Fox nuts benefits : తామర గింజలు తింటే ఆరోగ్యం మీ వెంటే..
తామర గింజలు తింటే ఆరోగ్యం మీ వెంటే..అంటున్నారు న్యూట్రిషనిస్ట్‌లు.

Fox Nuts Health Benefits
Fox nuts health benefits : తామర కాయలు. చిన్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడు చెరువుల్లో ఈతలు కొట్టినప్పుడు తామర కాయలు కోసుకుని తిన్న రోజులు గుర్తుకొస్తాయి. తామర కాయల్లో ఉండి గింజల్లో సోడియం,మెగ్నీషియం,యాంటీ ఆక్సిడెంట్లుగా పిలిచే ఫ్లెవనాయిడ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. తామర గింజలు మన ఆరోగ్యానికి చాలా చాలా ఉపయోగపడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తామర గింజిలు తింటే ఆరోగ్యం మీ వెంటే ఉంటుంది అని చెప్పవచ్చంటారు న్యూట్రిషనిస్ట్‌లు. తామర కాయలు ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా కాస్తాయి.పండుతాయి కాబట్టి ఇవి ఆరోగ్యానికి చాలా చాలా ఉపయోగపడతాయి. ఒకరకంగా చెప్పాలంటే పండించకుండానే పండే పంట తామర కాయలు. కానీ ఇటీవల కాలంలో తామర కాయల సాగు కూడా చేస్తున్నారు.
తామర గింజల్ని ఫాక్స్ నట్, గొర్గాన్ నట్, మఖానా, ఫూల్ మఖానా.. ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు. వీటిని ఆహారంగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు. ఎరువులు, రసాయన క్రిమిసంహారకాలు లేకుండానే తామరను సాగు చేస్తారు. కాబట్టి ఇది పూర్తి సేంద్రియ పంట. ఈ గింజలలో ఔషధ గుణాలు అపారమని చెబుతున్నారు నిపుణులు.
తామర గింజల్ని పూల్ మఖని అంటారు హిందీలో. మఖని అంటే హిందీలో ఎండినవి అని అర్థం. తామర పువ్వులు ఎడిపోయాక వాటి మధ్యలో ఉన్న గుత్తి కాయలా తయారు అవుతుంది. ఈ తామర గింజల్ని పచ్చిగా తింటే ఎంతో రుచిగా ఉంటాయి.అలాగే అవి బాగా ఎండిపోయాక సేకరించి వాటిని ఉడకబెట్టి గానీ..వేయించుకుని గానీ తింటే కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది.
ముదురు గోధుమ, తెలుపు రంగుల్లో ఉండే ఈ తామర గింజలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఉత్తర భారతదేశంలో వీటితో స్వీట్స్ కూడా తయారుచేసుకుంటారు. తామర గింజలు ఎండిన వాటికంటే పచ్చివాటిలోనే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఈ గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె జబ్బులు, క్యాన్సర్ కారకమయ్యే ఫ్రీరాడికల్స్‌ను దరిచేరకుండా చేస్తాయి.
ఇందులో ఉండే పీచు పదార్థం బరువు తగ్గేందుకు చాలా దోహదపడుతుంది. వీటిల్లో పొటాషియం ఎక్కువగా ఉండడం వలన దీనిని ఆహారంగా తీసుకుంటే బీపీని నివారించవచ్చు. గర్భిణుల, బాలింతలు వీటిని తీసుకుంటే నీరసం రానే రాదు. రక్తహీనత గల రోగులకు తామర గింజలు మంచి మందుగా పనిచేస్తాయి.
ఇంకా తామర గింజలు ఎలా ఉపయోగపడతాయంటే..
-తక్కువ సోడియం, ఎక్కువ మెగ్నీషియం ఉండటం వల్ల గుండె రోగాలు, అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయంతో బాధపడేవారికి ఉపయోగకరం..
-యాంటీ ఆక్సిడెంట్లుగా పిలిచే ఫ్లెవనాయిడ్లు శరీరంలో పేరుకుపోయిన ఫ్రీ రాడికల్స్ ప్రతికూల ప్రభావాల నుంచి కాపాడతాయి.
-పిండిపదార్థాలు పుష్కలంగా ఉండే అన్నం, బ్రెడ్ వగైరా ఆహార పదార్థాలతో పోలిస్తే తామర గింజల్లో ైగ్లెసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. దీంతో మధుమేహ రోగులకు ప్రయోజనకరం. మూత్రపిండాలకు చాలా మంచిది.
– అతిసారం, మూత్ర విసర్జన సమస్యలకూ పరిష్కారం లభిస్తుంది.
-రోజుకు 25 గ్రాముల తామర గింజలు తీసుకుంటే ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకుంటున్నట్లే..
-నిద్రలేమి, గుండెదడ, చికాకు తదితర సమస్యలను తామర గింజలు తగ్గిస్తాయని ఆయుర్వేదం కూడా భరోసా ఇస్తున్నది.ఆహారంలో భాగంగా… తామర గింజలను పచ్చిగా కానీ, వేయించి కానీ తినొచ్చు.
-పొడిగా, టానిక్‌లా, పేస్టులా వాడుకోవచ్చు. పాప్‌కార్న్ కంటే తామర గింజలు శ్రేష్ఠమైనవి..
-వీటిని అలవాటు చేస్తే.. పిల్లలను జంక్ చిప్స్ నుంచి దూరంగా ఉంచవచ్చు. పప్పులు, సోయాబీన్, సజ్జ, జొన్న మొదలైన వాటితో తామర గింజలను మిశ్రమం చేస్తే పోషకాల విలువ మరింత పెరుగుతుంది.