల్ల వ్యాధుల బారిన పడకుండా ఫిట్ గా, ఆరోగ్యంగా జీవించేందుకు అవకాశం ఉంటుంది.