Gain Weight : పిల్లలు ఆరోగ్యంగా బరువు పెరగాలంటే!…
గోధుమలతో చేసిన చపాతీలు పిల్లలకి తినిపించటం మంచిది. పాల పదార్థాల ద్వారా పిల్లలు తొందరగా బరువు పెరుగుతారు. ఎందుకంటే ఇందులో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.

Hight Grow Food
Gain Weight : పోషకాహార లోపం కారణంగా చాలా మంది చిన్నారులు తగినంత బరువు లేకపోవటం , ఆరోగ్యపరమైన చిక్కులు ఎదుర్కోవటం జరుగుతుంది. బరువు తక్కువగా, సన్నగా ఉండేవారిలో ఆరోగ్యాసమస్యలు అధికంగా ఉత్పన్నమౌతున్నాయి. బరువు తక్కువగా ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలి. వారి ఎదుగుదలకు అవసరమైనా ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రస్తుత పరిస్ధితిల్లో పిల్లలు ఎక్కువగా జంక్‌ఫుడ్‌ని లైక్ చేస్తున్నారు. జంక్ ఫుడ్ లో ఫ్యాట్, షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారం వల్ల పిల్లలు కొంతమేర బరువు పెరిగినప్పటికీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తుతాయి. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఈ ఆహారం ఊబకాయానికి కారణమైతుంది. బరువు తక్కువగా ఉండే పిల్లలకు కొన్ని రకాల ఆహారాలను రోజు వారి డైట్ లో చేర్చటం వల్ల వారు ఆరోగ్యంగా బరువు పెరగేందుకు అవకాశం ఉంటుంది.
ప్రతిరోజు పిల్లలకు రెండు ఎగ్స్ ను ఉడకబెట్టి ఇవ్వాలి. పిల్లల బరువును పెంచటంలో గుడ్లు ఎంతో దోహదపడతాయి. కండరాలు బలంగా తయారయ్యేందుకు సహాయపడతాయి. వారానికి ఒకసారైనా చిన్నారులకు చికెన్ అందించాలి. చికెన్ హై క్యాలరీ , హై ప్రొటీన్ ఉంటుంది. చికెన్ లో ఉండే ఫాస్పరస్ వల్ల ఎముకలు పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
గోధుమలతో చేసిన చపాతీలు పిల్లలకి తినిపించటం మంచిది. పాల పదార్థాల ద్వారా పిల్లలు తొందరగా బరువు పెరుగుతారు. ఎందుకంటే ఇందులో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎముకలను బలంగా తయారు చేస్తుంది. పిల్లలకి పాలు తాగడం ఇష్టం లేకపోతే వెన్న, నెయ్యి, పెరుగు, పనీర్ రూపంలో ఇవ్వాలి. బరువు పెరగటానికి చేపలు బాగా ఉపకరిస్తాయి. సాల్మన్ రకం చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. విటమిన్ బీ 12, సెలీనియం, కొలీన్ ఉంటాయి. ఇవి పిల్లల మెదడు చురుకుగా ఉండేలా చేయటంతోపాటు బరువు పెరగటానికి ఉపకరిస్తాయి. తేనె సైతం పిల్లలు ఆరోగ్యంగా బరువు పెరిగేందుకు ఉపకరిస్తుంది. రోజు తగిన మోతాదులో వివిధ రూపాల్లో తేనెను పిల్లలకు ఇవ్వవచ్చు.
సీజనల్ ఫ్రూట్స్ తినాలి. ప్రతిరోజు పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. సరైన పోషకాలు అందుతాయి. అరటిపండులో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది కేలరీలు, ఐరన్‌తో నిండి ఉంటుంది. బరువు పెరగడానికి అరటిపండు సూపర్ ఫుడ్‌గా చెప్పవచ్చు. చెరకు నుండి తయారైన బెల్లం రోజుకొక చిన్న ముక్కను అందించటం మంచిది. దీని ద్వారా ఆరోగ్యకరమైన క్యాలరీలు అందుతాయి. వారికి నచ్చిన ఫుడ్ లను ఈ బెల్లం కలుపుకుని తినమని సూచించవచ్చు.