Increase Hemoglobin Naturally : దానిమ్మ నుండి బీట్‌రూట్ వరకు సహజంగా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే ఆహారాలు ఇవే !
క్యాబేజీ కుటుంబానికి చెందిన బ్రోకలి ఐరన్ , బి-కాంప్లెక్స్ విటమిన్ ఫోలిక్ యాసిడ్ మంచి మూలం. మెగ్నీషియం, విటమిన్ ఎ మరియు సి వంటి ఇతర ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఐరన్, హిమోగ్లోబిన్ కౌంట్ పెరగాలంటే ఉడికించి తినవచ్చు.

Increase Hemoglobin Naturally
Increase Hemoglobin Naturally : హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలలో కనిపించే ప్రోటీన్. శరీరం మొత్తానికి ఆక్సిజన్ తీసుకువెళటం రక్త కణాల పని. తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిల వల్ల శరీరం యొక్క పనితీరుపై ప్రభావం పడుతుంది.
READ ALSO : Pistachio For Blood Sugar : పిస్తాలు రక్తంలో చక్కెరను తగ్గిస్తాయా ? వాటిని మీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలంటే..
హిమో గ్లోబిన్ దగ్గతే రక్తహీనత తోపాటు, కాలేయం, మూత్రపిండాల పనితీరుపై ప్రభావంపడుతుంది. హిమోగ్లోబిన్ లోపం కారణంగా అలసట, బలహీనత, కామెర్లు, తరచుగా తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. హిమోగ్లోబిన్ స్థాయిలను సహజంగా పెంచేందుకు కొన్ని ఆహారాలు సహాయపడతాయి.
బీట్‌రూట్‌లో ఐరన్, మెగ్నీషియం, కాపర్, ఫాస్పరస్ మరియు విటమిన్‌లు B1, B2, B6, B12 మరియు C పుష్కలంగా ఉన్నాయి. ఇవి హిమోగ్లోబిన్ కౌంట్‌ని పెంచడానికి ,ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి దోహదపడతాయి. కూరగాయలు, సలాడ్ లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.
READ ALSO : Pumpkin Health Benefits : రక్తంలో చక్కెరస్ధాయిలను నియంత్రించటంలో సూపర్ ఫుడ్ గా.. గుమ్మడికాయ !
మునగ ఆకులలో జింక్, ఐరన్, కాపర్, మెగ్నీషియం మరియు విటమిన్ ఎ, బి మరియు సి వంటి ఖనిజాలు ఉన్నాయి. ఈ మూలకాలన్నీ ఐరన్, హిమోగ్లోబిన్ , ఎర్ర రక్త కణాలకు అవసరం. ఈ ఆకులను బెల్లం కలిపి తీసుకుంటే మరిన్ని లాభాలు పొందవచ్చు. వైద్యుల సలహాతో దాని రసం త్రాగవచ్చు. లేదా గింజలను కూరగా చేసుకుని తీసుకోవచ్చు.
బచ్చలికూర, ఆవాలు, సెలెరీ ,బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పచ్చి ఆకుల్లో ఉండే విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, ఇతర పోషకాలు హిమోగ్లోబిన్‌ను పెంచడానికి పని చేస్తాయి.
READ ALSO : Fighting Diabetes : డయాబెటిస్‌తో పోరాడటంతోపాటు, రక్తంలో చక్కెరను అదుపులో ఉంచే ఈ చిరుధాన్యం గురించి తెలుసా ?
క్యాబేజీ కుటుంబానికి చెందిన బ్రోకలి ఐరన్ , బి-కాంప్లెక్స్ విటమిన్ ఫోలిక్ యాసిడ్ మంచి మూలం. మెగ్నీషియం, విటమిన్ ఎ మరియు సి వంటి ఇతర ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఐరన్, హిమోగ్లోబిన్ కౌంట్ పెరగాలంటే ఉడికించి తినవచ్చు. సలాడ్ రూపంలో లేదా కూరగాయల రూపంలో తీసుకోవచ్చు.
దానిమ్మ ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు,ఫైబర్ అలాగే కాల్షియం, ఇనుము వంటి వాటికి మూలం. హిమోగ్లోబిన్ పెరగడమే కాకుండా ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఐరన్,హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి ప్రతిరోజూ దానిమ్మ రసం త్రాగాలి.
READ ALSO : Kadwa Badam : రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దోహదపడే కద్వా బాదం !
తక్కువ హిమోగ్లోబిన్ కారణాలు, లక్షణాలు ;
తక్కువ హిమోగ్లోబిన్‌కు అనేక కారణాలు ఉంటాయి. ఇందులో ప్రధానంగా ఆహారంలో ఇనుము ,విటమిన్ B-12 లోపం, రక్త క్యాన్సర్, మూత్రపిండాలు , కాలేయ వ్యాధి, థైరాయిడ్, తలసేమియా, ఊపిరితిత్తులకు సంబంధించిన ఏదైనా వ్యాధి కారణం కావచ్చు.
హిమోగ్లోబిన్ లోపం లక్షణాలు ;
గుండె దడ
చర్మం పసుపు రంగులోకి మారడం, చిగుళ్ళలో రక్తస్రావం
అలసటగా, బలహీనంగా అనిపిస్తుంది
కండరాల బలహీనత
అలసటతో నిరంతర తలనొప్పి
శ్వాస ఆడకపోవుట
ఇలా వివిధ లక్షణాలు హిమోగ్లోబిన్ లోపం కారణంగా కనిపిస్తాయి. ఈ సమయంలో వైద్యుల సూచనలు, సలహాలు పాటించటం మంచిది.
గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిని సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.