పిల్లలకు కరోనా రాకుండా తీసుకోవాల్సిన 6 టిప్స్

  • Published By: Mahesh ,Published On : April 28, 2020 / 12:46 PM IST
పిల్లలకు కరోనా రాకుండా తీసుకోవాల్సిన 6 టిప్స్

Updated On : April 28, 2020 / 12:46 PM IST

ప్రపంచవ్యాప్తంగా దూసుకొస్తున్న మహమ్మారి కరోనావైరస్.. చైనాలోని వూహాన్ లో మొదలైన ఈ వైరస్.. అక్కడి నుంచి అమెరికా, ఇటలీ, ఆఫ్రికా, జపాన్, ఇండియా మొత్తం చుట్టేసింది. ఇటువంటి మహమ్మారి నుంచి మనల్ని కాపాడుకునే క్రమంలో మనం తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు ఏంటి.. పసిపిల్లలను, చిన్నారులకు వైరస్ రాకుండా ఏం పాటించాలి.

హ్యాండ్ హైజిన్ ప్రాక్టీస్:

కరోనా వైరస్ గురించి తెలియకపోతే అదెలా వ్యాప్తి చెందుతుందో ఇంకా తెలుసుకోకపోతే చాలా ప్రమాదం. ఇంట్లో మీరు పాటించే అలవాట్లను చూసి పిల్లలు నేర్చుకుంటారు.  చేతులు తరచూ కడుక్కోవడం, కళ్లను, ముక్కును, నోటిని చేతులు కడుక్కోకుండా తాకకుండా ఉండటం, తుమ్ము వచ్చిన సమయంలో నోటికి, ముక్కుకు అడ్డుపెట్టుకోకపోవడం. ఇంటికి రాగానే చేతులు కడుక్కోవాలని చెప్పడం, టాయిలెట్ కు వెళ్లొచ్చిన తర్వాత, అన్నం తినే ముందు తప్పనిసరిగా చేయాలని 20 సెకన్ల పాటు కడుక్కోమని చెప్పడం.  

చేతులకు హ్యాండ్ శానిటైజర్ తో సరిపెట్టుకోవడం కంటే చేతులను సబ్బుతోనే కడుక్కోవడం బెటర్. కంటికి కనిపించని దుమ్ము కూడా పోతుంది. ఆహారం తినే ముందు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోకూడదని హెచ్చరించాలి. ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే హ్యాండ్ శానిటైజర్ ను వాడాలి. 

షేక్ హ్యాండ్స్‌కు దూరంగా:

మీ పిల్లల్ని షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి దూరంగా ఉంచండి. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో అది కీలకం. ఇదేమంత పెద్ద విషయం కాదని అనుకోవచ్చు. కానీ, పిల్లల్లో సామాజిక దూరంపై అవగాహన లేకపోతే వారికి, వాళ్లతో పాటు మనకు వైరస్ సులువుగా వ్యాప్తి చెందుతుంది. 

ముందుగానే స్టాక్ పెట్టుకోండి:

మీ పాప/ బాబు వయస్సు చాలా చిన్నది అయితే ముందుగానే వైప్స్, డైపర్లు తెచ్చిపెట్టుకోండి. ఒకవేళ మీ బిడ్డకు ఆస్తమా ఉంటే ఇన్హేలర్లు 2తీసుకుని దగ్గర పెట్టుకోండి. అత్యవసరంగా వాడాల్సిన వైద్య సదుపాయం, మందులు కొనుక్కోండి. వీటితో పాటు పాలు కాకుండా ఇచ్చే ఇతర ఆహారాన్ని రెండు వారాల పాటు ముందుగానే స్టాక్ ఉంచుకోండి.

ఎక్కువ ట్రాఫిక్ ప్రదేశాలకు వెళ్లకుండా:

కరోనా వైరస్ వ్యాప్తి గాలి ద్వారా చిన్న చిన్న తుంపర్ల ద్వారా వచ్చే ప్రమాదముంది. ఈ వైరస్ శ్వాస సమస్యలు, దగ్గు, తుమ్ములు, మాటల ద్వారా ఇతరులకు సోకుతుంది. ఆరు అడుగుల దూరం కంటే తక్కువగా ఉంటే వైరస్ వ్యాప్తి సులువుగా జరుగుతుంది. మీరు ఉంటున్న ప్రాంతంలో కరోనా వైరస్ కేసులు నమోదైతే మీరు బయటకు వెళ్లకపోవడమే బెటర్. ప్రత్యేకించి మాల్స్, లైబ్రరీల్లాంటి ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలకు. 

ఇల్లు రెగ్యూలర్‌గా కడుక్కోండి:

మీ చిన్నారిని కాపాడుకోవడానికి, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఇల్లు తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండండి. ఎక్కువగా వాడే ఏరియాల్లో తప్పకుండా శుభ్రం చేసుకోండి. బొమ్మలు, ఫోన్లు, ట్యాబ్లెట్లు, మెట్ల పక్కన ఉండే గ్రిల్స్, ఫ్రిజ్ డోర్లు కూడా ఇదే కోవలోకి వస్తాయి. 

దగ్గు వస్తుంటే:

దగ్గు వస్తున్న సమయంలో కచ్చితంగా టిష్యూని కానీ, మాస్క్ ను అయినా వాడమని చెప్పండి. వాటిలో ఏది లేకపోయిన మోచేతిని మడిచి నోటికి అడ్డు పెట్టుకోమని చెప్పాలి. మీకు వచ్చినా అదే పనిచేస్తే పిల్లలు త్వరగా నేర్చుకుంటారు.