Iron Cookware : ఇనుప పాత్రల్లో వంట చేస్తే శరీరానికి కావాల్సిన ఐరన్ దొరుకుతుందట.. నిజమేనా?

ఇనుప పాత్రల్లో వంట చేస్తే బాడీకి కావాల్సిన ఐరన్ దొరుకుతుందట. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ డైటెటిక్ అసోసియేషన్ వారి అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

Iron Cookware : ఇనుప పాత్రల్లో వంట చేస్తే శరీరానికి కావాల్సిన ఐరన్ దొరుకుతుందట.. నిజమేనా?

Iron Cookware

Updated On : September 22, 2023 / 12:38 PM IST

Iron Cookware : శరీరానికి కావాల్సిన కీలకమైన పోషకం ఐరన్. ఇది బాడీకి కావాల్సిన శక్తిని ఇస్తుంది. చర్మం, జుట్టుతో పాటు ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది. ఇది లోపిస్తే మైకం కమ్మడం, అలసట, స్లీప్ అప్నియాకి దారి తీస్తుంది. అందుకే వైద్యులు మనం తినే ఆహారంలో ఖచ్చితంగా ఐరన్ చేర్చుకోవాలని చెబుతారు. దీంతో పాటు రోజు వంటలు ఇనుపపాత్రల్లో వండటం వల్ల మీరు తినే ఆహారంలో ఐరన్ చేరుతుందట.. అదెలా?

Vitamin C Drinks : శరీరంలో ఐరన్ స్ధాయిలను పెంచే విటమిన్ సి డ్రింక్స్ ఇవే!

ఐరన్ కుక్ వేర్ శరీరంలోని ఐరన్ స్ధాయిని పెంచడంలో ఎలా సాయపడతాయి? అంటే జర్నల్ ఆఫ్ ది అమెరికన్ డైటెటిక్ అసోసియేషన్ వారి అధ్యయనం ప్రకారం 20 రకాల ఆహారాలను ఇనుప పాత్రల్లో వండటానికి ముందు తరువాత పరిశీలించారట. వండినపుడు దాదాపుగా 90 శాతం ఐరన్ ఉన్నట్లు కనుగొన్నారు. ఈ అధ్యయనంలో ఐరన్ వంట పాత్రల్లో ఆమ్ల పదార్ధాలు వండకూడదని సూచనలు చేసారు. ఎందుంటే ఇవి ఆహారంలోని పోషకాలను నాశనం చేస్తాయి.

Carissa Carandas : చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచటంతోపాటు ఐరన్ లోపాన్ని నివారించే వాక్కాయలు!

ఇనుప పాత్రల్లో నిమ్మ, వెనిగర్ వంటి వంట పదార్థాలు వాడకూడదు. వంట చేసిన తర్వాత ఎక్కువసేపు ఆహారాన్ని ఇనుప పాన్‌పై ఉంచకూడదు. ఐరన్ ప్యాన్ చాలాసేపు వేడిగా ఉంటుంది. మీరు గ్యాస్ ఆఫ్ చేసినా కూడా ఆహారం ఉడుకుతుంది. అతిగా ఉడకడం వల్ల ఆహారంలోని పోషకాలు నాశనం అవుతాయి. ఇంట్లోని ఇనుపపాత్రలను శుభ్రపరిచేటపుడు హార్డ్ స్క్రబ్‌తో తోమకండి. కొంచెం ఉప్పు, బేకింగ్ సోడాతో రుద్ది శుభ్రం చేసుకోవాలి.