Soaked Nuts : తినటానికి ముందు గింజలను ఎన్ని గంటలు నానబెట్టాలి?…
గింజలను చల్లని నీటిలో కంటే వేడి నీటిలో నానబెట్టటం వల్ల వాటి పైన ఉండే పొట్టను సులభంగా తొలగించటవచ్చు.

Nuts Be Soaked
Soaked Nuts : ఆరోగ్యానికి నట్స్ ను ఆహారంలో భాగం చేసుకోవటం ఎంతో మంచిది. అల్పాహారంగా తీసుకునే నట్స్ల్ లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. వీటివల్ల శరీరానికి ఎక్కవ శక్తి అందటంతోపాటు రోజు మొత్తం ఎనర్జిటిక్‌గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. బాదంపప్పు, వాల్‌నట్స్, శనగలు, వేరుశనగలలో ప్రోటీన్లు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే వీటిని తీసుకునే ముందుగా నానబెట్టటం మంచిది.
నానబెట్టిన వాల్‌నట్ తినడం వల్ల జీవక్రియలు మెరుగుపడతాయి. అంతేకాకుండా పూర్తిగా పరిపక్వతకు చేరని గింజలు ఫైటిక్ రసాయనాలను కలిగి ఉంటాయి. ఫైటిక్ యాసిడ్స్ కలిగిన గింజలను జీర్ణం చేసుకోవటం కష్టతరంగా మారుతుంది. వీటిని నానబెట్టటం వల్ల ఫైటిక్ యాసిడ్ రసాయనాలు తొలగిపోతాయి. దీని వల్ల శరీరం గింజల్లోని పోషకాలను శోషణ చేసుకోవటానికి సులభమౌతుంది. అంతేకాకుండా త్వరగా జీర్ణం కావటానికి వీలుంటుంది.
గింజలను చల్లని నీటిలో కంటే వేడి నీటిలో నానబెట్టటం వల్ల వాటి పైన ఉండే పొట్టను సులభంగా తొలగించటవచ్చు. ఆ నీటిలో కొద్ది మొత్తంలో ఉప్పు చేర్చటం వల్ల అందులో ఉండే ఎంజైమ్ లు తటస్ధీకరించబడతాయి. దుమ్ము, దూళీ వంటి హాని కరమైన అవశేషాలు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది.
కొన్ని రకాల గింజలను నానబెట్టే సమయం తక్కువగా ఉండగా, మరికొన్ని గింజలను ఎక్కవ సమయం నానబెట్టాల్సి ఉంటుంది. వాల్ నట్స్ ను 8గంటలపాటు నీటిలో నానబెట్టాలి. అలాగే బాదం ను 12 గంటలు, గుమ్మడి గింజలు 7గంటలు, జీడిపప్పు 6గంటలు, అవిసె గింజలు 6గంటలు, బ్రోకలీ గింజలు 8గంటలు, శనగలు 8గంటలు, వేరుశనగ గింజలు 7గంటలు ఇలా ఆయా గింజల స్వభావాన్ని, గట్టితనాన్ని బట్టి నానాబెట్టే సమయాన్ని నిర్ణయించుకోవాలి.